Friday, September 19, 2008
ప్రపంచం నలుమూలల నుంచి చదువుతున్న వారికి ధన్యవాదములు
బ్లాగుల ప్రపంచంలోకి దూరి నడుస్తూ నడుస్తూ అప్పుడే 15 నెలలు గడిచాయి. ఒక్క శాతంకూడా అర్థం కాలేదు
బ్లాగులంటే ఓ నిర్లిప్తత, నిరాశ, అసహనం... ఇలా కొన్ని భావనలు మీద పడుతున్న తరుణంలో నేనెందుకు బ్లాగాలి అని అన్పించింది. అదే విషయాన్ని టపాగా రాసినప్పుడు ఓ మిత్రుడు ఇచ్చిన సూచనమేరకు స్టాట్ కౌంటర్‌ను పెట్టి నాలుగు నెలలు అయ్యింది. అదే నిరాశ/చికాకుతో ఈ మద్య శెలవలు కూడా ప్రకటించుకున్నాను.
కానీ ఈ మద్య స్టాట్ కౌంటర్‌ను చూస్తున్నప్పుడు ఎవరెవరు, ఏ ఏ ప్రాంతాలనుండి చూస్తున్నారో అర్థం అయ్యింది. నచ్చినా నచ్చకపోయినా, అభిప్రాయాల్ని రాసినా రాయకపోయినా చూస్తున్నారన్న విషయం సుస్పష్టం. అందుకే నాకు నేనే కొత్త వుత్సాహాన్ని నింపుకొని నా పద్దతిలో ఎవరు చదివినా, ఎవరు చదవకపోయినా, ఎవరు తమ అభిప్రాయాల్ని తెల్పినా, తెలుపకపోయినా నా అనుకూలాన్ని బట్టి, నా ఆలోచనా సరళి బట్టి రాస్తూనే పోవాలని నిర్ణయించుకున్నాను.
---------
4119
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
జాన్ గారు, మీరలా కొనసాగిస్తూనే ఉండాలి. ఒక్కోసారి, కామెంట్ రాయడం కుదరకపోవచ్చు. కానీ తప్పక ఎవరో ఒకరు మన టపా లు చూస్తారు.
Thanks Ravi
కామెంట్ల గురించి పట్టించుకోకుండా, రాస్తుంటేనే అందరికి గుర్తుండేది.
చదువుతున్నారా లేదా అన్నది ముఖ్యం. కామెంటుతున్నారా లేదా అని కాదు జాన్గారు..
భావకవులవలె ఎవరికి తెలియని ఏవో టపాలు వ్రాయాలోయ్; బ్లాగు రాసుకుని వాక్య వేసుకుని చక్కగ కాలం గడపాలోయ్. ఎల్లరు బ్లాగును చూడాలోయ్. అందరు వాక్యలు వ్రాయాలోయ్. హైడ్ బాబియ్యా బ్లాగటం ఆపొద్దు. మీలోని స్వచ్చత మీ టపాలలో కనిపిస్తుంది.
కామెంట్ల గురించి పట్టించుకోకుండా మీరలా కొనసాగిస్తూనే ఉండాలి
@జ్యోతి
@రాధిక - నెనరులు
కామెంటును బాగారాగలిగిన వారు పేరు ఎందుకు చెప్పలేరో? - నాకు అర్థం కావటంలేదు
ఏది ఏమైనా నెనరులు
Post a Comment