Saturday, May 10, 2008

మదర్స్ డే - నేను అమ్మ

రోడ్డుపై నేను ... అమ్మ

అప్పుడే

చీకటి పులుముకుంటుంటోంది

చలి మెల్లగా పంజా విసురుతోంది

శాలువా కప్పుకున్న... అమ్మ

నడుస్తున్నాం ఇద్దరం

దూరం తెలియకుండా

ఏవో చెబుతోంది అమ్మ

నేడు

అదే దూరం

అదే రోడ్డు

అదే చలి

చెంత అమ్మలేదు

అయినా...

ఎన్నో సంగతులు

నన్ను కప్పేవున్నాయి

శాలువాలా !

-----------------
అమ్మ జ్ఞాపకం

2 comments:

సుజాత వేల్పూరి said...

చెంత అమ్మ లేదు,
అయినా ఎన్నో సంగతులు
నన్ను కప్పే ఉన్నాయి,
శాలువాలా!

అమ్మకు ఎప్పటికీ మరణం లేదనే విషయం ఎంత సున్నితంగా చెప్పారు

నిషిగంధ said...

అమ్మంత అందంగా ఉందండీ!