From Left Dr. Rajani, Sri Krishna REddy, Sri Sudhama, Dr. SV Ramana, Srinivas
16.9.2012న సర్దార్ పటేల్ కాలేజీ ఆవరణంలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, అద్యయన కేంద్రంలో ఎం.ఎ. తెలుగు రెండవసంవత్స్రర విద్యార్థులకు వీడ్కోలు, మొదటి సంవత్సర విద్యార్థులకు స్వాగతం పలుకుతూ చిన్న సభజరిగింది.
నేనూ రెండవ సంవత్సర విద్యార్థిని కాబట్టి పడుతూ లేస్తూ హాజరయ్యాను. శ్రీ కె.యస్. రమణ అధ్యక్షత వహించగా శ్రీ సుధామ, శ్రీ కృష్ణా రెడ్డి, శ్రీ తిరునగరి శ్రీనివాస్, శ్రీమతి రజని ఇంకోదరు పాల్గన్నారు.
అధ్యక్షుని తొనిపలుకులుగా సార్వత్రిక విద్య మరియు విశ్వవిద్యాలయం ఆవిర్భావాన్ని, విస్తరించిన విధానాన్ని శ్రీ కె.యస్. రమణ గారు వివరించారు.
విద్యార్థుల మాట్లాడె వంతు వచ్చింది.
మొదటగా అనుకున్న వారు సమయానికి రాలేకపోవటమో, కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ పనిచేస్తున్నందువల్లనో మాట్లాడడానికి ముందుగా నాకు అవకాశం చిక్కింది.
నేను మాట్లాడిన వాటిలోనుంచి కొన్ని (గుర్తున్నంత వరకు)
నిజానికి నేను మాట్లాడాలని సిద్దపడిరాలేదు, అయినా అవకాశం వచ్చింది కనుక నాకు, సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, శ్రీ కె.యస్. రమణ గారితో వున్న అనుభందం వివరిస్తానికి ప్రయత్నిస్తాను.
నేను హైదరాబాదు వచ్చిన కొత్తలో ప్రింటింగు ప్రెస్సులలో కాంపోజిటరుగా పని ప్రారంభించాను. కంప్యూటరీకరణలవల్ల చాలామంది ఉద్యోగాలు(పత్రిగా రంగంలో) కొల్పోయారు. ప్రత్యామ్యాయాన్ని కొరకు అలోచించకోవలసి వచ్చినప్పుడు 1985లో మూడవ బాచ్‌లో జాయిన్ అయ్యాను కుంటుకుంటూ 5వ బాచ్‌కి పూర్తిచేసాను.
అప్పట్లో ఈ డిగ్రీకి విలువలేదని అందరూ అనడంతో నాకూ సందేహం వచ్చింది ఎల్.ఎల్.బి.లో జాయన్ అయ్యాను. నా వ్యక్తిగత కారణాలవల్ల పూర్తి చేయలేకపోయాను. సందేహమఒతే తీరింది. ప్రింటింగు ప్రెస్సుల్లో మానేసి ఆఫీసు వైపు దృష్టిపెట్టాను. ఒక కంపెనీలో ఆఫీసు అసిస్టెంటుగా చేరాను. వివిధ సెక్షన్లలో పనిచేసి పస్తుతం అదే కంపెనీలో ఆఫీసు - ఇన్‌చార్జిగా పనిచేస్తున్నా. కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల మద్యపానం వ్యసనంగా మారింది దాన్ని వదిలించుకోవడానికి చేస్తున్న ప్రయత్న సమయంలోనే కంప్యూటరు నేర్చుకోవల్సి వచ్చింది.
నా ప్రయత్నాల్లో నన్ను తెలుగు సాహిత్యం ఆకట్టుకుంది, అందులోనూ కవిత్వం నన్ను పట్టుకుంది. బైబిలులోని ..."వాక్యము రెండంచుల ఖడ్గమై కీళ్ళను, మూల్గులను విభజించునంత మట్టుకు దూరుచు పనిచేస్తుంది" ఆ వాక్యాన్నివెదకటం మొదలు పెట్టాను వెదకుతూ వెదకుతూ నా మధ్య పానాన్ని ఎప్పుడు మానేసానో గుర్తులేదు. పైగా కవిత్వం రాయడం అలవాటయ్యింది. అప్పుడే శ్రీ కె.యస్. రమణ గారు పరిచయమయ్యారు. ఒకసారి ఒక కవిత వినిపించాను ...వ్రాయాలని కలం పట్టగానే రాణీ ఈగను మోసుకొచ్చినట్టు ముసిరే ఆలోచనలు" ... ఇది వినిపించగానే ఎత్తుగడ బాగుంది అన్నారు. తర్వాత అది హసీనా దీర్ఘ కవితగా వచ్చింది. గత సంవత్సరమే చేరాలనుకున్నా కుదలేదు. ఈ సారి కుదిరింది. అయితే మొదటి సంవత్సరంలో ఒక్కరోజు కూడా క్లసులకు రాలేదు. బైపాసు ఆపరేషన్ అయ్యింది. చూద్దాం అని కొన్ని పరీక్షలు మాత్రం రాసాను. రెండవ సంవత్సరంలో ఎదో చదివెయ్యాలని కాదు గాని దేహబాధలనుండి కొంత ఉపసమనం కోసం క్లాసులకు వస్తున్నాను.
తెలుగులో నేను వ్రాస్తున్న వాటిని బట్టి కొంత మంది మిత్రులు నన్ను పి.హెచ్‌డి. చెయ్యమని ప్రోత్సహించేవారు. ఎం.ఎ. లేకపోవడం ఒక అవరోధ అయ్యింది అందుకే జాయిన్ అయ్యాను. తీరా జాయిన్ అయ్యాక తెలిసింది. సృజనగా
చదవడం అంత సులభమేమీ కాదు, అకడమిక్‌గా చదవడం.
బ్లాగులు మొదలయ్యినప్పుడు మిత్రులవల్ల నా బ్లాగును చదివే మిత్రులున్నారని తెలిసింది. అంతర్జాలంలో తెలుగు అనే అంశంతో రీసర్చి చెయ్యాలని వుంది. ఇప్పటికి శ్రీమతి పుట్ల హేమలత గారు దీనిపై డాక్టరేటు చేసారు. ఒకవేళ నేను చెయ్యాల్సి వస్తే నాదగ్గర కొంత సమాచారం వున్న అంశాలు 1. కవిత్వంలో లఘురూపకాలు, 2. అంతర్జాలంలొ తెలుగు
***
తర్వాత మాట్లాడిన వారు నేను ఇదే విశ్వవిద్యాలయంనుంచి డాక్టరేటు పొందాలని ఆశీర్వదించారు, అభినందించారు.
రీసర్చి కోసం కూడా పనులు జరుగుతున్నాయని శ్రీ రమణగారు వివరించారు.
2 comments:
Open university lo phd kooda cherusthunnanduku abinandanalu. you are the best product of the university.
ఈ అనానిమస్ ఎవరో గాని
నన్ను భలే ఇబ్బందిలో పడేసారు
ఎం.ఎ. ఇంకా పూర్తి కాలేదు నాకు.
సార్వత్రిక విశ్వ విద్యాలయం వారు పిహెచ్‌డి - తెలుగు - ఇంకా ప్రవేశపెట్టలేదు
నన్ను అప్పుడే అభినందించేస్తున్నారు.
Post a Comment