చిగురాకుల మాటున దాగిన
ఆకుల కొమ్మల మాటున రెమ్మలదాగిన
కొత్తచిగురల వగరులతో
ఒదిగి ఎదగాలని
ఊగిసలాడుతోంది మనసు
సొగసులొలుకు పూరేకులతో
పూరెమ్మల పరిమళాలలో
చిరుగాలి అలలతోచేరి
కొమ్మకొమ్మను రెమ్మ రెమ్మను తాకాలని
ఊగిసలాడుతోంది మనసు
కూనిరాగాల తుమ్మెదల చేరి
పువ్వు పువ్వున మకరందాన్ని గ్రోలి
తనువంతా మధురంచేసే
ఓ కొత్త రాగమాలపించాలని
ఊగిసలాడుతోంది మనసు
కిలకిలరావల పక్షులతోచేరి
కొమ్మరెమ్మల ఊయలూగి
భాషకందని భావాలతేలి
కోకిలగానాల వగరు పొగరుతో
ఉత్సాహపు చిటారుకొమ్మలు తాకాలని
ఊగిసలాడుతోంది మనసు
--------------------------------------------
తొలినాళ్ళ మనసు ఊగిసలాట
6 comments:
తొలినాళ్ళదైనా ఇప్పటిదైనా మనసు ఊగిసలాట మారదుగా...మీరన్నట్టు "భాషకందని భావాలతేలి
కోకిలగానాల వగరు పొగరుతో" మీ మనసు ఊసులు హత్తుకున్నాయి...
వాసుదేవ్
ఈ మద్య రాసిన కొన్ని పాటలు బ్లాగులో పెట్టిన నేద్యంలో, పాతవి కూడా బ్లాగులో పెట్టాలనించింది. పాతవి కదా అని సందేహించాను కాని మీ స్పందన ఉత్సాహాన్ని నింపింది. వీలునుబట్టి మిగతావి కూడా పోస్టుచేస్తాను
ధన్యవాదములు
బావుంది జాన్గారు.
మనసు ఊసులు పదిలంగా దాచుకొని అందిస్తున్న మీకు ధన్యవాదాలు సార్...
మీ
జ్ఞాపకాల పేటికలో
భవ్యమైన ఖజానా
ఒకటొక్కటి వెలికితీసి
ఆసక్తిని పెంచుతూ
జాన్ సాబ్
.మీ
వ్యక్తీకరణ
అద్భుతం .
అభినందనలు ...శ్రేయోభిలాషి ...నూతక్కి రాఘవేంద్ర రావు.
Murali,
కెక్యూబ్ వర్మ
నూతక్కి రాఘవేంద్ర రావుji
Thank you for your comment
Post a Comment