Friday, May 17, 2013

ఫెంటోలు నా ఆలోచన





***
ఫెంటోలు అనేది ఒకరూపం 10మొదటి పాదం 15 రెండవ పాదం  దాని నిర్దిష్టత.
వాటిని ఏ ఏ అంశాలకు ఏవిధమైన అభివ్యక్తి చెబుతున్నాము, వాటికుండే ధ్వని వేటిని చూచిస్తున్నాయి అనేది గమనించాలనేది నా ఉద్దేశం.
కేవలము భావ ప్రదానంగా నడిచి వయక్తికంగా ఎక్కువ ఉండటంవల్ల భావ కవిత్వపు స్థాయిని మాత్రమే ఫెంటోలు పొంద గలుగు తాయి.
భావ కవిత్వాన్ని 1930  తర్వాత అధిగమించి వాదాలు, వర్గాల వైపు పయనించిందని సాహిత్య చరిత్ర చెబుతుంది.
ఆ భావత్మకత వైపే ఎక్కువ మొగ్గుచూపడాం వలన భావ కవిత్వంగా ముద్ర పడుతుంది. అంటే మనం తిరోగమిస్తున్నామన్న మాట.
భావ కవిత్వంలోని విభాగాలు
1. ప్రణయ కవిత్వం
అ) అమలిన శృంగారం
ఆ)కులపాలికా ప్రణయం
ఇ) వియోగ శ్రంగారం ... ఇలా మూడు పాయలుగా సాగుతుంది
2. ప్రకృతి కవిత్వం
3. కృషీవల కవిత్వం
4. స్మృతి కవిత్వం
5. మధురభక్తి కవిత్వం
6. మర్మ కవిత్వం
ఈ అభిప్రాయంనుండి ఫెంటోల అభివ్యక్తి, వస్తువు, ధ్వని ప్రగతిశీల మవ్వాలని నా ఉద్దేశం.
****

భావ సాంద్రత ఎలా తెలుస్తుంది అనేది ఎప్పుడూ కలిగే సందేహమే.

ప్రాధమిక దశలో
* కవిత్వం రాయటం ప్రణయ కవిత్వంనుండే మొదలౌతుంది. ప్రేమను, ప్రేమ భావనను, ప్రేమానుభూతులను ఎలాచెప్పలి అనేవి ఇందులో ప్రధానంగా కనిపించే అంశం.

** కవిత్వంలో సందేశం ఇవ్వాలి అనే భావన సాంప్రదాయ కవిత్వ లక్షణం.  ఈ ఆలోచననుండి  బయట పడకపోతే పాత చింతకాయ పచ్చడే అవుతుంది

*** ప్రతీదాన్ని మన మాటల్లో నిర్వచించాలనుకోవటం సబబు కాదు. అనుభవాన్నుండి కొత్త అభివ్యక్తితోనో,  ప్రతీకతోనో ఇంతకు ముందెన్నడూ కనబడని సౌదర్యమేదో తొంగి చూడగలగాలి అలాంటప్పుడు మాత్రమే నిర్వచించడం సముచితం.

ప్రాదమిక దశను దాటితే ధ్వని ప్రాదాన్య్త తెలుస్తుంది. ఒకవేళ తెలియకపోతే ప్రాదమిక దశ దాటలేదనుకోవచ్చు. ఎంత అందమైన కవిత్వం రాసినప్పటికి.

**** ధ్వనిలో

వ్యంగ్యం, హాస్యం,
భావం, భావోద్రేకాలు
భాష, భాషాప్రయోగం
ఆలోచనలు, సూత్రాలు వాటి అన్వయాలు
తత్వం, ఇతర శాస్త్రాల చాయ
సామాజికాంశాలు
సిద్ధాంతాలు, అన్వయాలు
తెలుగే కాకుండా ఇతరభాషలనుండి ప్రాయోగాత్మకంగానో, క్రియాశీలకంగానో వాడబడుతున్న శైలి విధానాలు
......ఇలాంటివన్నీ ధ్వనిస్తాయి.

కావ్యం రసాత్మకం అనే అలోచననుండి ముందుకు వచ్చి, జీవిత జీవన, విజ్ఞాన శాస్త్రీయ మొదలైన ఎన్నో విషయాలను కవిత్వంలోకి చేర్చబడినాయి.
వాటిపై ఇష్టా ఇష్టాలు ఎలావున్నా అవగాహన అవసరం.  
* * *

గ గుణింతంలో ఏ ఏ అంశాలు ఒదిగాయో చూద్దాం. నేను చెప్పేవి ఇవి వున్నాయా లేవా అని చూసి రాయలేదు కాని అవి ఇమడివుండటం గమనిందగ్గ విషయం.

గ...
గతి, మతి, సతి
ఎప్పుడూ దిశానిర్దాశాలే   .....
1. తెలిసిన సత్యాలను ఒకచోట చేర్చి దృవీకరించడం కనిపిస్తుంది
2. అను ప్రాస కనిపిస్తుంది
3. మూడు విభిన్న ప్రతీకలు, ప్రతిబింబాలు
గా...
గాజుబొమ్మే నా గుండె
భధ్రం! పగిలితే అతకడం కష్టం
...................ఇది భావత్మమైనదే

గి...
గిలకలేని బావి
చిలక లేని దేహం కనుమరుగేగా!
.............................చిలక గిలకల ఉమయోగంలోని దాగిన సత్యాని చెప్పడం

గీ...
గీతా మాధుర్యం నీవు పేర్చిందే
నా కోసం ఎంత ముందుచూపు నీకు
........................ఇది మధుర భక్తిలోకి, ప్రణయ కవిత్వంలోకి వస్తుంది
ద్వైదీ లక్షణం దీని ప్రత్యేకత
గీతా మాదుర్యం  అనడంలో పాడే పాటను చూచిస్తుంది
భగవద్గీతను సూచిస్తుంది


గు..
గుత్తులు గుత్తుల పూదోటలు
కవిత్వాన పరచుకున్న ఫెంటోలు
..................నిర్వచనామకత ఇందులోని ప్రత్యేకత

గూ...
గూడుకట్టిన ఆలోచనలు
నీ సహచర్యంలో పదాలై వర్షిస్తాయి
...................ప్రణయ, ప్రేమ భావాలే
గృ...
గృహము స్వర్గసీమే కదా!
మలచుకోవాల్సిన విధానమే తెలవాలి
..........................పోజిటివ్ ఆటిట్యూడ్ కోవకు చెందినది ఇది
గె...
గెలలు గెలల ఖర్జూరం
అందుకోడానికి చుట్టూ ఎడారే సుమా!
..............................అనుప్రాస, తీపి అనే రుచిని ధ్వనించేస్తూ
వైఖరిని చూచిస్తుంది
గే...
గేయాలు గాయాలు పరిపాటి
మదిలో దాచుకున్న నీకునీవే సరిసాటి
...........................అనుప్రాస, అంత్య ప్రాసలు ఇందులో ప్రత్యేకతను
గై..

గైడు ఉండటం మంచిదే
తెలియనివి సొంతంచేసుకునేందుకు
...................ఇది ద్వైదీ భావమే
గైడు రెండుగా చూచిస్తుంది
1. పాట్యపుస్తకాలకు వాడే గైడు
2. యాత్రా స్థలాలో వుండే గైడు
రెండిటిలోని ఏక సుత్రత కనిపిస్తుంది

గొ...
గొంతు పెగలి శ్రావ్యమై పాట
అక్షరం ధ్వనించే శబ్దమే ఫెంటొ.. సౌందర్యం
.......................నిర్వచన కోవదే ఇది కూడా



గో...
గోలీలు బాల్యపు ఆటే
జీవిత లెక్కలు కొన్ని నేర్చిందక్కడే
..................జ్ఞాపకం నుండి నేర్చుకున్న సత్యాలు
గౌ...
గౌతమి గోదారికై ప్రవాహం
నా అక్షరాలు పెంటోలకై పరుగులు
.......................నిర్వచన కోవా మరియు రెండు నదుల సంఘమాని గుర్తు చేస్తూ.
గం ...
గంపెడాశ ఈ మదిలో
తీవెల తీవెల ఫెంటోలై అల్లుకోవాలని
.................................ఒక ఆశ ...

నేను పైన రాసిన వాటికి ఇవే ఉదాహరణలు అని నేను అనడంలేదు.
ఇందులో ఇమిడిన విషయాలను మాత్రమే చెప్పాను

క" గుణింతం - ఫెంటోలు

క...
కలకనేది కళ్ళే కావచ్చు
ఆలోచనే మూలాధారమై నడిపిస్తుంది

కా...
కాళ్ళు నడిచేది దూరమేనా!
కాలం వాకిట్లో నడతేదో కనిపిస్తుంది!


కి...
కిటికీ తెరచిచూడు
వెలుగు కిరణం ఏ దిశగా వస్తుందో!

కీ...
కీచకుడు భారతంలోనేనా
నేడు వీధివీధిన తయారవుతున్నారుగా!

కు...
కువకువలు వేకువలోనే
బోసినవ్వులు పసిపాపలున్న చోటులోనే !

...

అచ్చులు .. ఫెంటోలు

అ...

అరమోడ్పు కన్నుల్లో జ్ఞాపకం
పదిలమై వెంటాడే చిరునవ్వు పెదాలపై

* * *

ఆ...

ఆలోచనలు పరిభ్రమిస్తాయి
బ్రమరాలై నచ్చినదానివెంట

* * *
ఇ...

ఇల్లెప్పుడూ స్వర్గసీమే కదా!
తిరుగాడే పాదాలు, అమర్చే చేతులు నీవేగా!

* * *
ఈ..
ఈ.. ఆ.. నాడుల పోలికెందుకు
ఏవైనా జీవిత జీవనాడులే కదా!

***
ఉ...
ఉషస్సు ఎప్పుడూ కాంతిరేఖే
కిటికీలు, తలుపులూ తెరవాల్సింది నేనే

* * *
ఊ...

ఉరెప్పుడూ కమనీయదృశ్యమే
చిత్రించేందుకు మనసుకుంచె కావాలి

* * *
ఋ..
ఋతువులను ఆహ్వానిస్తే
ఆనందంలో ఇమిడేది నా దేహమే కదా!
* * *

ఎ..
ఎరుపెక్కిన కళ్ళు
రాత్రి మిగిల్చిన అనుభూతుల ఆనవాళ్ళు

***
ఒ...
ఒక్కసారి ఇలావచ్చి చూడు
నీవు నాటిన పచ్చదనం కన్పిస్తుంది

* * *
ఓ...

ఓరకంట అలాచూడకు
విద్యుత్తు శరాఘాతమై తగులుతుంది

No comments: