Friday, September 6, 2013

గురువులను తలచుకోవడం భాగ్యమే


గతంలో నా బాల్య విద్యాభ్యాసాల గురువుల్ని జ్ఞాపకంచేసుకున్నాను. తరచూ మారుతున్న ఊర్లవల్లనో లేక నా జ్ఞాపకశక్తి లోపమో గాని లేక నా అనాసక్తో తెలియదు గాని చాలామంది పేర్లు గుర్తులేవు.

9వ తరగతినుంచి ఇంటర్మీడియెట్ వరకు  మా నాన్నగారంటే భయపడి తప్పించుకునేవాణ్ణి. ఆయన పనిచేసేది రెవెన్యూ డిపార్టుమెంటు అయినా మేము చదువుకునే సమయానికి ఆయనకు సమయం కుదిరితే షేక్సిపియర్ గురించో, బెర్నడ్ షా గురించో చెబుతుండేవారు. అలాంటి సమయంలో నేను లెక్కల పుస్తకాల్లోకి దూరేవాణ్ణి. ఆయనకు లెక్కలంటే భయం అదీ సంగతి.   అయితే ఇప్పుడర్థమవ్వుతుంది నాకు పరోక్షంగా కవిత్వంపై మక్కువ నాన్న కల్పించారని.

గురువులను తలచుకున్నప్పుడు 9, 10వతరగతులలో ప్రభావితంచేసిన ముగ్గుర్ని ముఖ్యంగా గుర్తు  చేసుకోవాలి.
శ్రీ సైమన్ - తెలుగు
శ్రీ ఆండ్రూస్ - ఇంగ్లీషు
శ్రీ జార్జి - లెక్కలు ... మాష్టార్లు. (జేవియర్స్ హైస్కూలు, ఏలూరు) వారు నేర్పినవే నాల్గక్షరాలు నాల్కలపై ఇంకా నానుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
అదేమి చిత్రమోగాని 10వ తరగతిలో  తెలుగుమాష్టారు ఎప్పుడూ కోపంగావుండేవారు.  పాఠాలుకూడా చాలా సీరియెస్‌గా   చెప్పడంవల్ల తెలుగంటే భయపట్టుకుంది. ఆ భయం కాస్తా ఇంటర్మీడియేట్‌లో హిందీ చదివేటట్టుచేసింది. హిందీ చెప్పిన మేడం పేరు  గుర్తులేకపోవడమే నాకు ఎప్పటికీ అర్థంకాని విషయం.  కానీ ఇన్నేళ్ళతర్వాత కూడా ఆమె చెప్పిన హిందీ సాహిత్యం గుర్తుకొస్తుంది. అలా పరోక్షంగా ఇప్పటి నా సాహిత్యాభిరుచికి ఆమె పునాదివేసింది అనిపిస్తుందిప్పుడు.

ఆమె పేరు శ్రీమతి వరలక్ష్మి (అప్పటికి ఇంకా శ్రీమతి కాలేదని గుర్తు) అని ఇప్పుడే ఆన్‌లైన్లోకివచ్చిన మిత్రుడు చెప్పాడు.
దోహేలు గుర్తుచేసుకున్నప్పుడు  ఇప్పుడే  తరగతి గదిలో  వున్నట్టే అనిపిస్తుంది నాకు.
నవల ఒకటి నాండిటేల్ వుండేది  నవలపేరు గుర్తులేదు కాని నవలలోని ముఖ్యఘట్టాలు ఇంకా గుర్తున్నాయి. 
హిందీ క్లాసుకు కొసమెరుపు ఏమిటంటే వరలక్ష్మి గారు అందంగా వుండటమే కాకుండా మధురంగా పాఠం చెప్పడం, అన్ని గ్రూపులలో వున్న విద్యార్ధిని , విద్యార్థులు ఒక్కచోటకు చేరటం. అంతే కాక మగపిల్లకంటే, అమ్మయిలే ఎక్కువగా వుండటంవల్ల క్లాసు అందంగాను, రంగురంగులగాను వుండటంవల్ల ఒక్క క్లాసుకూడా మిస్సు కాలేదని గుర్తు.  
తర్వాత కాలంలో డిగ్రీలో పెద్దగా ప్రభావితంచేసినవాళ్ళు లేకపోవడంవల్ల ఎవ్వరూ గుర్తు  లేరు.
* * *

కవిత్వాన్ని ఆశ్రయంగా పొందాక మొదటి గురువు శ్రీ సి.వి. కృష్ణారావు  గారు.

మొదట పరిచయం అయినప్పుడు "నెలనెలా వెన్నెలకు" వస్తూవస్తూ ఓ రెండు కవితలు పట్టుకు రావడం మరిచిపోకండి అని పోనుచేసి చెప్పేవారు. నెలంతా రెండు కవితలు రాయాలి అనే అలోచన మనసులో కదులుతూ వుండటంవల్ల కొన్ని సార్లు నెలంతటిలో ఒక్కటీ రాయలేకపోవడం, ఒక్కోసారి ఒకటికంటే ఎక్కువ రాయడం  అనుభవం.  బహుశ ఈయన ప్రభావంవలననే కవిత్వం నిత్యకృత్యమైయ్యింది.  
ఆయన నన్ను అడిగే రెండు ప్రశ్నలు ఎప్పుడూ స్ఫూర్తిగానేవుంటాయి.  కొత్తవేమిరాసారు అని మొదటిది. కొత్త పుస్తకాలు ఎమి సంపాదించారు అని రెండవది.
ఆయనతో గడిపిన సమయమంతా ప్రపంచ సాహిత్యాన్ని చుట్టివచ్చినట్టే వుండెది. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అన్పిస్తుంది


***


కవిత్వాన్ని రాయడం ప్రారంభించాక కొందరి కవిత్వం నన్ను ఆకర్షించింది. వారిని గురువులుగానే స్వీకరిస్తాను
శివారెడ్డి - ఈయన కవిత్వాన్ని  చదివినప్పుడు, ఆయనతో సమయం గడిపినప్పుడు ఏమనిపించిందో గమనించలేదు గానీ గుండె ఆపరేషను అయ్యి పడకమీదవున్నప్పుడు ఆయన కవిత్వాన్ని వల్లెవేయడం నాకు నాకే ఆశ్చర్యమనిపించిన విషయం.

జ్వాలాముఖి - అనర్గళమైన ఆయన ప్రసంగాలు వింటున్నప్పుడు దాని వెనుకవున్న ఆయన కృషి, సాధన కన్పించాయి. ఆయనలా అనర్గళంగా మాట్లాడంటే చేయాల్సిన కృషి ఎప్పుడూ గుర్తుకువచ్చేది.



కె. శివారెడ్డి, కె.యెస్. రమణ, ఎండ్లూరి సుధాకర్, శిఖామణి, నాళేశ్వరం శంకరం,   వాడ్రేవు చినవీరభద్రుడు,    వీరి కవిత్వం చదివినప్పుడు నేనూ వీరిలా రాయగలగాలి అని స్ఫూర్తినిచ్చారు. వీరి కవిత్వాన్ని స్పూర్తిపొంది రాసిన కవితా సందర్భాలున్నాయి.

***

ఈ మధ్య ఎం.ఎ. తెలుగు దూరవిద్యలో చదవడం మొదలుపెట్టాను
అక్కడ బయట పరిచయముండీ  . శ్రీ కె.యస్. రమణ,   శ్రీ సుధామ, ప్రత్యక్ష గురువులైనవారు
శ్రీ కృష్ణా రెడ్డి, శ్రీ తిరునగరి శ్రీనివాస్, శ్రీమతి రజని, శ్రీ పాల్ రత్నాకర్ గార్లు కొత్తగా గురువులయ్యారు.

ఇక్కడ సహ విద్యార్దులుకూడా  శ్రీమతి అరుణ, శ్రీమతి పద్మ, శ్రీమతి ఉష ఉపాద్యాయులుండటం గమనార్హం.


గురువులను గుర్తు చేసుకోవడం కొత్త వుత్తేజాన్ని ఇచ్చింది.
***

అక్క శ్రీమతి మేరీ సలోమి ఉపాద్యాయినిగా వుండటం అభినందనీయం





5 comments:

Augustus.Augustya said...

ఆయన అడిగే ప్రశ్నలు ఎప్పుడూ స్ఫూర్తిగానేవుంటాయి.

Augustus.Augustya said...

ఆయన అడిగే ప్రశ్నలు ఎప్పుడూ స్ఫూర్తిగానేవుంటాయి.

Unknown said...

Your effort to practice poetry is exemplary.

Unknown said...

Your effort to practice poetry is exemplary.

జాన్‌హైడ్ కనుమూరి said...

Thank you sir chinaveerabhadrudu vadrevu gaaru