Wednesday, August 6, 2008

నాకింట్లోనే భయం వేస్తుంది.. డాడ్!! - అభినందనలు

ఈ మద్య కలర్స్ చానల్‌లో "ఖతరోంకి కిలాడి" అని ఒక ప్రొగ్రాం వస్తుంది. అందులో ప్రముఖ మోడల్స్ కొంతమంది పాల్గొంటున్నారు. వారి స్లోగన్ "జో ఢర్‌గయా ఓ ఘర్ గయా".
భయానికి మరో పేరు "ఫోభియా" అన్ని భయాలు ఒకేలా వుండవు. కొన్ని భయాలు వంశపారంపర్యగా వస్తాయట. కాని నిత్యం నడుస్తున్న దారిలో కళ్ళెదుటే జరిగేవాటికి జీవనం భయమయం అయినప్పుడు జీవితం ధైర్యానికి కొత్తనిర్వచనాల్ని వెతుక్కోవలసిందే.
----

నాకింట్లోనే భయం వేస్తుంది.. డాడ్!!
టపా చదివిన తర్వాత మీతో పంచుకోవాలనిపించి ఈ కొన్ని మాటలు

---
ఇంటర్మీడియెట్ చదువుతున్న మా అమ్మాయిలు అప్పుడప్పుడూ ఎదోరకమైన భయంగురించి చెబుతానేవుంటారు.
వాళ్ళతో మాట్లాడుతున్నట్టే అనిపించింది.

---
సంభాషణాత్మకంగా కథను నడిపించడం గొప్పటెక్నిక్ అనిపిస్తుంది నాకు. అందులోనూ ఫోనులో మాట్లాడుతూ కథను నడిపించడం, వర్తమానంలోంచి గతంలోకి, గతంలోంచి వర్తమానంలోకి సమాజాన్ని, విషయాన్ని నడిపించడం. అందులో విజయవంతమైన కథనంగా చెప్పవచ్చు.
---
పూర్ణిమకు అభినందనలు
----
3618

1 comment:

Purnima said...

chaala chaala Thanks andi!!