Saturday, February 4, 2012

నాయెడల దేవునికి అద్భుతమైన ప్రణాళిక కలిగి నన్ను ఆదుకున్నాడు.


నాయెడల దేవునికి అద్భుతమైన ప్రణాళిక కలిగి నన్ను ఆదుకున్నాడు. 

గత సంవత్సరం మార్చి నెలలో గుండె ఆపరేషన్ అయ్యింది. మళ్ళీ తొమ్మిదినెలల తర్వాత పిరియాడికల్  చెకింగ్స్ కోసం వెళ్ళినప్పుడు, మరో చోటులో బ్లాకు వుందని దాని నిర్దారణకు ఆండియోగ్రాం చెయ్యాలని అన్నారు. ఆండియోగ్రాం పట్టుమని పదినిముషాలు కూడా వుండదు, కానీ దానికోసం సిద్దంచేయడం, అయిన తర్వాత వచ్చే నీరసం, ఒడిదుడుకులను దృష్టిలోపెట్టుకొని దాదాపు ఓ 24 గంటలు పట్టవచ్చు. అయితే రాత్రి పగలు లెక్కలు, డక్టర్ల అందుబాటులు, శరీర పరిస్థితిని బట్టి ఆ 24 గంటలు రెండురోజులగా మారవచ్చు.(సగం ఒకరోజు, సగం ఒకరోజు రావటంవల్ల). అలా    డిశెంబరు 27, 2001న రెండురోజుల ప్రణాళికతో ఆసుపత్రిలో చేరాను.  అయితే పరీక్ష జరుగుతున్న సమయంలో దగ్గురావట దానితో తలెత్తిన సమస్యల కారణంగా ఊపిరితిత్తులలోనికి నీరు చేరటం అది కాస్తా విషమించడంతో అత్యవసర వార్డుకు తరలించారు. గుండె పరిస్థి మరియు ఊపిరితిత్తుల పరిథితులతో అందులో రెండురోజులు, మెడికల్ వార్డులో నాలుగురోజులు వెరసి 9 రోజుల పాటు ఆసుపత్రిలోనే వుండవలసి వచ్చింది. ఇంటికి వచ్చక మూడు వారాలపాటు పూర్తిగా మంచం మీదనే విశ్రాంతి. శరీరం కోలుకున్న తర్వాత స్టంటు వేయాలని కార్డియాలజీ డాక్టరు సూచన.  ఇంతకుమును శత్రచికిత్స చేసిన సర్జను మరో కొన్ని స్కానింగులు సూచించి వాటి ఆధారంగా స్టంటు అవసరంలేదని మందులు వాడితే సరిపోతుందని నిర్దారించారు. 

డిశెంబరు 20, 2011 ప్రథమిక పరీక్షలనుంచి(ఇ.సి.జి.) ప్రారంభమైన  ఉత్కంఠకు  ఫిబ్రవరి 1, 2012న తెరపడింది.  42 రోజుల ప్రయాణం చాలా విషయాలు, అనుభవాలు, అనుభూతులు, రకరకాల సలహాలు, ఆరోగ్య, ఆహార జాగ్రత్తలు. నా ప్రక్కటెముక సపర్యలు, తాను నలిగిన వత్తిడి, పిల్లలు సహకారాలు ఇవన్ని కలిపి నన్ను త్వరగా కోలుకునేటట్టు చేసాయి.

నిద్రపట్టని సమయాలలో ఎవేవో రాయాలని అనిపించేవి. అలాచేయటానికి అనుమతించనందువల్ల ఒక్క వాక్యాన్ని కూడా రాయలేకపోయాను. 

చాలా జాగ్రత్తతోనూ, ఆరోగ్య నియమాలు పాటిస్తున్నా మళ్ళీ ఎందుకని ఇలా జరిగింది అనేది బోధపడటంలేదు. 

ఏది ఏమైనా దేవుడు నాయెడాల అద్భుతము చేసాడన్నది నిజం.



జాన్ హైడ్ కనుమూరి 

7 comments:

aravind Joshua said...

thanx for sharing your testimony. He cares.

సుజాత వేల్పూరి said...

మీరు మరింత వేగంగా కోలుకోవాలి. మనసులో చోటు చేసుకున్న ఆలోచనలని గుండె గదుల్లో భద్రంగా దాచి ఉంచండి. పూర్తిగా కోలుకున్నాక రోజూ రాయవచ్చును.

ఆరోగ్యం జాగ్రత్త జాన్ గారూ!

durgeswara said...

అయ్యో ! మీకు ఆరోగ్యం బాగాలేదా ?
భగవంతుడు మంచివాళ్లనెప్పుడు కాపాడుతారు . మీకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాము

జాన్‌హైడ్ కనుమూరి said...

arvind Joshuva
సాక్షము అని రాయలేదు
సాక్ష్యముగా రాస్తే ఇంకొన్ని సంగతులు, నాకోసం ప్రార్థించిన వారు, ఆసుపత్రికి వచ్చి ప్రార్థించిన వారిగురించి ప్రస్థావించాలి

మీ స్పందనకు ధన్యవాదాలు

జాన్‌హైడ్ కనుమూరి said...

సుజాత,
durgeswara

Thanks for concern

మరువం ఉష said...

నమ్మిక ముఖ్యం. ఆపైన వైద్యుల సలహా పాటించటం. మా మామ్మ అనేవారు "దేవుడే చూస్తాడు దేవుడి పాపణ్ణి' అని. అంతా దేవుడి కుటుంబం. పాపపుణ్యాలు, కర్మల లెక్కలు లేనిదే ఆయన దయ. సుజాత గారన్నట్లు మనసులో కాస్త కాలం ఊరితే మరింత మధురంగా వెలికి వస్తాయి, పస్తుతానికి విరామం, విశ్రాంతి మరవకండి.

జాన్‌హైడ్ కనుమూరి said...

ఉషగారు
చాలా కాలం తర్వాత మీ పలకరింపు.
పులకరించకుండా ఎలా వుండగలను?
రాయాలని ఆశవుంది,
వెంటనే రాయాలని తొందరేమీలేదు.
అభిమానంగా రాసిన స్పందనకు
ధన్యవాదములు