Saturday, April 12, 2008

నేనూ ఋషినే - (నేను నా అనుభవాలు)

నేనూ ఋషినే - (నేను నా అనుభవాలు) (సొంతడబ్బా అనుకోకపోతే కొన్నివిషయాలు )
బహుశ నేను ఇంటరు చదువుతున్నరోజుల్లో
"అడవి రాముడు" సినిమా విడుదలయ్యిందిఅందులో "కృషివుంటే మనుషులే ఋషులౌతారు, మహాపురుషులౌతారు" అనే పాటవుంది, అది చాలా ప్రాచుర్యం పొందింది. నేను కూడా చాలా సార్లు పాడుకున్నా, అప్పుడు దాని అర్థం బోదపడలేదు. ఈ మద్య అంటే ముప్పై ఏళ్ళ తర్వాత అనుభవానికి వచ్చాక గాని దాని పరమార్థం బోధపడలేదు.
నేను పనిచేస్తున్న చోట 1998లో కంప్యూటర్లు పరిచయమయ్యాయి.కంప్యూటరు నేర్చుకోవలసిన అవసరం తప్పనిసరి అయ్యింది.అంతకుముందెప్పుడో 1992-93ల మద్య ఒకసారి ప్రయత్నించి నేర్చుకోవడానికి ప్రయత్నించి మద్యలోనే ఓదిలేసాను. మళ్ళీ నేర్చుకోవడంకోసం ప్రయత్నించాను కాని ఎక్కడా పట్టుమని పదిరొజులు క్లాసులకు వెళ్ళలేకపోయాను. అలా అవటానికి కొన్ని కారణాలున్నాయి.>అప్పటికి ఇంకా మద్యపాన వ్యసనం మానలేదు. క్లాసులకు వెళ్ళే సమయాలు సరిగా కుదిరేవికాదు.>అప్పటికే ఆఫీసులో కంప్యూటర్‌తో పనిచెయ్యడం వలన సందేహాలు ఎక్కువగా వ్చ్చేవి. అవి క్లాసులో అడగటంవల్ల మిగతావారికి ఇబ్బందికరంగాను, ఫ్యాకల్టీకి తడబాటుగాను వుండేది. ఇలా కొన్ని ఇబ్బందులవల్ల క్లాసులనుండి నన్ను బయటకు తోసేసేవారు.
కంప్యూటరు నేర్చుకోలేకపోతే వేరే వుద్యోగం వెతుక్కోవాలేమో అనే పరిస్తితుల్లో, ఇంటర్‌నెట్టు పరిచయమయ్యింది. చాట్‌లో పరిచయమైన కొంతమంది మిత్రులవల్ల నా ఇంగ్లీషును వృద్దిచేసుకున్నాను. కంప్యూటర్‌ను ఉపయోగించుకొనే కొన్ని సులువు సూత్రాలను నేర్చుకున్నాను. నన్ను నేను కవిగా గుర్తించుకున్నాను, గుర్తింపు పొందాను. నా మాటల్లోని కవిత్వలక్షణాలను నా చాట్ స్నేహితులు గుర్తించి పోత్సాహాన్నిచ్చారు. వేరు వేరు ప్రదేసాలలొని వారమైయుండి, పరిచ్యమైనప్పటినుంది ఒక్కసారికూడా ఒకరినొకరు ఎదురెదురుగా చూసుకోలేకపోయినా స్నేహాన్ని కొనసాగిస్తూనే వున్నవారు వున్నారు. ఇటలీనుంచి డోనీ, థాయిలాండ్ నుంచి డాక్టర్ చాన్, ఇంగ్లాండు నుంచి నిస్సార్.
అప్పుడప్పుడూ అనిపిస్తుంది ఏ పూర్వమైన అనుబంధం మమ్మల్ని ముడివేసింది? కాని ఒక నిరంతర కృషి మమ్మల్ని నిలుపుతూ వచ్చింది. వారికోసం నేను చదివిన పుస్తకాలు, నాకోసం వాళ్ళు చదివిన పుస్తకాలు ఎన్ని సంగంతలు మాట్లాడోమో ఎప్పుడూ లెక్కించలేదు కాని, ఎంత అమూల్యమైన జ్ఞాన సంపదను ఖండాతరాలు దాటించామో. ఇప్పుడు నేను కంప్యూటర్‌ను వాడుతున్నాను.(సాంకేతికంగా ఎక్కడా నేర్చుకోలేదు)స్కూలు విద్యార్థిగా గాని, కాలేజీ విద్యార్థి గా కాని ఎప్పుడూ రాసిన గుర్తులేదు.అయినా కవిత్వాన్ని విరివిగా చదువుతున్నాను, రాస్తున్నాను.అన్నిటికంటే ముక్యంగా మద్యపానవ్యసనాన్ని మానేసాను.

1 comment:

శ్రీనివాస్ భీమా said...

జాన్ గారు మీరు ఋషి, మహా పురుషుడు కాదు
కృషితో నాస్తి దుర్భిక్షం కు చక్కని ఉదాహరణేమో
ఒక్కసారి సరిచూడండి
బాగా రాసారు
శ్రీనివాస్ భీమా