ప్రియా! రా!
కొత్త వనం కోసం
పూలొచ్చేవరకూ పనిచేద్దాం
మనం లేనప్పుడవి
మనగురించి మాట్లాడతాయి
పూలపరిమళాలతో
మనమాటల్ని మోసుకెళతాయి
బహుశ
మనం తక్కువే మట్లాడుకున్నాం
ఈ వనంలోని మొక్కలు
మనపాదాల చప్పుళ్ళను గుర్తుపడ్తాయి
వాటికి మధురమేదో తెలుసు
ఎప్పుడైనా
ప్రేమికులు ఈ వనంనుంచి వెళ్ళుతున్నప్పుడు
అనుభూతి స్పర్శను అనుభవించాలి
మబ్బులు గొడుగుపడ్తాయి
కోకిల కొత్తపాట పాడుతుంది
పాలపిట్ట రేకలపై వూగుతుంది
మళ్ళీ మనం కలుస్తామో లేదో!
పరిమళం మిగిలేవుంటుంది
ఎన్నటికీ ఎన్నటెన్నటికీ
ప్రియా! రా!
కొత్త వనంకోసం పనిచేద్దాం.
కొత్త వనం కోసం
పూలొచ్చేవరకూ పనిచేద్దాం
మనం లేనప్పుడవి
మనగురించి మాట్లాడతాయి
పూలపరిమళాలతో
మనమాటల్ని మోసుకెళతాయి
బహుశ
మనం తక్కువే మట్లాడుకున్నాం
ఈ వనంలోని మొక్కలు
మనపాదాల చప్పుళ్ళను గుర్తుపడ్తాయి
వాటికి మధురమేదో తెలుసు
ఎప్పుడైనా
ప్రేమికులు ఈ వనంనుంచి వెళ్ళుతున్నప్పుడు
అనుభూతి స్పర్శను అనుభవించాలి
మబ్బులు గొడుగుపడ్తాయి
కోకిల కొత్తపాట పాడుతుంది
పాలపిట్ట రేకలపై వూగుతుంది
మళ్ళీ మనం కలుస్తామో లేదో!
పరిమళం మిగిలేవుంటుంది
ఎన్నటికీ ఎన్నటెన్నటికీ
ప్రియా! రా!
కొత్త వనంకోసం పనిచేద్దాం.
No comments:
Post a Comment