Wednesday, June 6, 2007

వరద అనేకరూపాలు

హలో!
నేనిప్పటికీ బ్రతికేవున్నా
ఆర్థికవిదానాల గట్లు తెగి
ప్రవహిస్తున్న వాహనాల
వరదలో చిక్కుకున్నా.
ప్రపంచ బ్యాంకు
పరుస్తున్న తాజా అప్పుల పిజ్జాలతో
విస్తరిస్తూ
మావూరిమీదిగా పోతున్న రహదారికి
ఇరువైపులా తవ్విన
గోతులమద్య చిక్కుకున్నాను.
నాలాగే చిక్కుకున్న
అందరిలోనూ
అధికమించాలనే
ఆత్రమేదో ప్రవహిస్తోంది
ఎటుచూసినా కనుచూపుమేరా
వాహనాల వరద
రెండు చక్రాలు
నాల్గు చక్రాలు
ఆరు చక్రాలు
పది చక్రాలు
ఇంధనం పొగలై కమ్మి
పరవళ్ళు తొక్కుతోంది
రేగిన దుమ్ము నురగలు కక్కుతోంది
ఊపిరి సలుపని ఉక్కిరి బిక్కిరి నడుమ
తడారిపోతున్న గొంతుక్కి
గుక్కెడు నీళ్ళు కరువైనా
తరంగాలు తరంగాలుగా సెల్ ఫోన్ల మోత
సరికొత్త రాగాలుతో
ప్రతి జేబుల్లో గారాలు పోతున్నాయి
రాబోయేతరానికి
ప్రత్యేక రహదారికోసం
వంపుతున్న వరదతో
రోడ్డుదాటాల్సిన వార్ని ముచుతూనే వుంది
బహుశ
కాంట్రాక్టరు ఎవరితో కల్సి
ఎసీ గదిల్లో ఏ వరదలో మునుగుతున్నాడో
ఇప్పటికి మునుగుతున్నానో, తేలుతున్నానో
ఏదోక తీరంచేరాక
ఇంకా చార్జింగు మిగిలుంటే
హలో
ఈ గొంతు పలుకుతుంది.

2 comments:

Ajit Kumar said...

హలో ... హలో....ఏమిటో ఈ బుల్డోజర్ల, క్రేన్ల గోలలో ఏమీ వినిపించట్లేదు.జాన్ గారూ అభివృద్ధి జరుగుతుంది.కొంచం హైడవండి.

Anonymous said...

మీ కవిత్వం లో ఎంతో అర్ధం దాగుంది. మీ గురించి, మీ కవితా కాంక్ష గురించి తెలుసుకోవాలనివుంది.