Saturday, January 26, 2013

వడియాలు(గుమ్మడి కాయ) పద్యం ఏమైనా దొరుకుతాయా??


ఊరువెళ్ళిన పిల్లలు వస్తూ వస్తూ ఓ బస్తానిండా బూడిద గుమ్మడికాయలు తెచ్చారు. ఈ వారమంతా వాటితోనే కుస్తీ మొదలయ్యింది. శనివారం రాత్రి ముక్కలు కొయ్యడంతో మొదలయ్యి, ఆదివారం జరిగే మార్కెట్టులో పండు మిరపాకయలకై తిరిగి దొరకక పచ్చిమిర్చి తోనే సర్దుకుందామని నిర్ణయానికి వచ్చేసరికి ఆదివారం సాయంకాలమయ్యింది. కోసిన ముక్కలు బట్టను కప్పుకొని రుబ్బురోలుక్రింద మునగదీసుకున్నాయి. కాయకు అరకిలో, ముప్పావు, కిలో ఇలా ఎంతవెయ్యాలో అని తర్జన బర్జనలు. చివరికి ఆమే గెలిచింది తను అనుకున్నంత పప్పు నానబెట్టింది. తర్వాత పెట్టడం, ఆరబెట్టడం తనే చూసుకుంది. నిన్న రాత్రి రుచి చూద్దామని కొన్ని వేపింది. వేపుతుంటేనే ఘుమఘుమలు ఆరంభమయ్యాయి.

తింటూ తింటూ కొన్ని వడియాలు చేసే విధానములు చర్చాంశనీయాలయ్యాయి. అప్పుడే బ్లాగు రాయలనే తలంపు పుట్టింది.
అప్పుడెప్పుడో  బెడదకోట సుజాత గారు ఆవకాయ ప్రసహనం, బ్లాగు పోస్టు, బజ్జులో ఆలమూరు సౌమ్య పద్యాల యుద్దం గురొచ్చాయి.
వడియాలపై పద్యం ఎవరైనా రాసారా అని సందేహమొచ్చింది. ఆ సందేహమే ఏ టపాకు కారణం. గూగులమ్మని ఆశ్రయించినా నా సందేహం తీరలేదు. సందేహనివృత్తికి సుజాత  గారికి పోను చేద్దామని సెల్లు పట్టుకున్నా. తర్వాత గుర్తుకొచ్చింది. ఆమె ఇండియాలో లేదు కదా అని. 
నా సందేహ నివృత్తి చేస్తారా ఎవరైనా?

No comments: