ప్రస్తుత దూర ప్రయాణాలురాత్రులకు అలవాటు పడ్డాయి
ప్రయాణిస్తూ నిదురోవచ్చు
నిదురోతూ ప్రయాణించొచ్చు
దూర ప్రయాణాన్ని పగటికి మార్చినిద్రపోలేని ప్రయాణం
కిటికీలను ఛేదించుకుంటూ వచ్చేఎండపొద నుండిమెలమెల్లగా తప్పుకుంటూ
అప్పుడప్పుడూఎదురయ్యే వాహనాల రొద వింటూ
మేల్కొన్న ఊర్లతో కళ్ళతోనే సంభాషిస్తూ
దాటుకుంటూ గమన ఆగమనాల మధ్యఎక్కే దిగే ప్రయాణికుల్ని గమనిస్తూ
గమ్యం నగరం వైపు
నక్షత్రాల గుంపుల కోసం
జాబిల్లి తలుపు తెరచి చూసే వేళకు గూటికి చేరాలని
ప్రియసఖితోనోచిట్టితల్లులతోనో పంచుకోవాలని ప్రయాణం
తిరిగే చక్రంప్రగతికి చిహ్నమన్నట్టు
పరుగెడుతున్న బస్సు చక్రానికిఆలోచనల్ని బిగించుకొని
ఒకటే చక్రభ్రమణం
నా చుట్టూ నేనే!నీ చుట్టూ నేనే!!
చింత తోపుల మధ్య పరుగెడుతున్న బస్సుఆలోచనల్ని జ్ఞాపకాల్ని
కాయలకో కొమ్మలకో తగిలించిపరుగెడుతూనే వుంది
ప్రయాణభారమంతకట్టెలమోపు
కళ్ళల్లోంచి గుండెల్లోకి దింపుకుంటూ… నేను
హఠాత్తుగా ఏర్పడ్డ అల్పపీడన వర్షంలా
మనసంతా ఒకటే చిత్తడి చిత్తడి
ధారలు ధారల కనుల వర్షం
ఏదో తెలియని అలజడి
బహుశఎన్నో ఏండ్లుగాగుండె లోతుల్లో
‘నిన్ను ప్రేమిస్తున్నాను’ ప్రియుడా!
వొంపులు దేరుతున్న దేహసౌర్యాన్నిపొగడుతున్న అల్ల్లి మాటలకుమోహించి పరవశించి
నీ ప్రేమను చీదరించానేమో!
హంసతూలికా తల్పాలను కలగంటూ
కుక్కి మంచాలను కాలతన్నాను
నన్ను ఆరాధిస్తున్న కళ్ళ తడినిపసిగట్టలేని పొరలేవో కమ్మేస్తూనే వున్నాయి.
అది ఉదయమోసాయంత్రమో
గేదె తోకలై వేలాడి పోగుచేసినపేడను పిడకలు చేసినాల్గునూకల గంజి కోసంమండటాన్ని చూస్తున్నాను
వెలిగీ వెలగని పిడకల్లోంచిరేగే పొగలో వర్షిస్తున్న కళ్ళను చూస్తున్నాను
తురతురమంటూ కాల్తున్న చితుకులుగానోకణకణమండే నిప్పుకణికల కట్టెగానోకాలిపోయిన సజీవ కట్టెలు చూస్తున్నాను
యెష్షయి మొద్దు నుంచేనాఎండిన కట్టెల్లోంచి చిగురు పుట్టదా?
( కత్తి పద్మారావు రాసిన “కట్టెలమోపు” కవిత చదివిన తర్వాత రాసాను. )
1 comment:
మీ గురించి ఇలా తెలుసుకోగలిగినందుకు,ఇలా కలుసుకున్నందుకు చాలా ఆనందం గా వుందండి.
Post a Comment