Tuesday, September 23, 2008

వ్యసనాన్ని మానటం ఎలా??

వ్యసనాన్ని మానటం ఎలా అని తరచు అడిగే కొందరికి నేనిచ్చిన సూచనలను ఇక్కడ పెడ్తున్నాను.
మొదట వ్యసనానికి అలవాటుకు మద్య తేడాను గుర్తించాలి
వ్యసనం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా జరిగే మార్పుల ప్రభావాన్ని గుర్తించాలి
వ్యక్తిగత దృఢ సంకల్పంతో పాటూ మిత్రుల, కుటుంబీకుల సహకారం అవసరం.
వ్యసనాన్ని మానాలనుకున్నప్పుడు దాని తీవ్రతను గుర్తించాలి. తీవ్రతను బట్టి ఒక్కసారిగా మనాలా లేక అంచలంచలుగా మనాలా అనేది నిర్ణయించుకోవాలి.
వ్యసనం ప్రభావాన్ని చూపే సమయాన్ని గుర్తించాలి. ఆ సమయంలో జరిగే శారీరక, మానసిక పరిణామాలను గుర్తించాలి, దానికి అణుగుణంగా వైద్య సహకారాన్ని పొందటానికి వీలు కలుగుతుంది. సమయాలను గుర్తించడం ద్వారా మనల్ని మనం నియంత్రించుకోవాడానికి, ఆ సమయాలను అదుపుచేసుకోవడానికి వీలుకలుగుతుంది
నేను మానాలనుకున్నప్పుడు చాలా సంఘర్షణకు లోనయ్యాను. సుమారు 4 సంవత్సరాలు పట్టింది.
ఈ సమయంలో నా ప్రక్కటెముక ఇచ్చిన సహకారం మరువలేనిది.


-----
4204

3 comments:

Bhãskar Rãmarãju said...

నేను పొగతాగటం మానేసా. ఎలా మానేసా అంటే? ఇంజను స్టక్ ఐతే ఆగిపోతుంది కదా ఠకా మని.. అలా.. దాన్నే ఆంగ్లమున "కోల్డ్ టుర్కీ" అందురు..
ఆతర్వాత ఎప్పుడూ తాగాలనిపించలా. పక్కనోళ్ళు తాగుతున్నా నేను చలించలా. మనం అనుకోవాలి మానేద్దాం అని. మనస్సుని మన చేతిలో పెట్టుకోవాలి. హా!! మొన్ననే అలవాటుజేసుకుని ఉంటాడు, ఆపేసాడు అనుకోవద్దు. 1993 నుంచి తాగుతున్న.
పొగతాగటం మానేస్తే అని ఒక టపా కూడా రాసా. ఇక్కడ చూడండి.
http://ramakantharao.blogspot.com/2008/07/blog-post_14.html

థాంక్సులు
భాస్కర్ రామరాజు

చిలమకూరు విజయమోహన్ said...

వ్యసనాన్ని మానుకోవాలనే సంకల్పం గట్టిగా వుంటే మానడం కష్టమేమీ కాదు.వ్యసనాలతో జీవితాన్ని తద్వారా సంసారాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఎంతమందో !

జాన్‌హైడ్ కనుమూరి said...

భాస్కర్ రామరాజు
నేను మద్యపానాన్ని మానటానికి చేసిన ప్రయత్నాలను గురించి రెండు మూడు సార్లు(కౌన్సిలింగు కార్యక్రమంలో) నా అనుభవాల్ని పంచుకోవటం జరిగింది.
అవే విషయాల్ని ఎక్కడైనా రాయమని మిత్రులిచ్చిన సలహాతో నాటపా మొదలు పెట్టా. వరుసక్రమం ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు. అయినా కొన్ని ముఖ్యాంశాలను రాసాను.
మీ టపా చూసిన తర్వాత కొత్త వుత్సాహం వచ్చింది
తరువాతి టపాలో వివరిస్తాను.
ధన్యవాదాలు