Thursday, August 25, 2011

నీ కోసం నా మది


హద్దులు చెరిపేస్తా నీ కోసం
సరిహద్దులు మార్చేస్తా నీ కోసం
కొండలు దాటి కోనలుదాటి
ఎల్లలులేని కల్లలులేని
నవలోకం నిర్మిస్తా నీ కోసం

వినీలాకాశంలో రంగుల హరివిల్లు తేలేను నీ కోసం
తెరచివుంచిన రంగులమదినే పరిచేస్తా నీ కోసం

గగనంలో మెరిసే తారను తెంపలేను నీ కోసం
రెక్కలువిప్పిన సౌధాలకై ప్రక్కనుండగలనునీ కోసం

విరిసిన వెన్నెల చల్లదనం పట్టలేను నీ కోసం
గుండెలనిండిన అనురాగాన్ని ఆరబోయగలను నీ కోసం

లలిత పదజాలంతో కవితలల్లలేను నీ కోసం
మమతనెరిగిన ఓ మాట పలుకగలను నీ కోసం  

2 అభిప్రాయాలు ::

jyothirmayi prabhakar said...

అమ్మో ! ఇన్ని చేయగలుగుతూ ఏమీ చేయలేనంటారేమిటి? అద్భుతంగా ఉంది జాన్ గారు

జాన్‌హైడ్ కనుమూరి said...

Jyothirmayi ... thanks for your comment