మనసు శరీరం రెండూ అంతగా అదుపులో లేవు. జ్ఞాపకాలు ఏవీ జ్ఞప్తికి రావటంలేదు. అయినా
టైపుచెయ్యాలని వేళ్ళు ఉబలాటపడుతున్నాయి.
టైపుచెయ్యాలని వేళ్ళు ఉబలాటపడుతున్నాయి.
పరుగెడుతున్నవయస్సులో వెనక్కు చూడటం కుదరుదు కదా! ఇప్పుడు నిలబడ్డవయస్సులో వెనక్కు తిరిగి చూసుకుంటే ఎన్నో మలుపులు, సంఘటనలు, తారసపడ్డ వ్యక్తులు, ప్రయాణాలు, మజిలీలు, ....ఇవన్నీలేకుంటే జీవితమెలా అవుతుంది?
నన్ను మలుపుతిప్పిన ఒకానొక వ్యక్తి కలిసినచోటుకు తిరిగి ప్రయానిద్దాం ఇప్పుడు.
నేను అనుపమ ప్రింటర్స్‌లో(1986-88మధ్య) కంపోజిటరుగా పనిచేస్తున్న రోజులు. కాంతమ్మ జ్ఞాపకాలతో డైరీ అనుకుంట కంపోజింగు చేస్తున్నాము. అక్కడ ఇద్దరం పనిచేసేవారం. నేను లైన్లు మాత్రం కంపోజింగు చెయ్యాలి, పేజీసెట్టింగు, ప్రింటింగు మిషనుకు అనువుగా కావలసినవన్ని వేరే అతను చూసుకొనేవాడు. సాయత్రం ఒక పెద్దాయన వచ్చి మేము చేసినవాటి ప్రూఫ్‌లను చూసి తప్పు ఒప్పులను చూసి వెళ్ళేవారు. మొదట్లో పెద్ద ఆశక్తి ఏమీ అనిపించలేదు కానీ పోను పోనూ ఆయన మాటలకు చెవిపెట్టడం అలవాటయ్యింది. మొదట ఆయన గురించి తెలియదు, ఓ రోజు ఓపెన్ యూనివర్సిటీ గురించిన ప్రస్తావనలో, ఆయన రేడియోస్టేషనులోఉన్నప్పుడు విన్న వార్తకు స్పందిస్తూ, అప్పుడే పొందిన పారితోషికాన్ని మంత్రిగారికి పంపడం తదనంతర ప్రక్రియలవల్ల ఓపెన్ యూనివర్సిటీ ఆవిర్భావం గురించి చెప్పారు. ఆ మాటలు నన్ను అబ్బురపరచాయి. అప్పుడు నేనూ ఇందులో చదవొచ్చుకదా అనే ఉత్సాహం కలిగింది. కొంతకాలంగా వదిలేసిన విద్యను మల్లీ కొనసాగించడానికి వీలు కలిగింది. తర్వాతికాలంలో నా వృత్తిని మార్చుకోవడానికి ఆసరా అయ్యింది

ఎందువల్లనో ఆయన్ని మళ్ళీ కలవలేకపోయాను
కవిత్వం చదవడం, రాయడం మొదలుపెట్టాక 2003లో నా మొదటిపుస్తకం "హృదయాంజలి" ఎదో సాహిత్యకార్యక్రమంలో కలిసినప్పుడు ఇవ్వడం జరిగింది. తరువాత ఓ రోజు ఫోనుచేసి అభినందించారు. అడపా దడపా ఆయన్ని ఎదో కార్యక్రమంలో కలిసినా ఎందుకో నేనుగా ఆయన్ని కలవలేకపోయాను అనే బాధ కలుగుతుంది.
చాలాసార్లు కలవాలి అనుకోవడం అది ఎదో కారణాలతో అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడం ఎందుకో అర్థంకాని విషయం. ఆ వెలితి అలానే ఉండిపోతుంది.
ఆయన ఇప్పుడు తన కాంతమ్మను కలవడానికి వెళ్ళాడు. తను నడిన దారివెంబడి కొన్ని విత్తనాలను చల్లిపోయాడు. మొలకలెత్తిన విత్తనం చెట్టై ఎవరోఒకరికి నీడనిస్తుంది
No comments:
Post a Comment