Saturday, December 8, 2007

బ్లాగ్విషయం - స్నేహం - 7


బహుస అది 1979 అనుకుంట. ఎవేవో ఆశలతో హైదరాబాదులో వుంటునప్పుడు మాతోపాటువుంటున్న కమల వాళ్ళ వూరినుంచి హైదరాబాదుచూడడానికి కొందరువచ్చారు. అందులో సుజాత, సునీత, రాధాకృష్ణ నా వయస్సువాళ్ళు కావటంవల్ల సన్నిహితం పెరిగింది. సిటీ చూడటానికి అందరం బయలుదేరాము. మూజియం, చార్మినార్, జూ, ఒకరోజు. గోల్కొండ, గండిపేట ఒకరోజు వెళ్ళాము. మొదటిరోజు పెరిగిన చనువుతో రెండవరోజు ఉత్సాహంగా బయలుదేరాము. సునీత అప్పటికే నాట్యనేర్చుకున్నది, అదీకాక అప్పటి హిందీ సినీనటి రంజిత పోలికలు వున్నాయని అందరూ అంటుండేవారు. గండిపేటలో చాలసేపు కేరింతలతో ఆడాము. తెచ్చుకున్నది తిని మద్యాహ్నము గోల్కొండచేరాము. పైకి ఎక్కి నీడ చూసుకొని కూర్చొని అంత్యాక్షరి మొదలు పెట్టము. ఒక ప్రక్కనేను మరోప్రక్క సునీత గట్టి పోటీ. పాటలతర్వాత డాన్సుచేయాలని అందరూకోరే సరికి ఒకొక్కరు మొదలుపెట్టారు. సునీత బాగా డాన్స్ చేసింది. అంతకంటే బాగా చేయాలని అత్యుత్సాహంతో నేను మొదలు పెట్టాను అంతే హటాత్తుగా సర్రుమని శబ్దం వచ్చింది. ఆ వుత్సాహంలో ఎవరు విన్నారో తెలియదుకాని నా ఉత్సాహం మీద నీళ్ళు చల్లినట్లయ్యింది. వెంటనే సదురుకుని ముభావంగా మారిపోయాను. సుజాత, సునీతలు ఎదో అనటంవల్లే ముభావంగా మారిపోయాను అనుకున్నారు. మరుసటిరోజు వాళ్ళు రాజమండ్రి వెళ్ళిపోయారు, ఎదో వెలితి వెలితిగానే మన్సులో వుందిపోయింది. అలాంటిది ఏమిలేదని నేను చెప్పినా వాళ్ళు వినలేదు. తరువాతి వారంలో నన్ను రాజమండ్రి రమ్మని ఉత్తరం వచ్చింది. రాజమండ్రి వెళ్ళాను. సునీతకు డాక్టరుతో పెళ్ళికుదిరింది, చాలా సరదాగా రోజులు గడచిపోయినా గోల్కొండ రహస్యం అదే నేను హటాత్తుగా ముభావంగా మారిపోవటం రహస్యంగానే మిగిలిపోయింది.
ఆ రహస్యం ఎవ్వరికీ చెప్పలేదు కానీ మీకు చెపుతున్నా.
అప్పటిలో ఎవ్వరికీ చెప్పని రహస్యం డాన్సు చేస్తున్నప్పుడు బిగుతుగావున్న నా పాంటు చిరిగిపోయింది.
ఎప్పుడైనా గొల్కొండకు వెళ్ళినప్పుడు అదే గుర్తుకు వస్తుంది.

1 comment:

జ్యోతి said...

హహహ,,జాన్‍గారు నిజంగా మీకు స్నేహం విషయంలో చాలా అనుభవాలు ఉన్నాయండి. ఈ బ్లాగ్విషయం మూలంగా అన్ని ఒక్కటొక్కటిగా బయటికొచ్చాయి. దాన్ని మీరు మా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు...