Friday, August 8, 2008

కాల తపస్విని

ఈగైవాలిన శబ్దం
చెవిలో రాగమై ధ్వనిస్తోంది
ఒక్కసారిగా
వాయుపుత్రుడు ఆవిష్కరించబడతాడు
ఆవిష్కరణకై
ఆత్మారామునికోసం వెదకుతుంటాను

సముచిత స్థానమివ్వని
ఏ మైరావణ సభలోనైనా
తోక సింహాసనమైపోతాను

అద్దరిన ఊరిస్తున్న
సంద్రాన్ని దాటడానికి
ఒక్కవుదుటన వుద్విగ్నుడనౌతాను

మాటలు
ముష్ఠిఘాతాలుచేసి
ముష్కరుల మట్టుబెట్టబోతాను

ఏ రాక్షసత్వమో దాచిన రహస్యాన్ని
ఛేదించిన
ఋజువేదో తేవాలనిచూస్తాను

జీవంకోసం వెదకులాటలో
సంజీవినేదో అర్థంకాక
ఎదురయ్యే పర్వతాన్నే ఎత్తుకొస్తాను

కాలం నడుస్తున్న దారిలో
సర్వకాల తపస్వినై
వీరోచిత విజయునికోసం
ఎదురుచూస్తుంటాను

శాశ్వతమైపోవాలని
శిలా విగ్రహాలు నిలిపినా
అనంతవిశ్వయానంలో
ఏ మణిహారంలో ఇమడలేక
అగోచర అణువై మిగిలిపోతాను

అంకురంకోసమో
నా ప్రతిబింభంకోసమో
ఒక్కసారిగా గుండెల్ని చీల్చి చూడలేక
యాతన పడుతుంటాను.
----
3727

6 comments:

oremuna said...

Excellent!
Indeed...

నిషిగంధ said...

WOWW!!

"కాలం నడుస్తున్న దారిలో
సర్వకాల తమస్వినై
వీరోచిత విజయునికోసం
ఎదురుచూస్తుంటాను"
చాలా బావుందండీ!!

Purnima said...

Excellent!! Can't find better word than this.

జాన్‌హైడ్ కనుమూరి said...

@కిరణ్ గారు
చాలా కాలం తర్వాత ఓ ముక్క రాసారు
నెనరులు

@నిషిగంధ గారు
మీకు ఆశ్చర్యాని గొలిపేరీతిలో
మలచగలిగినందుకు సంతోషిస్తున్నాను
మీ స్పందనకు నెనరులు

@పూర్ణిమ గారు
స్పందనకు నెనరులు

Naga said...

బాగుంది కవిత.

"కాలం నడుస్తున్న దారిలో
సర్వకాల తమస్వినై
వీరోచిత విజయునికోసం
ఎదురుచూస్తుంటాను."

తమస్వినై అంటే ఏమిటి మాస్టారు (తపస్వినై?)

వీరోచిత విజయుడు ఎన్నడో గానీ రాడు, ఎదురుచూస్తే వచ్చేది మరణం మాత్రమే! పొరపాట్న వచ్చినా, తన్నులు తిన్న రామదాసుకు బదులు తానీషాకు కనబడ్డట్టు జరగవచ్చు :)

జాన్‌హైడ్ కనుమూరి said...

@ నాగన్న గారు
పొరపాటుకు మన్నించాలి
అది "తపస్వినినై" సరిచేసాను.
మీరడిగిన/లేవనెత్తిన ప్రశ్నకు తర్వాత వివరణ ఇస్తాను.
స్పందనకు నెనరులు