Wednesday, November 16, 2011

అమ్మమనసు - గజల్

నిద్రపట్టిని ఓరాత్రి
నెట్టు అందుబాటులేనప్పుడు
ఏదో చదువుతుంటే
ఒక లైనుతో ప్రారంబమై ఇలా వచ్చింది

ఇందులో ఫేసుబుక్కు గ్రూపులలో తరచూ కలిసేవారి పేర్లు ఇమడటం యాదృశ్చికం

* * *

పండువెన్నెల కన్నా చల్లనిది అమ్మమనసు

నిండు జగమంతా ఎరిగినది అమ్మమనసు

గోరుముద్దలు తినిపిస్తూ చందమామచూపిన
మురిపాల మీగడ పాల బువ్వైనదీ అమ్మమనసు

బుడిబుడి అడుగులకు చూపుడు వ్రేలునిచ్చి
వడివడిగా పథాలలోకి నడిపినదీ అమ్మమనసు

భాను కిరణాలతో ఉదయరాగ మాలపించి
ధాత్రికే సహనం నేర్పినదీ అమ్మమనసు

జగతిని మమతల నెలవుల కాంతులలో
జ్యోతియై కరిగికరిగి వెలుగునిచ్చినదీ అమ్మమనసు

అనుబంధాలు పెనవేసే జాడల జాతరలో
సువాసనల గంధమై పరిమళించినదీ అమ్మమనసు

పద్మాలు వికసించే శరత్ చంద్రకాంతిలో
స్వాతి ముత్యమై మెరిసినదీ అమ్మమనసు

ప్రేమనెరిగిన శ్యామాక్షరాల యింటిలో
సిరులనిచ్చే శ్రీ నివాసమైనదీ అమ్మమనసు

విజయ పథాన నేను నడువగా
లోకాన ప్రవీణతలో నడిపినదీ అమ్మమనసు

నేర్చిన జ్ఞానంతో పయనించే మార్గంలో
వెలలేని అపరంజి అయినదీ అమ్మమనసు

తీపితీపి జ్ఞాపకాలు జగమంతా తెలిపే
యెదను పలికే సుధలు నింపినదీ అమ్మమనసు

కనిపెంచిన పిల్లలు తనయెదుటే ఎదిగి
వృక్షాలై నీడనిస్తుంటే సంతశించేదీ అమ్మమనసు

శృతిచేసిన రాగం ప్రీతిమీర ఆలపించే
"జాను''తెలుపు నాల్గుమాటలలో ఇమడనిదీ అమ్మమనసు

6 comments:

జ్యోతిర్మయి ప్రభాకర్ said...

ఈ ఘజల్ అమ్మమనసంత అపురూపంగా ఉంది జాన్ గారు..యాదృశ్చికంగానయినా ఇంత మంది పేర్లు ఇమడటం విశేషమే ! నా పేరును కూడా చేర్చినందుకు ధన్యవాదాలు..నాతో పాటూ మన ఫేస్బుక్ స్నేహితులు భాను, ఉదయ్, జగతి, ధాత్రి,పద్మ, శరత్ చంద్ర, స్వాతి,శ్యామ, శ్రీనివాస్, శిరి, ప్రవీణ,అపరంజిత ఇంకా మీదే కాక మీ సతీమణి విజయ, మీ అమాయిలు శృతి, ప్రీతి ల పేర్లను కనుగొన్నాను..నా చూపుకందక తప్పించుకున్నవింకా ఉన్నయేమో !
""జాను''తెలుపు నాల్గుమాటలలో ఇమడనిదీ అమ్మమనసు" అనే ముగింపు అద్భుతంగా ఉంది జాన్ గారు

Unknown said...

praveena, jagathi ma, swathi, sudha chaala mandi perlu kanipinchaayi
mee abhimaanam antha aa kavithalo amma prema pai
kanapaduthondi
good one

జాన్‌హైడ్ కనుమూరి said...

Thank you
Jyothirmayi
and
Sudha

bangaRAM said...
This comment has been removed by a blog administrator.
bangaRAM said...

andarilonu ammamanasu chooda galiginaarante inkaemikaavali jeevithaaniki.marinthamandi ammala asissulatho ujwalamgaa adagaali meeru.

జాన్‌హైడ్ కనుమూరి said...

bangaRAM
comment
టెక్నికల్ ప్రోబ్లం వల్ల కామెంటు డిలీట్ అయ్యింది
దాన్ని తెలుగులో మార్చాను
కొన్ని పదాలు అర్థం కాలేదు.

అసౌకర్యానికి చింతిస్తున్నాను
------------------------------------
అమ్మమనసు అద్దంలొ మనమందరం చిన్న బింబాలమే మరి.అమ్మమనసు అర్దం గావలంటె ఆర్ద్రతతో నీవు ఇతరులను స్ప్రుసించి సపర్యలుచెసి స్వాంతన చెకూర్చడమే. దీనికి ప్రత్నమాయమెమి లెదు. గణిత సూత్రాలు ఇక్కడ పనిచెయవు. యదతెగకుండ యదనిండా మిగిలినదే అమ్మ మనసు. ద్నకు కూదా అందవు దీని మూలాలు.