గత ఉగాదికి బైపాస్ ఆపరేషన్ అయ్యి డిశ్చార్జ్ కోసం ఎదురు చూస్తున్నాను. డాక్టర్లు, నర్సులు ఉగాది పచ్చడి తినిపించారు. అప్పుడే సంవత్సర కాలం గడిచిపోయిందా అనిపిస్తుంది కాని, ఎన్ని అవాంతరాలు, ఎన్ని బాధలు, ఎన్ని నిద్ర పట్టని రాత్రులు. అన్ని షడ్రుచుల సమ్మేళనమే.జ్ఞాపకాలను విప్పి చుపలేను కానీ, దేహం పై ఆపరేషన్ కుట్ల గాయాల కనిపిస్తూనే ఉన్నాయి.
జీవితమెప్పుడూ ఒకేలా ఉండదుకదా
గతంలో బ్లాగులో సరదాగా నా చేతిని స్కాన్ చేసి హస్త సాముద్రకాన్ని గురించి ఎవరైనా చెబుతారా అని అడిగినప్పుడు ఓ అజ్ఞాత మిత్రుడు మీ ఆరోగ్యం జాగ్రత్త. త్వరలో ఏమైనా జరగోచ్చు అని చెప్పాడు. అప్పుడు సరదాగానే తేలికగా తీసుకున్నా. ఇప్పుడది చూసినప్పుడు ఆశ్చర్య మనిపిస్తుంది.
నాకు సేవ చేసిన పిల్లలు, నా ప్రక్కటెముక మరువ లేని వారే.
అన్ని వేళల్లోనూ స్పూర్తి నిచ్చి త్వరగా కోలుకోవడానికి ధైర్య పరిచిన మిత్రులను మరచిపోలేను.

4 comments:
కనుమూరివారూ
ఆశ్చర్యపోండి, ఆశ్చర్యపోండి ఆనందంగా.
భగవంతుడు మనకోసం ఈ అందమైన సృష్టిని యేర్పరచాడు.
ఎన్నో విషాదాలూ, యెన్నెన్నో ఆనందాలూ యేర్పాటుచేసి మరీ పంపాడు.
ఎన్నో మైదానాలూ, యెన్నెన్నో యెత్తుపల్లాలూ యేర్పాటుచేసి మరీ పంపాడు.
ఎన్నో గజిబిజిదారులూ యెన్నెన్నో వింతలూవినోదాలూ యేర్పాటుచేసి మరీ పంపాడు.
అన్నీ మనకొరకే. అచ్చంగా నిత్యం మనకొరకే!
ఆలోచించండి. ఇవన్నీ లేకపోతే జీవితం యెంతనిస్సారంగా ఉండేది.
కేవలం తెల్లటి కాగితం మీద అచ్చం అలాంటి తెల్లని స్వఛ్ఛమైన సిరాతో బొమ్మలు వేయగలమా?
ఎంతో దయామయుడు కదా, అందుకనే ఇంతటి వైవిధ్యాన్ని ప్రసాదించాడు.
చిత్రవిచిత్రమైన సృష్టి మనకోసమే అందించాడు.
అందుకే ఆయనకు నిత్యం ధన్యవాదాలు తెలుపుదాం.
మంచీ చెడూ హాయీ గాయమూ అన్నీ ఆయన విభూతులే.
ఇది కాస్తా తెలిస్తే నిత్యం నిర్మలమైన ఆనందమే.
అన్నట్లు ఆ ఆనందం కూడా మనవాళ్ళ నిర్వచనం ప్రకారం ఆయన స్వరూపమే.
అటువంటి వారు దొరకడం మీ అదృష్టం. అంతా మన మంచికే అనుకుంటూ ముందుకి సాగిపోవాలి కదా! ఉగాది శుభాకాంక్షలు!
happy ugadi and get well soon sir...
కాలం గాయాలు మానుపుతుంది.
కాలం కొత్త కొత్త చిగురులు తొడుగుతుంది.
ఎప్పుడూ సరదాగనే వుండండి
Post a Comment