1
ఓ రహస్య ప్రేయసీ!
నేనొచ్చేలోగా కదులుతున్న బస్సు లోంచి
అల్విదా చెపుతూ
వూపిన చేతినీడల్లోంచి
కన్నుల్లో మెరిసిన
జలాసయాలలో మునిగితేలుతున్నా
ఉతికి ఆరేసిన వస్త్రాల్లా జ్ఞాపకాలను
కాలంక్లిప్పులకెప్పుడో తగిలించా
ఇప్పుడవి పీలికలు పీలికలుగా
బయట పడ్తున్నాయి
2
నేనొచ్చేలోగా కదులుతున్న బస్సు లోంచి
అల్విదా చెపుతూ
వూపిన చేతినీడల్లోంచి
కన్నుల్లో మెరిసిన
జలాసయాలలో మునిగితేలుతున్నా
ఉతికి ఆరేసిన వస్త్రాల్లా జ్ఞాపకాలను
కాలంక్లిప్పులకెప్పుడో తగిలించా
ఇప్పుడవి పీలికలు పీలికలుగా
బయట పడ్తున్నాయి
2
ప్రేమంటే తెలియని
ఏ చిహ్నాల మద్యనో
చిగురించిన పచ్చదనాన్నో
వలచి వలచి
ఏకంకాని రైలుపట్టాలమయ్యాము.
కాలచక్రాలు కదిలిపోతుంటే
మారింది నువ్వో… నేనో…?
ఏ చిహ్నాల మద్యనో
చిగురించిన పచ్చదనాన్నో
వలచి వలచి
ఏకంకాని రైలుపట్టాలమయ్యాము.
కాలచక్రాలు కదిలిపోతుంటే
మారింది నువ్వో… నేనో…?
3
స్వప్న రాగాలకేం
అన్నీతానై పలికిస్తుంది
ఒక్కో స్వరాన్ని పల్కడానికి
ఎన్ని నరాలు తంతిలయ్యే సమన్వయమో!
నదిపై పిల్లగాలి
అలల్ని తెచ్చినట్టు తేలియాడిస్తుంది
తెరచాపెత్తిన పడవలో
ఈలపాటై గానమాలపిస్తుంది
అన్నీతానై పలికిస్తుంది
ఒక్కో స్వరాన్ని పల్కడానికి
ఎన్ని నరాలు తంతిలయ్యే సమన్వయమో!
నదిపై పిల్లగాలి
అలల్ని తెచ్చినట్టు తేలియాడిస్తుంది
తెరచాపెత్తిన పడవలో
ఈలపాటై గానమాలపిస్తుంది
4
ఇప్పుడు జ్ఞాపకాలు
జడివానై కురుస్తున్నాయి
తడిసిన దేహంతో
ఈ వంటరి రాత్రి దాటేదెలాగో?
నన్ను నేను చూసేందికు
నలుమూల్నించీ
మెరుపు తళుక్కుమంటోది
తడిపిన తనమేదో
చలై మెలిపెడ్తున్నా
ఒకొక్కటిగా విప్పే వస్త్రాలలో
ఒక్కో రూపమైపోతున్నావు
5
జడివానై కురుస్తున్నాయి
తడిసిన దేహంతో
ఈ వంటరి రాత్రి దాటేదెలాగో?
నన్ను నేను చూసేందికు
నలుమూల్నించీ
మెరుపు తళుక్కుమంటోది
తడిపిన తనమేదో
చలై మెలిపెడ్తున్నా
ఒకొక్కటిగా విప్పే వస్త్రాలలో
ఒక్కో రూపమైపోతున్నావు
5
మన పరిచయం ఎక్కడిది?
అక్షరాలవెనుక బలపమై
పరుగెట్టిన పక్కింటి పరిచయమా!
పాఠశాలనుండి హైస్కూలుకు ఎదిగి
వయసు వయ్యారమేదో దూరంచేస్తుందని
పూలరేక సొగసుల్ని జతచేసి
కవితాగానాన్ని నేర్పేందుకు
నీవిచ్చిన తొలి లేఖ
అర్థంకాని కన్నుల్లో ఏ స్వప్నాన్ని వెదికావో?
ఇప్పుడు నవ్వొస్తుంది కదూ!
6
అక్షరాలవెనుక బలపమై
పరుగెట్టిన పక్కింటి పరిచయమా!
పాఠశాలనుండి హైస్కూలుకు ఎదిగి
వయసు వయ్యారమేదో దూరంచేస్తుందని
పూలరేక సొగసుల్ని జతచేసి
కవితాగానాన్ని నేర్పేందుకు
నీవిచ్చిన తొలి లేఖ
అర్థంకాని కన్నుల్లో ఏ స్వప్నాన్ని వెదికావో?
ఇప్పుడు నవ్వొస్తుంది కదూ!
6
ప్రతి సంవత్సరం
ఉత్తీర్ణులమై తరగతి గది వదిలేస్తుంటే
ఎంతవుత్సాహంగా వుండేదో!
ఊరికున్న హైస్కూలును వదిలేసాం కదా!
ఇప్పుడది
కాన్వెంటుకు పోతున్న పిల్లల్ని చూసి
దారితప్పిన వంటరి పక్షిలా
బిక్కుబిక్కుమంటూంది
ఉత్తీర్ణులమై తరగతి గది వదిలేస్తుంటే
ఎంతవుత్సాహంగా వుండేదో!
ఊరికున్న హైస్కూలును వదిలేసాం కదా!
ఇప్పుడది
కాన్వెంటుకు పోతున్న పిల్లల్ని చూసి
దారితప్పిన వంటరి పక్షిలా
బిక్కుబిక్కుమంటూంది
మనం ఆడిన ఆటలకు
సాక్షిగా నిలిచిన సూరయ్యతోట
నామరూపాలు కోల్పోయినట్టే
ఆటలుకూడా కనుమరుగయ్యాయి కదా!
సాక్షిగా నిలిచిన సూరయ్యతోట
నామరూపాలు కోల్పోయినట్టే
ఆటలుకూడా కనుమరుగయ్యాయి కదా!
ఇప్పుడు
మార్కుల రేసులు
కంప్యూటరు చిప్సు బాల్యమయ్యింది
7
మార్కుల రేసులు
కంప్యూటరు చిప్సు బాల్యమయ్యింది
7
విడిపోయిన మనకాలేజీ దార్లకు
ఎన్ని రహస్యమార్గాలు వెతక లేదూ!
జీవితమెప్పుడూ
అద్దంలో భూతంలా కనపడలేదు
కలుసుకున్న క్షణాలన్నీ
కబుర్లై గడిపెయ్యలేదూ!
8
ఎన్ని రహస్యమార్గాలు వెతక లేదూ!
జీవితమెప్పుడూ
అద్దంలో భూతంలా కనపడలేదు
కలుసుకున్న క్షణాలన్నీ
కబుర్లై గడిపెయ్యలేదూ!
8
అత్తయ్యా! అంటూ అడుగెట్టగానే
ఎంత గుండె దడ దడ!
ఇప్పుడా గుండె చప్పుళ్ళేవి?
ముసిముసిగా నవ్విన మౌనాన్ని
శాస్త్రంగా రాయాలనుందిప్పుడు
కానీ
ఆ నవ్వున నిగారింపేదీ?
ఎక్కడా
ఎవ్వరిలోనూ కనపడదేం?
జీవనయానం కోసం బందీలౌతూ
నవ్వుల్ని తాకట్టు పెట్టేందుకు
ఎక్కడెక్కడికో వలసపోతున్నాం కదూ!
అయినా
అమ్మ నీకు ఎలా అత్తయ్యిందో?
ఎంత గుండె దడ దడ!
ఇప్పుడా గుండె చప్పుళ్ళేవి?
ముసిముసిగా నవ్విన మౌనాన్ని
శాస్త్రంగా రాయాలనుందిప్పుడు
కానీ
ఆ నవ్వున నిగారింపేదీ?
ఎక్కడా
ఎవ్వరిలోనూ కనపడదేం?
జీవనయానం కోసం బందీలౌతూ
నవ్వుల్ని తాకట్టు పెట్టేందుకు
ఎక్కడెక్కడికో వలసపోతున్నాం కదూ!
అయినా
అమ్మ నీకు ఎలా అత్తయ్యిందో?
ఎన్నడైనా
మతంవేరని కులంవేరని అనుకున్నామా?
మతంవేరని కులంవేరని అనుకున్నామా?
అన్నట్టు
ఇప్పుడొచ్చిపలకరించాలన్నా
అత్తయ్య లేదు తెలుసా?
విడివడిపోతున్న బంధాలకు
దూరంగా జరిగింది.
.............................ఇంకావుంది
ఇప్పుడొచ్చిపలకరించాలన్నా
అత్తయ్య లేదు తెలుసా?
విడివడిపోతున్న బంధాలకు
దూరంగా జరిగింది.
.............................ఇంకావుంది
1 comment:
జాన్ గారూ,
మీరు కవిత్వంతో పరుగెడుతున్నట్టున్నారు.
కానివ్వండి
Post a Comment