టపా మరొకసారి, అభిప్రాయాలు చదువుతున్నప్పుడు "గీతాంజలి"సినిమాలోని ఓ సన్నివేసం గుర్తుకు వచ్చింది. హిరోయిన్ తనకున్న వ్యాధి గురించి తెల్సీ సంతోషంగా వుండటంకోసం ప్రయత్నిస్తూనే వుంటుంది. కానీ ఓరోజు రాత్రి తండ్రి దగ్గరకి వచ్చి చచ్చిపోతానని భయమేస్తుంది నాన్నా అంటుంది.
---
నా అమ్మాయికి చిన్నతనంలో కలిగిన చిన్న అనారోగ్యం వల్ల అన్నిటికీ భయపడుతుంది.
గోడమీద బల్లిని చూస్తే భయం, రాత్రిపూట బయటవున్న టాయిలెట్‌కు వెళ్ళాలంటే భయం, ఇలా పెద్ద లిస్టువుంది పరీక్షలంటే భయం.
వీటికి తోడుగా మావీధిలో జరిగిన సంఘటన భార్యభర్తల తగువులాటలలో భ్యార్యను రోకలి బండతో కొడితే తలపగిలి చనిపోయింది. ఒక్కసారిగా దబ్బున పడిపోతూ పక్కనేవున్న పిల్లాడిపై పడి పిల్లాడుకూడా చనిపోయాడు గది అంతా రక్తమయం. అది చూసిన మా అమ్మాయి చాలా రోజులు భయాన్నుంచి తేరుకోలేదు.
అదే సమయంలో తన స్నేహితురాలి అక్క మెడిసెన్ కౌన్సిలింగుకు వెళ్ళివస్తూ యాక్సిడెంటులో చనిపోయింది. అది కూడా చూసి మరింత భయానికి లోనయ్యింది.
చాలా బాగా చదువుతుంది కానీ పరీక్షలొచ్చేసరికి అంతా భయం, భయం.
అమ్మాయికి అమ్మ దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువ చనువుగా వుండటంవల్ల, తరచూ భయాన్ని పోగొట్టటానికి కౌన్సిలర్‌గా మారాను.
అందుకే ఈ టపా చదువుతున్నప్పుడు మా అమ్మాయిలు గుర్తుకొచ్చారు. కానీ ఈ భయాలు వ్యక్తి గతమైనవీ, మానసికమైనవి.
వీటికి సామజికమైన(జీవన సరళి) భయం తోడైతే జీవితం దుర్భరంగా అనిపిస్తుంది. అనేక జీవితాల్లోకి చాపకిందనీరులా వ్యాపించి మానవ సంబంధాలను నాశనం చేస్తుంది.
----
ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు, వేరేది చదివినదో, జరిగినదో, చూసినదో గుర్తు రావటం అనేది ఒక మంచి రచనా లక్షణం.
అందుకు మరోసారి అభినందనలు.
----
సంభాషణాత్మకంకా సాగిన కథలు అరుదుగా చదివిన గుర్తు(కథలు చదవటమే తక్కువ), , నిన్నటినుంచి ఎవరికథలు చదివానా అని బుర్ర గోక్కుంటున్నా ఒక్కటి గుర్తు రావటంలేదు
-----
ఈ మద్య కలర్స్ చానల్‌లో "ఖతరోంకి కిలాడి" అని ఒక ప్రొగ్రాం వస్తుంది. అందులో ప్రముఖ మోడల్స్ కొంతమంది పాల్గొంటున్నారు. వారి స్లోగన్ "జో ఢర్‌గయా ఓ ఘర్ గయా".
భయానికి మరో పేరు "ఫోభియా" అన్ని భయాలు ఒకేలా వుండవు. కొన్ని భయాలు వంశపారంపర్యగా వస్తాయట. కాని నిత్యం నడుస్తున్న దారిలో కళ్ళెదుటే జరిగేవాటికి జీవనం భయమయం అయినప్పుడు జీవితం ధైర్యానికి కొత్తనిర్వచనాల్ని వెతుక్కోవలసిందే.
----
నాకింట్లోనే భయం వేస్తుంది.. డాడ్!!
టపా చదివిన తర్వాత మీతో పంచుకోవాలనిపించి ఈ కొన్ని మాటలు
---
ఇంటర్మీడియెట్ చదువుతున్న మా అమ్మాయిలు అప్పుడప్పుడూ ఎదోరకమైన భయంగురించి చెబుతానేవుంటారు.
వాళ్ళతో మాట్లాడుతున్నట్టే అనిపించింది.
---
సంభాషణాత్మకంగా కథను నడిపించడం గొప్పటెక్నిక్ అనిపిస్తుంది నాకు. అందులోనూ ఫోనులో మాట్లాడుతూ కథను నడిపించడం, వర్తమానంలోంచి గతంలోకి, గతంలోంచి వర్తమానంలోకి సమాజాన్ని, విషయాన్ని నడిపించడం. అందులో విజయవంతమైన కథనంగా చెప్పవచ్చు.
---
పూర్ణిమకు అభినందనలు
No comments:
Post a Comment