ఈరోజు చాలా విషయాలతో టపా రాయాలని వుదయమే అనిపించింది. కొన్ని ఆలోచనలు మనసున తొలిచాయికూడా. ఆఫీసుకు వెళుతూ కొన్ని మననం చేసుకున్నాను. ఆఫీసులో అడుగు పెట్టాక దాని సంగతే మరిచిపోయా. ఇదిగో ఇప్పుడు(సాయత్రం 7.50గంటలకు) మళ్ళీ గుర్తుకువచ్చింది.
మననం చేసుకున్న విషయాలు ఒక్కటికూడా గుర్తు రావటంలేదు.అయినా చిన్న ప్రయత్నం
-- 0 --
అమ్మనుగురించిన జ్ఞాపకాలు వెంటాడుతూనే వుంటాయి.
క్రైస్తవనమ్మకం ప్రకారం బంగారువీధులున్న పట్టణానికి అమ్మను కలవటానికి నేనూ ఓ రోజు వెళతాను.తను మోకరించిన వేకువ జాములు, తొలివెలుగుల పక్షుల కిలకిల రావాలతో గొంతుకలిపి ఆలపించిన స్తుతిగీతాలు ఇంకా చెవుల్లో మారుమ్రోగుతూనే వున్నాయి.
నిద్రలో మరో కల
అడుగులు నేర్వనిబుడుగు పాదాలను కడిగిన వేళ
జారుడు వూగిసలాటలో
మెరిసిన బిందువుగా
ముద్దుల వర్షంలో ఆవిరయ్యాయి
పదంనేర్చి పథం ప్రాకులాటలో
పొరలమాటున దాగిన
ఈ వన్నె దేహాన్నంటి
జారుతున్న బిందువులపై
ప్రసరించి మెరిసిన కిరణపు వెలుగు
తళుకు కాంతులైనప్పుడు
నీ ఆశల కిరణాలుగా చుటుముట్టాయి
నాకోసం పరిశమించిన పాదాలను ముద్దాడలనివుంది
నేనందుకోలేని దూరంలో నీ పాదాలు
ని రెప్పలు నిద్రలో మరోకల కంటున్నాయి
నా కోసం
--0--
ఊహ తెలిసినప్పుడు నాతో నడిచి, నాకు ఎన్నో నేర్పించి దిశా నిర్దేసాల ఆలోచనా గమనం.
తను డాక్టరైతే నేను కాంపౌడర్ని, తను ఓ కొట్టుపెడితే నేను సామను అందిచే కూలివాణ్ణి ఇలా ఎన్నో ఆటలలో, వయసులో తనే నాముందున్నా భోజనం దగ్గర మాత్రం నేదే ముందు.యువతగా వున్నప్పుడు తను చదివిన పుస్తకాలను నాకు చెబుతున్నప్పుడు నాకు తలనొప్పి తెస్తుందనుకున్నా, ఇప్పుడిప్పుడే సాహిత్యాన్ని అద్యయనం చేస్తున్నప్పుడు ఆమే నా ఎదురుగా ఎవో వివరిస్తున్నట్లే అనిపిస్తుంది అమె నా అక్క. నా ఆలోచనా ధారకు అంబులపొది.
జ్ఞాపకాల వాకిటముందు ప్రణమిల్లుతున్నాను
--0--
ఈ సందర్భంగా నా ప్రక్కటెముకగా అతుక్కుపోవడానికి నాతో నడచివచ్చిన , నా సహచరికి (పాతవే అయినా) ఈ నాలుగుమాటలు

దృశ్యం-1
మొదటిసారి
ఆమెను కలసినప్పుడు
నీటి చెలమనుకున్నాను
సంవత్సరాలుగా
తోడిన నీటిలో
మునిగిన చెరువయ్యాను.
దృశ్యం-2
ఓ సాయంకాలం
గోదారి ఇసుకతెన్నెలపై
ఆమెను కలిసాను
పరిచయాలు స్నేహం ఇష్టం
ప్రేమగా మారాయి
సంవత్సరాల తర్వాత
అదే గోదారి
అదే ఇసుక
నడుస్తూ గడిచిపోయిన గతంలో
ఆమె నదిగా మారిపోయింది
నేనే చెలమగా చూస్తుండిపోయా!
మొదటిసారి
ఆమెను కలసినప్పుడు
నీటి చెలమనుకున్నాను
సంవత్సరాలుగా
తోడిన నీటిలో
మునిగిన చెరువయ్యాను.
దృశ్యం-2
ఓ సాయంకాలం
గోదారి ఇసుకతెన్నెలపై
ఆమెను కలిసాను
పరిచయాలు స్నేహం ఇష్టం
ప్రేమగా మారాయి
సంవత్సరాల తర్వాత
అదే గోదారి
అదే ఇసుక
నడుస్తూ గడిచిపోయిన గతంలో
ఆమె నదిగా మారిపోయింది
నేనే చెలమగా చూస్తుండిపోయా!
--
అందుకే ప్రేమిస్తున్నానని కాకుండా ఇంకా ప్రేమిస్తున్నానని చెబుతున్నా.
-- 0--
వసంతగానం ఎప్పుడూ మదురంగానే వుంటుంది.
నన్ను కన్న అమ్మను ఎన్ని సార్లు అమ్మా అని పిలిచానో గుర్తులేదుకాని, నాచిన్ని తల్లులు ఎదపై ఆడుకున్న బుల్లి పాదాల ముద్రలు నన్ను నిత్యం పరవసింప చేస్తూనేవుంటాయి. అమ్మా అనిపిలవటం కన్నా ఏమి చెయ్యగలను.
--0--
మొన్నీ మద్యే ఎదో సందర్భంలో మహిళ పదానికి నిగంటువు వెదికాను. భూమినుంచి వచ్చినది అనే స్పురణ కలిగింది. ఆ ఓర్పు, సహనం, ప్రేమ, కరుణ, ధీరత కలిగిన మహిళలందరికి శుభాకాంక్షలు.
--0--
జ్ఞాపకాలు ఎప్పుడు వెంటాడుతాయి? జరిగిపోయినది ఎదో కళ్ళెదుటలేనప్పుడే కదా! బహుశ మీరు భౌతికంగా ఇక్కడలేని అమ్మను మాట్లాడుతున్నారా??
బంగారు వీధులున్న పట్టణానికి వెళ్ళిన అమ్మ దగ్గరకు నేనూ వెళతాను చెప్పటానికి మీరు చేసింది సాహమే అనిపిస్తుంది నాకు. మీకు జ్ఞాపకమొస్తున్న శబ్దరాగాలు కొంచెం హృదయపు చెవినిపెడితే మాకూ లీలగా వినబడుతున్నాయి.
అవును నిజమే!
అమ్మ ఎప్పుడూ మనకోసమే కలకంటూ వుంటుంది
అది బాల్యంలో లాలపోసి తడిసిన దేహాన్ని ముద్దులతో ఆవిరిచెయ్యాడం వెనుక
ఆమెలోదాగిన ప్రేమ ఎంతఘాడంగా వుంటుందో కదా!
శ్రమకు కారే బిందువుల్లోంచి సాధిస్తున్నవి విజయాలైనా అమ్మకు వెలుగుచిమ్మే నవ్వులకన్నా సహచర్యమెంతో గొప్పగా పలవరిస్తుంది.
అన్నిటిని గుర్తించిన అక్షరాలు అభినందనీయమైనవి. స్నేహితులుగా, బాల్యమిత్రులుగా అక్కా తమ్ముళ్ళు, అనా చెల్లెళ్ళుగా వుండటం ఒక మధురమైన అనుభూతే అయినా దాన్ని గుర్తుంచుకోవడం, నిలుపుకోవడం నిజంగా ప్రశంసనీయం.
----
"ఈ సందర్భంగా నా ప్రక్కటెముకగా అతుక్కుపోవడానికి నాతో నడచివచ్చిన , నా సహచరికి" ఈ వాక్యాలను చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు చదివినా ఎదో తెలియని కొత్తదనం కనిపిస్తుంది. ఏమిటా కొత్తదనం అనేది అర్థం కావటంలేదు.
ఇక రెందుదృశ్యాలను చూస్తూ చదువుతున్నప్పుడు ఎప్పుడో చూసిన క్లియోపాత్రా సినిమా గుర్తుకొచ్చింది. అందులో ఎవ్వరికి తలవంచని సీజర్ (రోమా చక్రవర్తి) ఐ బవ్ అని మోకాళ్ళపై అమె ముందు నిలబడతాడు.
అలా మీరు కనిపిస్తున్నారు.
--- పిల్లలను అమ్మా అని పిలిచి అమ్మను గౌరవిస్తున్నారో
అమ్మను గుర్తు చేసుకుంటూ పిల్లలను ప్రేమిస్తున్నారో
ఇద్దరూ జెండరు ప్రకారం స్త్రీలే కావటం కాకతాళీయమా! ??
నాకూ ఎవేవో రాయల్నిపిస్తునాదండోయ్ మీ టపా చదివాక
అభినందనలు
అపూర్వ
26 comments:
మహిళా దినోత్సవం సందర్భంగా ఎవరికైనా ఇంతకంటే మంచి బహుమతి ఇంకేముంటుందండీ మీ కుటుంబ సభ్యులకు ఇంతమంచి బహుమతి ఇచ్చారు గ్రేట్ సర్!
జాన్ గారు:
మరీ ముఖ్యంగా ఆ దృశ్యాలు చాలా ఆత్మీయంగా వున్నాయి. ఈ కోణం నించి ఎంత రాసినా తక్కువే అనుకుంటాను, కాబట్టి, మరిన్ని రాయండి. కుటుంబ అనుబంధాలు మరింత గాఢంగా విస్తారంగా కవిత్వంలోకి రావాల్సిందే.
అఫ్సర్
//క్రైస్తవనమ్మకం ప్రకారం అమ్మను కలవటానికి నేనూ ఓ రోజు వెళతాను.//
'క్రైస్తవ నమ్మకం ' కాకపోతే వెళ్ళరా?! అర్థం లేకుండా ఇక్కడ క్రైస్తవ నమ్మకం , హిందూ నమ్మకం, ఇస్లాం నమ్మకం ఏంటి? అమ్మ మీద ప్రేమంటూ వుంటే, ఏరోజైనా వెళ్ళవచ్చంటాను. అమ్మ మతాతీతమైనది, జంతువులకు కూడా అమ్మ , అమ్మనే! కాదంటారా?
శంకర్
Excellent sir.
పరిమళ గారూ
మీ స్పందనకు నెనరులు
@ శంకర్ గారు, క్రైస్తవ నమ్మకం ప్రకారం అనేది "బంగారు వీధులున్న పట్టణం" కి సంబంధించినది... అమ్మను కలవడం గురించి కాదు. ఏదైనా రాసేటప్పుడు కొంచెం తెలుసుకుని రాస్తే బాగుంటుంది.
@జాన్ గారు, చాలా మంచి విషయాలు పంచుకున్నారు :)
అఫ్సర్
సందర్భాన్ని బట్టి రాయడానికి ప్రయత్నిస్తాను
మీస్పందనకు నెనరులు
I understood ! :) Thanks for your sensibility !
శంకర్ గారూ,
//క్రైస్తవనమ్మకం ప్రకారం అమ్మను కలవటానికి నేనూ ఓ రోజు వెళతాను.//
నిజానికది "క్రైస్తవనమ్మకం ప్రకారం బంగారువీధులున్న పట్టణానికి అమ్మను కలవటానికి నేనూ ఓ రోజు వెళతాను." అని వుండాలి.
ఒక పదం మరిచిపోయాను అందువల్ల మీకు అలా స్పురించి వుండవచ్చు. సరిచేసాను అందుకు ధన్యవాదాలు.
ఇక విశ్వాసాలు విషయం. కొంచెం విభిన్నంగా వున్నయి కాబట్టి అలా రాయవలసి వచ్చింది.
క్రైస్తవులు సాధరణంగా ప్రభువునందు నిద్రించింది అంటారు కానీ, మరణించింది అనరు. ఇంకా ఇతర విశ్వాసాలలో కొంచెం భినమైన అభిప్రాయాలు వున్నాయి. ఈ తేడావల్ల అలా రాయటమేగానీ ఎవరి విశ్వాసాలను కొలమానంపెట్టడం, వాటిని చర్చకు పెట్టడం నా వుద్దేశం కాదు గమనించ గలరు.
మీస్పందనకు నెనరులు
రూత్ గారు
మీరు అర్దంచేసుకున్న చేసుకున్నందుకు ధన్యవాదాలు
మీ స్పందనకు నెనరులు
ఓ సాయంకాలం
గోదారి ఇసుకతెన్నెలపై
ఆమెను కలిసాను
పరిచయాలు స్నేహం ఇష్టం
ప్రేమగా మారాయి
సంవత్సరాల తర్వాత
అదే గోదారి
అదే ఇసుక
నడుస్తూ గడిచిపోయిన గతంలో
ఆమె నదిగా మారిపోయింది
నేనే చెలమగా చూస్తుండిపోయా!
===Super===
జాన్!!
చెలిమిని జీవితంగా చేసికొని
చెలిమ ను నదిగా మార్చి
మీరు తడి చెలిమై పోయి
ఇంకా ప్రేమిస్తునే ఉన్నందుకు
మీకు శుభాభినందనలు తెల్పుతు
ఆ చెలిమి, ప్రేమ, బంధం కలకాలం పచ్చగా వర్ధిల్లాలని కోరుతూ
మీ
ఈగ హనుమాన్ nanolu.blogspot.com
కొండముది సాయికిరణ్ కుమార్
thanks for responding
ఈగ హనుమాన్ (హనీ),
thanks for your poetic expression
చాలా బాగా రాసారు .
మాలా కుమార్
thanks for responding
ఎక్కడో జారిపోయిన ఙ్ఞాపకాలను పొదివి పట్టుకుని తిరిగి మా చేతికిచ్చారేమో అనేట్టుగా ఉంది ఈ టపా.
మహిళా దినం నాడు మీ జీవితం లోని స్త్రీమూర్తులను గుర్తు చేసుకున్న వైనం హృదయానికి హత్తుకునేలా వుంది.
మురళి
స్పందనకు నెనరులు
రావుగారు
స్పందనకు నెనరులు
పరిమళం గారు చెప్పినట్లు మీ జీవితంలోని స్త్రీ మూర్తులకు మీరు ఇంతకంటే ఇచ్చే కానుక ఏముంటుంది చెప్పండి? అంత బాగా రాశారు ఈ టపా! అమ్మ, సహచరి, బిడ్డలు..ఈ ముగ్గురి జీవితాలతోనూ మీ జీవితం ఎంత రాగ రంజితంగా పెనవేసుకుపోయిందో భావ గర్భితంగా చిత్రించారు.
అద్భుతమనే మాట చాలదేమో!
సుజాత గారు
నా పోస్టులోని అంతరార్థాన్ని కొంత పట్టుకోగలిగారు
ధన్యవాదాలు
జ్ఞాపకాలు ఎప్పుడు వెంటాడుతాయి? జరిగిపోయినది ఎదో కళ్ళెదుటలేనప్పుడే కదా! బహుశ మీరు భౌతికంగా ఇక్కడలేని అమ్మను మాట్లాడుతున్నారా??
బంగారు వీధులున్న పట్టణానికి వెళ్ళిన అమ్మ దగ్గరకు నేనూ వెళతాను చెప్పటానికి మీరు చేసింది సాహమే అనిపిస్తుంది నాకు.
మీకు జ్ఞాపకమొస్తున్న శబ్దరాగాలు కొంచెం హృదయపు చెవినిపెడితే మాకూ లీలగా వినబడుతున్నాయి.
అవును నిజమే!
అమ్మ ఎప్పుడూ మనకోసమే కలకంటూ వుంటుంది
అది బాల్యంలో లాలపోసి తడిసిన దేహాన్ని ముద్దులతో ఆవిరిచెయ్యాడం వెనుక
ఆమెలోదాగిన ప్రేమ ఎంతఘాడంగా వుంటుందో కదా!
శ్రమకు కారే బిందువుల్లోంచి సాధిస్తున్నవి విజయాలైనా అమ్మకు వెలుగుచిమ్మే నవ్వులకన్నా సహచర్యమెంతో గొప్పగా పలవరిస్తుంది.
అన్నిటిని గుర్తించిన అక్షరాలు అభినందనీయమైనవి. స్నేహితులుగా, బాల్యమిత్రులుగా అక్కా తమ్ముళ్ళు, అనా చెల్లెళ్ళుగా వుండటం ఒక మధురమైన అనుభూతే అయినా దాన్ని గుర్తుంచుకోవడం, నిలుపుకోవడం నిజంగా ప్రశంసనీయం.
----
"ఈ సందర్భంగా నా ప్రక్కటెముకగా అతుక్కుపోవడానికి నాతో నడచివచ్చిన , నా సహచరికి" ఈ వాక్యాలను చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు చదివినా ఎదో తెలియని కొత్తదనం కనిపిస్తుంది. ఏమిటా కొత్తదనం అనేది అర్థం కావటంలేదు.
ఇక రెందుదృశ్యాలను చూస్తూ చదువుతున్నప్పుడు ఎప్పుడో చూసిన క్లియోపాత్రా సినిమా గుర్తుకొచ్చింది. అందులో ఎవ్వరికి తలవంచని సీజర్ (రోమా చక్రవర్తి) ఐ బవ్ అని మోకాళ్ళపై అమె ముందు నిలబడతాడు.
అలా మీరు కనిపిస్తున్నారు.
--- పిల్లలను అమ్మా అని పిలిచి అమ్మను గౌరవిస్తున్నారో
అమ్మను గుర్తు చేసుకుంటూ పిల్లలను ప్రేమిస్తున్నారో
ఇద్దరూ జెండరు ప్రకారం స్త్రీలే కావటం కాకతాళీయమా! ??
నాకూ ఎవేవో రాయల్నిపిస్తునాదండోయ్ మీ టపా చదివాక
అభినందనలు
అపూర్వ
అపూర్వ గారూ
సుదీర్ఘమైన మీ వ్యాక్య చదివాక
మీవ్యాక్యను నా పోస్టులో భాగంగా చేరుస్తున్నాను
ధన్యవాదాలు
very very very touching.
your post recalled my mother
my mother memories, my daughter, my wife all one by one passing like shadows all at once and one byone at the same time.
a wonderful feeling
you poured your feelings on us they all sync with ours. yes sinc with mine perfectly. very very perfectly
thank you
bollojubab
sorry for english
బొల్లోజు బాబా గారు
చాలాకాలం తర్వాత ఇటుగా వచ్చినందుకు
నెనరులు
Post a Comment