Saturday, March 15, 2008

ఎప్పుడు శిరసు వంచుతాయి???

బహుశ
ఎనబయ్యో దశకంలో
విద్యకు దూరమైనవారి కోసం
దూరవిద్య ప్రారంభ మైనప్పుడు
సిటీకి దూరంగా భవనాలను నిర్మిస్తుంటే
కొండచరియల మధ్య నిలబడితే
పరిసరాలు ఎక్కలేని బండలై
నను వెక్కిరించేవి
ఇప్పుడు
చదునుచేసిన రహదారివెంట
పరుగెడుతున్న నా ఆశల రథాన్ని చూసి
అవే బండలు
తలవొంచి ప్రక్కకు తప్పుకుంటున్నాయి.

(చాలా కాలం తర్వాత దర్శించిన డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలము, హైదరాబాదు)

2 comments:

Naga said...

క్షమించాలి. మొదటి నాలుగు లైన్లు వాక్యంలా ఉన్నాయి...

జాన్‌హైడ్ కనుమూరి said...

@నాగరాజా గారికి
బ్లాగు దర్శించినందుకు ధన్యవాదములు
మొదట వాక్యంగానే రాద్దామని మొదలుపెట్టా కాని చివిరకి ఇలావచ్చింది.

వచనం రాయటానికే నా ప్రయత్నం

జాన్ హైడ్ కనుమూరి