Monday, December 10, 2007

బ్లాగ్విషయం - స్నేహం - 8

బ్లాగ్విషయం - స్నేహం - 8
ఇంటర్మీడియట్ లో రాంగోపాల్ మిత్రుడయ్యాడు.తర్వాత ఒకే బెంచి, ఇళ్ళుకూడా ఒకే వైపు. కలిసివెళ్ళేవాళ్ళం, కలిసి వచ్చే వాళ్ళం.సినిమాలకు కలిసివెళ్ళే వాళ్ళం. వాడికి ఎన్.టి. రామారావు అంటే ఇష్టం, నాకు కృష్ణ, కృష్ణంరాజు అంటే ఇష్టం.వాడు సాఖాహారి, నేను మాంసాహారి.ఇద్దరం కలసి సరదాగా బీరు, బ్రాందీ, విస్కీ రుచి చూసాం.మా సిగిరెట్తు బ్రాండు పనమా కింగు సైజుహైదరాబాదు వచ్చాక కూడా చాలా సార్లు కలిసాం కాని ఎవో అవాంతరాల మద్య గత పది సంవత్సరాలలో ఎవరు ఎక్కడవున్నామో తెలియదు.సరదాగా రుచిచూసిన సిగిరెట్టు, మద్యపానం వదిలించుకోవడనికి చాలా అవస్థలు పడ్డాను.వాడు ఇంకా సిగిరెట్లు నిరవధికంగా కలుస్తూనే వున్నాడు.

3 comments:

బ్లాగాగ్ని said...

స్నేహం అనే బ్లాగ్విషయంపై వ్రాయడంలో మీరు చూపిస్తున్న కమిట్ మెంట్(దీనికి సరైన తెలుగు పదం తెలియదు) అమోఘం. Do keep up the good work. All the best.

రాధిక said...

చాలా ఆశక్తికరంగా వున్నాయండి.మరీ ఇంత చిన్న చిన్న టపాలు కాకుండా కొద్దిగా పెద్ద టపాలు రాస్తే బాగుంటుందనిపిస్తుంది.

జాన్‌హైడ్ కనుమూరి said...

పెద్ద టపాలు రాయాలనివున్నా సమయాభావంవల్ల రాయలేకపోతున్ననండీ.

అంతే కాకుండా
వ్యక్తిగతంగా రాస్తున్నా దానివెనుక సార్వజనీయత వుందండి గమనించగలరు