Wednesday, December 22, 2010

పుస్తక ప్రదర్శన నా అనుభవాలు

పుస్తక ప్రదర్శన  నా అనుభవాలు

గత రెండు సంవత్సరాలుగా నేను పుస్తక ప్రదర్శనకు వెళ్ళలేకపోయాను. ఈ సారైనా వెళ్ళాలి అనుకున్నాను. చివరికి ఈ ఆదివారం (19.12.2010) అనుకోకుండా వెళ్ళి కొత సమయాన్ని గడిపి, కొన్ని పుస్తకాలను,  కొన్ని జ్ఞాపకాలను వెంటతెచ్చుకున్నాను.

వాటిలో కొన్ని మీతో పంచుకుందామనే ఈ బ్లాగు రాయడం.

రెండువందల  పైచిలుకు పుస్తకశాలలు వుండటం విశేషం.  అందులో ఎక్కువ శాతం తెలుగువే వుండటం మరో విశేషం. నేను వెళ్లిన రోజు వర్మతో ముఖాముఖి జరిగింది. నాకు కనిపించినంతవరకు ఈ సీజన్‌లో హాట్ పుస్తకం "నా ఇష్టం"

కొద్దిసేపు ఈ తెలుగు స్టాలులో వుండటంతో కొంతమంది బ్లాగు మిత్రులను కలుసుకోవడజరిగింది. కొన్ని కబుర్లు, కొన్ని కాజాలు, పూతరేకులు, మిర్చి బజ్జీలు మా పళ్ళ మధ్య నలిగాయి.

అన్ని కంటే ముఖ్యంగా రోహిణీ ప్రసాద్ గారితో ఫొటోకు పోజులివ్వడం అనుభవం. 





నా కోసం ఎదురుచూసిన ఈతెలుగు బాడ్జీ ఇదే!
అంతా ఒకసారి తిరిగి, కొన్ని పుస్తకాలు కొని బయటకు వచ్చినప్పాటినుంచి ఒక ప్రశ్న నన్ను వెంబడిస్తూనేవుంది. అదేమిటంటే ఇన్ని పుస్తకాల మధ్య ఒక్కటికూడా క్రైస్తవ, ముస్లిం సాహిత్యం కనబడకపోవటం.

ముఖ్యంగా  బైబిలు తర్జుమా వల్లతెలుగు సాహిత్యానికి ఎనలేని మేలు జరిగింది అని పెద్దలు అంటూవుంటారు. అటువంటప్పుడు ఈ ప్రదర్శనలో ఒక్క స్టాలుకూడా లేదేమిటా అని? 

ఒకటే ఆలోచనల పరంపర.

క్రైస్తవ సాహిత్యాన్ని అనువాదం చేసి ప్రచురించడానికి అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. 
మరి  అలాంటివి ఏమైనాయి? 
వారు ఇక్కడకు రారా?
ఇక్కడ వారు పనికి రారా?  
  లేక క్రైస్థవ్యంలో తెలుగు సాహిత్యం లేదా???????????????????

5 comments:

Anonymous said...

ఏమోనండి. తెలియదు.

oremuna said...

క్రైస్తవ సాహిత్యం ఎక్కువగా ఉచితంగా ఇవ్వటాన మార్కెట్ లేకుండా చేశారేమో?

Buchchi Raju said...

please watch
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.

Anonymous said...

Stall No 177
Telugu Islamic publications trust

http://hyderabadbookfair.com/wp-content/uploads/2010/12/Hyderabad-Book-Fair-2010-Stall-Details.pdf

kavs said...

yenduku...