పనిచేసున్నప్పుడు జరిగిన చిన్న ప్రమాదంలో ఒక పని వానికి దెబ్బలు తగిలితే ఈ రోజు అనుకోకుండా ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చింది. అతన్ని డాక్టరు పరిక్శిస్తున్నారు నేను ఇంకొంతమంది బయట నిరీక్షిస్తున్నాము. ఇంతలో ప్రవేశద్వారం వద్ద కలకలం మొదలయ్యింది. ఏమా అనిచూస్తే ఓ పెద్దావిడకు ప్రమాదం జరిగింది. డాక్టర్లు, నర్సులు పరుగెత్తారు ఆక్సిజన్ పెట్టారు, సెలైను పెట్టారు. కానీ ఆవిడ ఎవరో ఎవరూ గుర్తించలేకపోతున్నారు. వస్త్రధారణను బట్టి చూస్తే ముస్లిం మహిళగా కనిపిస్తుంది. చేతులకు రెండేసి చొప్పున బంగారు గాజులు, చెవులకు రాళ్ళ దిద్దులు, మెడలో గుళ్ళ(బంగారం) దండవున్నాయి. చేతిలో వున్న చిన్న గుడ్డ సంచిలో కొత డబ్బు, కొన్ని పాన్ మసాలాలు వున్నాయి. ఎంతవెతికినా చిరునామా ఎవరిది దొరకలేదు. డాక్టర్ల కొంత ప్రయత్నం తరువాత కొద్దిగా కళ్ళు తెరిచి ఎదో చెప్పాలని ప్రయత్నించి, ప్రయత్నించి మళ్ళీ కళ్ళు మూసేసింది. అదే చివరి చూపని తరువాత తెలిసింది.
ఎదురుగా వున్న పోలీసు స్టేషునునుండి వచ్చిన కానిస్టేబులు పంచనామాలు రాసుకుంటున్నాడు. అప్పటివరకూ ఆత్రంగా గుమికూడిన వాళ్ళంతా ఒకొక్కరుగా ఆ ప్రదేశాన్ని ఖాళీచేసారు. అప్పుడక్కడ నిశ్శబ్దం మెల్లగా పరచుకోవడం మొదలయ్యింది.
ఎవరో ఓ తెల్లని వస్త్రాన్ని(కఫన్) ముఖంమీదుగా కప్పారు.
నాలో ఏదో ఆలోచన సుడులు తిరగటం మొదలయ్యింది. ఎక్కడెక్కడో మాటల హుకుంనామాను జారీచేసిన దేహం ఇప్పుడు నిశ్శబ్దంగా, నిరాశ్రయంగా పడివుంది.
చిరునామాని తనలోనే దాచుకొని ఎటో వెళ్ళిపోయింది ప్రాణం

5 comments:
ఎంతో మృదువుగా,సున్నితంగా వుంది.కవిత,వాక్యమయినట్టు వుంది.అభినందనలు.
ప్రముఖ గ్రీకు తత్వవేత్త Epicurus చావు గురించి అన్న ఈ మాటలు గుర్తొచాయి.
"Death is nothing to us, since when we are, death has not come, and when death has come, we are not"
@ కస్తురి మురళీ కృష్ణ గారు
ధన్యవాదములు
@ సోమశంకర్ గారు
నేను ఏ తత్వాన్ని అలోచించలేదు నాకు అనుభవమైన అనుభూతిని అదే సమయంలో రాసేసాను.
మీరు గుర్తు చేసున మాటలకు నెనరులు
చిరునామాని తనలోనే దాచుకొని ఎటో వెళ్ళిపోయింది ప్రాణం
చాలా బాగా చెప్పారు జాన్ గారు
కనుమూరి గారూ నమస్కారం..
అత్యుత్తమ బ్లాగరులలో..మొదటి అయిదు స్థానాల్లో మీ స్థానం సుస్థిరం..
ఎక్కడినుండి వచ్చిందండీ..అంత ఆర్ద్రత మీ బ్లాగుల్లో..
ఖమ్మం జిల్లా నీళ్ళే అంతలేండి...
Post a Comment