ఏదో బ్లాగుల్లో రాసేయాలని ఒకటే తపన. ఏమిరాద్దామన్న ఎటూ తేలని ఆలోచనలు సతమతం చేస్తునే వున్నాయి. మతంపేరుతో జరుగుతున్న దాడులు కలవర పెడుతున్నాయి. ఇవేవీ కొత్తకాదు అనిపిస్తోది.
అప్పుడెప్పుడో సుమారు ఓ వంద సంవత్సరాల పూర్వం మా తాత (నాన్న గారి నాన్న) క్రైస్తవ్యంలో ఏమినచ్చిందో ఒక్కసారిగా ఆచారాలను, కుటుంబాన్ని కాదని క్రైస్తవ్యంలోకి దూకాడు. అది సరైనదికాదని ఎందరో నచ్చచెప్పడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృదా అయ్యాయి. అప్పటికి బ్రహ్మచారిగా వున్న తాతకు పిల్లను ఇవ్వటానికి చుట్టుప్రక్కల గ్రామాలలో నిరాకరించారు. దేశమేమీ గొడ్డుపోలేదంటూ అప్పటి మిషనరీల సాయంతో అప్పటికి ఐదవ తరగతి చదివిన మరో హిందూ కులంనుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. తన బందువులమద్య, గ్రామంలోనూ ఇబ్బందులు మొదలయ్యాయి. కొన్ని తగాదాలు, పంచాయీతీలతర్వాత వూరినుంచి వెలివేసారు. అయినా తనకు సంక్రమించిన ఆస్తి అయిన 25 ఎకరాల పొలంలో ఒక పాకవేసుకొని జీవనం మొదలుపెట్టారు. వారికి వ్యవసాయంలో సాయానికి కూలీలు రాకుండా కట్టడి చేయబడింది. అయినా దేనికీ వెరవకుండా జీవనం సాగిస్తునే వున్నారు. వారికి ముగ్గురు మగ పిల్లలు కలిగారు. తనకు ముందు మూడు నాలుగు తరాలలో ఒకొక్కరే సంతానంగా వుంటూ వచ్చారు. తనకు ముగ్గురు మగసంతానం కలిగే సరికి మురిసిపోయేవాడట మా తాత గారు. తగ్గాయనుకున్న దాడులు మళ్ళీ మొదలయ్యాయి. ఇల్లు తగుల బెట్టబడింది. పాడి పశువులపై దాడి జరిగింది ఆ దాడిలో గాయపడిన తాతయ్య మళ్ళీ కోలుకోలేదు. చివరి మాటగా ఈ గ్రామంలో వుండవద్దు, ఎక్కడికైనా వెళ్ళి పిల్లలను చదివించు అని చెప్పి శాస్వత నిద్రలోకి జారిపోయారు. మా తాతగారి మాటను, ముగ్గురు పిల్లలను తీసుకొని ఆ గ్రామానికి దూరంగా వెళ్ళిపోయింది. తన ఐదవ తరగతి చదువు అక్కరకొచ్చింది. తనకంటూ ఎవ్వరూ లేని స్థితిలో మిషనరీలే అన్ని తామై ధైర్యానిచ్చారు. తనకు తెలిసిన లేసు అల్లికలతో, మిషనిరీల దగ్గర పనిచేస్తూ ముగ్గురినీ చదివించింది. పాతికెకరాల పొలంకోసం ఎప్పుడూ వెనుతిరిగి చూడలేదు. అందులో చివరి వారు మా నాన్న.
ఇవన్నీ అలోచిస్తున్నప్పుడు ఏ నిఘూఢ మర్మం నమ్మకం వెనుక దాగివుంది అనే అనుమానం కలుగుతుంది. జీవితాన్ని, జీవనాన్ని, ఆస్తులను పణంగా పెట్టడానికి వెనుకాడని మర్మం ఎమైవుంటుదనే సందేహాన్ని నేను వెతుకుతూనే వున్నాను.
4354
13 comments:
'సత్యం ముఖ్యం, దాన్ని తెలుసుకునే మార్గం కాదు' అన్న హిందూత్వానికి నిజమైన అర్ధం తెలియని కుహనా మేధావులు సనాతన ధర్మాన్ని కాపాడుతామని బీరాలు పోతూ ప్రజల్ని రెచ్చగొట్టి దాడులు చేయించటం ఇప్పుడే కాదు, అప్పుడూ ఉందన్న మాట! వాటికి వెరవకుండా తనకు నచ్చిన ధర్మాన్ని ఆచరించటానికి మీ తాతగారు చేసిన పోరాటం బహు గొప్పది.
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న కవి వాక్కు పునరావృత మవుతూనే ఉంది. మీ తాతగారి జీవన పోరాటాన్ని పంచుకుననందుకు ధన్యవాదాలు.
అబ్రకదబ్ర
నిజానికి మా తాతగారికంటే నాయనమ్మ పాత్ర చాలా వీరోచితమనిపిస్తుంది నాకు.
తను నమ్మిన ధ్రమానికి ఓ మలుపిచ్చి తన కాలాన్ని పూర్తిచేసుకున్న తాత కంటే, మలుపు తిరిగిన చోటునుంచీ పునః జీవింపచేసి మా వరకు (తర్వాతి తరం వరకు) కొనసాగించడానికి ఇచ్చిన నమ్మకం గొప్పగా కనిపిస్తుంది
నెనరులు
కొత్తపాళీ గారు
తాత, నాయనమ్మల జీవనపోరాటాన్ని
కొద్దిమాటలలో రాయటానికి చాలా మథన పడ్డాను. సంపూర్ణమేమికాదు.
మీ స్పందనకు నెనరులు
చాలా మంచి టపా. స్వీయానుభవం నుంచీ పుట్టిన సంవేదనకన్నా మించిన సమాధానం ఉంటుందా!
మతమార్పిడివలన హిందూమతానికేదో పెద్ద ప్రమాదం వాటిల్లిందని psycho frenzy సృష్టిస్తున్న ఈ హిందూ తీవ్రవాదులకు, మతమార్పిడికి సిద్దమవుతున్నవారి జీవితాలు తెలీదు. తెలుసుకోవాలనే కనీస మానవత్వాన్ని ఈ మతం పొరకప్పేసింది.నిజంగా దేవుడుంటే, తను చెయ్యాల్సినపని వీరిని ఈ మూఢత్వం నుంచీ కాపాడటం.
పంచుకున్నందుకు నెనరులు.
@అబ్రకదబ్ర:
- సత్యం ముఖ్యం కాదు, దాన్ని తెలుసుకోవడానికి మార్గం అంటూ లేదు.
- అహింసను మించిన ధర్మం లేదు.
- మతం, ధర్మం ఒకటి కాదు, మతం వల్ల ఏ ఒక్కడు సత్యం తెలుసుకోలేడు.
కొత్తపాళీ గారన్నట్లు
గతకాలము తడిచె రక్తముతో కాకుంటె కన్నీళ్ళులతో
మీ కుటుంబ చరిత్ర చదూతుంటే కళ్లు చెమర్చాయి. ఎందుకంటే ఏమిచెప్పగలను. కొన్నివిలువలను నమ్మి నిలువునా దహింపబడిన గాధలను వింటున్నప్పుడు, వారి వీరోచిత జీవనం, వారి సంఘర్షణ, వారి అంతర్మధనం కళ్ళముందు నిలిచినపుడు, హృదయం ద్రవించే తీరుతుంది. అది మానవత్వ సార్వజనీన సూత్రం. అదేలేకపోయినట్లయితే మానవజాతి మనుగడ ఇంతవరకూ ఉండదేమో. గ్రీకు కలోసియంలలోనే అంతరించిపోయేదేమో.
ఈ సైకో ఫ్రెంజీ దాడులవెనుక మతమొక్కటే కారణముంటుందని ఒక్కోసారి నాకు నమ్మబుద్ది కాదు.
ఎందుకంటే మానవ ప్రవర్తన ఒక్కోసారి విచిత్రంగా ఉంటుంది. అసూయ, ద్వేషాలు, ఆత్మన్యూన్యత,ఆర్ధిక విషయాలు, గుంపుకట్టటం, పాతకక్షలు వంటివెన్నో కూడా తమవంతు ఆజ్యం పోస్తూంటాయని నా నమ్మకం.
ఇలాంటి దౌర్భల్యాలన్నీ మతం అనే ఒక ముసుగుని తొడుక్కుని దౌష్ట్యాలకు తెర లేపుతాయేమో.
మీ గాధలో కూడా ఆర్ధిక కారణాలు (పొలం వంటి) ఉన్నయేమోనని అనుమానం. (తప్పయితే క్షమించండి).
బొల్లోజు బాబా
నాగన్నగారు,
హిందూత్వం అసలు పేరు 'సనాతన ధర్మం'. హిందూత్వమనేది ఒక ధర్మమే, మతం కాదు. ఆ ధర్మం పరమార్ధం సత్యాన్వేషణ.
Slightly off topic. Education may provide one way to help with these problems. I know of two educational scholarship schemes which seem to working well so far; both for university students of merit.
The first is organized by Benjamin Kaila from USA and is meant for Dalitsand is called Ambedkar Scholarships.The co-ordinators are in Hyderabad.
The second called breadsocietyindia gives scholarships irrespective caste, religion. The scholarships for Eng. and medicine students are higher. The secretary Kakani Ramamohana Rao lives in Hyderabad.
If you are interested, you can google and find the information or can write to me.
హృదయాన్ని కలచివేసే సంగతు్లు ఇవి.నిజంగా మీ నాయనమ్మ గారు వీర్,ధీరనారి,ఆమె దివ్యస్మృతికి నా నివాళులు.
క్రైస్తవ్యంలో నాకు నచ్చినవి ..
1.సేవాభావం
2.క్షమాగుణం
మా నాన్నగారు ఖమ్మంలో పదవీవిరమితాంధ్రభాషాధ్యాపకులు..
మాకు కొన్ని యిళ్ళ ఆవల, వైద్యులు డాక్టర్ జాన్ గారు వుండేవారు.వారిద్దరు మంచి మిత్రులు.
వీళ్ళు కుదుర్చుకుని, చక్కగా పద్యాలు పాడుకునేవారు..
నాకు నచ్చిన అతి కొద్దిమంది బ్లాగర్లలో ..కనుమూరి గారూ మీరొకరు...
nijam gaa mii naanamma gaari poaraaTam aadarsaniiyam.ilaanTi gaadhalennoa maruguna vunnaayi.asalayina hero lu biillea.
to all respondents
thanks
Post a Comment