యవ్వనంలో లీపు సంవత్సరపు తేదీపై చాలా గొప్ప అంచనాలు వుండేవి. ఎందుకంటే ఆరోజు వివాహం చేసుకోవాలని ప్రత్యేకంగా వుంటుందని అనుకొనేవాణ్ణి. నాకు 24, 25 సంవత్సరాలు వచ్చాక ఎవరైనా పెళ్ళి ఎప్పుడూ అని అడిగితే 29.2.1988 అని టక్కున చెప్పేవాణ్ణి.
అన్నీ నేను అనుకున్నట్టే జరిగితే ఈ రోజు పోస్టు మరోలా రాసేవాడిని.
"తొందరిపడి ఒక కోకిల ముందే కూసింది" అన్న చందంగా కొన్ని అనివార్య కారణాలవల్ల అనుకున్న తేదీకంటే ముందుగానే పెళ్ళి చేసుకున్నాను. లీపు సంవత్సరపు తేదీ నాకు ప్రత్యేకత లేకుండా పోయింది.
వెనక్కు తిరిగి చూసుకొని బాధ పడలేదు, ఎందుకంటే తొదరపడి కూయటంలో మాట నిలుపుకుని నా ప్రక్కటెముకను పొందగలిగాననే తృప్తి చేజారిన ప్రత్యేక తేదీ దిగిలును మరిపించేస్తుంది.
2 comments:
అందుబాటులో వున్న
పూవుకోసుకోసుకొ గాని
చిట్ట చివరి కొమ్మనున్న
పండు కొఱకు ఎగబ్రాక బోకు .
అన్న నా పదాలు నాకు జ్ఞప్తికి తెచ్చారు.
అభినందనలు జాన్‌హైడ్ కనుమూరి sir. Abhinandanalu..... Nutakki Raghavendra Rao (Kanakaambaram)
అమ్మ
మన ఆయువు కోసం తన ఆయువు తృణం
మన జీవితం కోసం తన జీవితం ఫణం
ఒక్క అమ్మకే సొంతం ఇంత గొప్ప గుణం!
అమ్మ వడి వెచ్చదనం
అమ్మ పాట తియ్యదనం
అమ్మ చేతి కమ్మదనం
అమ్మ చూపు చల్లదనం
ప్రత్యామ్నాయం లేనిదీ ధనం!
ఆకలేస్తే అమ్మా అంటాం
అలుపొస్తే అమ్మా అంటాం
భాదేస్తే అమ్మా అంటాం
భయమేస్తే అమ్మా అంటాం
బతుకులో భాగమేగా అమ్మ!
అమ్మ పిలిస్తే చందమామ క్రిందికొస్తుంది
జోల పాడితే నిద్ర ముంచుకొస్తుంది
గోరుముద్ద పెడితే ఆకలి కేకలు పెడుతుంది!
తరానికీ తరానికీ వారథి అమ్మ
వడికీ బడికీ సారధి అమ్మ
బుడిబుడి అడుగులకు ఆలంబన అమ్మ
తడబడు అడుగులకు సవరణ అమ్మ
అభ్యాసంలో ఆది పదం అమ్మ
నిస్వార్ధమైన సేవకు నిర్వచనం అమ్మ!
అడ్డాలనాడు గుండెలపై గుద్దినా
గడ్డాలనాడు గుండెల్లో గుచ్చినా
గుంభనంగా గమ్మునుంటుంది అమ్మ!
అందుకే నేను అంటున్నా
కనిపించని,కానరాని దైవం కన్నా
'కని ' పెంచే అమ్మే మిన్నరా కన్నా!
.....ప్రసాద్ అట్లూరి
Post a Comment