1
వర్షం
అంటే
చినుకుల
సవ్వడి-
2
కాగితపు
పడవల
బాల్యపు
గుర్తులు-
3
వోణీ
తడిసి
వొంపిన
వయ్యారం-
4
చినుకు
చిరుకాంతి
ఆకాశంతెర
హరివిల్లు-
5
ఎండిన
విత్తనానికి
జీవం
పోయడమే-
6
నెరలిల్లిన
నేలతల్లిని
పదును
చేయడమే-
7
పెళ్ళలుగా
పగిలిన
పుడమికి
పులకరింపే!-
8
దాహంగొన్న
భూమికి
తొలకరిజల్లై
సేదదీర్చడమే!-
9
ఘనీభవించిన
మేఘం
చినుకై
ద్రవీభవిండమే!-
10
కురిసి
కురిసి
పొంగిపొర్లే
ప్రవాహమవ్వడమే!-
10 comments:
ఇలా మీరు 'వర్షమంటే' అన్న శీర్షికతో నానో ప్రక్రియ ఉపయోగించుకోవటం చాలా బాగుంది సార్. ఒక్కొక్క నానోలో ఒక్కో భావం వ్యక్తపరచటం నాకు నచ్చింది.
నానోల ప్రక్రియని ఒకే ఒక ప్రత్యేక విషయాన్ని చెప్పడానికి ఉపయోగించుకున్నది మిరే జాన్ హైడ్ గారు, మిమ్మల్ని అభినందిస్తున్నాను మిత్రమా!! పోతగాని సత్యనారాయణ అనే కవి మిత్రుడు చెప్పాడూ, అతను రామాయణాన్ని నానోల్లో రాస్తున్నానని.
శుభాకంక్షలతో
మీ
ఈగ హనుమాన్ nanolu.blogspot.com
తెలుగు అభిమాని
నానొలు నచ్చినందుకు నెనరులు
నానొ వర్షంలో బాగా నానింది హర్షం తెచ్చింది
అద్బుతంగా వున్నాయి
వర్షంలో తడిసినట్టే వుంది
అపూర్వ
what is this bull shit? "వర్షం అంటే చినుకుల సవ్వడి" ..ఇది వర్షానికి నిర్వచనమా? కవిత్వమా? ఇలాంటి చౌకబారు ప్రక్రియలవల్లె తెలుగు కవిత్వం పాథకులకు దూరంగ పారిపొతుంది..ఇప్పటికైనా మేల్కొండి కవిపుంగవులారా..
బుడుగు గారూ
వర్షంలోనైనా, కవిత్వంలోనైనా
తడిసిన అనుభవం అనుభూతి ఎవరిది వారిదే
నా అనుభవం నాది
మీకు బుల్ షిట్ మీదన ఎక్కిన అనుభవం మీది
నా బ్లాగు సరిగా చదివారోలేదో
నోరు జారేముందు నిదానించండి!
ఇటువంటి బుడుగులా తెలుగు కవిత్వ గమనాన్ని నిర్దేశించేది.
ఇటువంటి ఎండిపోయిన పిందెలను అస్సలు పట్టించుకోవద్దు.
వీల్లెంత సేపూ అరిగిపోయిన భావజాలం చుట్టూ గిర గిరా తిరుగుతుంటారు.
మురిగిపోయిన ఆవకాయ నాకుతుంటారు.
వీల్లలో యే ఒక్కరూ కవిత్వాన్ని సీరియస్ తీసుకున్న వారూ కాదు, కవిత్వాన్ని రాసి తమను తాము నిరూపించుకున్నవారు అంతకూ కాదు.
ఒక్క అనుభూతి వాదాన్ని పట్టుకుని వేలాడె గబ్బిలాలే ఇవన్ని.
యెడమ వైపు మెదడే కాని వీరికి కుడి వైపు మెదడస్సలు పని చేయ్యదు,
నానోలు గురించి ఈ బుడుగు గారు తెలుగు కవులకు పిలుపునిచ్చేంత మొనగాడా.
బుడుగు బుడుగు లాగా ఉంటెనే మంచిది, హద్దులు మీరొద్దని ఇది వార్నింగ్........
ఎవరో కాని భలే వాయించావు గురూ ఈ బుడుగులను, ఆ మధ్య అవాస్తవులు కొందరు పనికట్టుకుని నానోల మీద విరుచుకుపడ్డారు.
ఈ అంతర్జాల టెర్రరిస్టులు వాల్లకు నచ్చిన వాట్ని పట్టుకుని వేల్లాడుతు, మీరన్నట్లు, అన్నమయ్య పదాల మీద రీసెర్చ్ చెయ్యమంటారు....అలా అలా ముసలి ముచ్చట్లు చెబుతూ వెనక్కి వెనక్కి పొయే పుట్టుకతో వౄద్దులు.
అంతర్జాలం వీల్లయ్య సొత్తైనట్లు, బ్లాగులు రాసే వాల్లని నిర్దేషించాలని ప్రయత్నిస్తారు.
అంతర్జాలం అందరిది, ఎవరొక్కరి సొత్తు కాదు, అందరు గుర్తెరగాలి.
బుడుగులారా వటుడుల్లాగ కాకుండా మీకు సత్తా ఉంటే, పై మిత్రుడు చెప్పినట్లు, ప్రింట్ మీడియాలో మీ కవిత్వాన్ని ప్రకటించి, పురోగమించండి...
మీ తిరోగమన వాదాన్ని వదలండి, శుభాకాంక్షలతో
సాహిత్యాభిమాని
వాస్తవం
edo okati rayanivvandi.. telugu chachipothondo ani okapakka gola peduthune, rase vallameeda viruchuku padatam enduku?
aithe telugu chachipothondo ledo teliyadu kani chikki pothondi..
ila naanee lu, naano latho
chavadam kante chikdam manchide kada..
Post a Comment