Monday, November 26, 2007

బ్లాగ్విషయం - స్నేహం4

బ్లాగ్విషయం - స్నేహం4



స్నేహితులు, మిత్రులు, సావాసగాళ్ళు, సహవాసగాళ్ళు, చెలులు ఇలా ఎలా పిలిచినా అనుబంధం శాశ్వతమేనా? జీవిత గమనంలో పెరిగేవయస్సు, అర్థిక సామాజిక స్థితిగతులు నిరంతరంగా కదిలిపోతున్నప్పుడు స్నేహం స్థిరమైనదేనా నా సందేహం?? మిగిలేది జ్ఞాపకాలు మాత్రమేనేమో!
బాల్యం, యవ్వనం, వయస్సు, ఉద్యోగాలు, వ్యాపారం ఇంకా ...... నిరంతరం ఎవరోవొకరు పరిచయమౌతూ, ఎవరోవొకరు విడిపోతుంటారు. "అవసరం కొత్తది సృష్టించడానికి తల్లిలాంటిది" అనేది ప్రస్తుతం స్నేహంలోకి చేరిపొయిందేమో? అరమరికలులేని మాటలు డబ్బు నేపద్యంలో తెరమరుగౌతూ కొత్త సంస్కృతికి తెరతీస్తూనే వున్నాయి. రైలు ప్రయాణంలాంటి జీవితంలో ప్రతి మజలీలో పరిచయమై సాన్నిహిత్యాన్ని పెంచుతూ తమతమ ప్రయాణం ముగియగానే దిగిపోయే ప్రయాణికుల్లా అంతర్థానమౌతారు. మళ్ళీ కలుస్తారోలేదో!
అవసరాలలో ఆదుకున్నవాడే అసలయిన స్నేహితుడు" అనే సూక్తి నిజమనిపిస్తున్నా, ఏది అవసరం? అనేది మళ్ళీ ప్రశ్నగానే మిగిలిపోతుంతుందేమో !
వర్గాలుగా విడిఫోతున్న వారు
బాల్యం
యవ్వనం
స్కూలు
కాలేజీలు
అక్కడక్కడ తారసపడేవారు
ప్రేరేపించేవారు
కలం
కులం
పరిసరాలలో కలిసుండేవారు
ఆఫీసు సహచరులు
కుటుంబ సన్నిహితులు
వ్యాపార సన్నిహితులు
సాహితీ వనాలు
బ్లాగులు
... ఇలా నిరంతరం లోనికివస్తూ బయటికిపోతూ జీవితంలో ఓ గొప్ప అనుభవాల్ని, అనుభూతుల్ని, జ్ఞాపకాల్ని మిగిల్చిపోతారు.

అప్పుడప్పుడు
భర్తకు భార్య, భార్యకు భర్త స్నేహితుల పాత్రను పోషిస్తూవుంటారు.
బాల్యమొక్కటే గొప్ప స్నేహసమయం అనిపిస్తుంది నాకు.
నిరంతర క్రమానుగత పరిణామ చలనంలో విలువలు, నిర్వచనాలు, అవసరాలు మారుతూనే వుంటాయి.
స్నేహంకూడా !

2 comments:

Rajendra Devarapalli said...

జాన్ హైడు గారూ, మీ బ్లాగ్విషయం స్నేహం స్పూర్తితో నేనొక చిన్న జ్ఞాపకం రాసాను.వీలుంటే చదవండి. ఈ లింకు నొక్కండి.అలాగే తెలుగుపీపుల్ డాట్ కాం వారు ప్రచురించిన లింకు కూడా ఇస్తున్నను.మీ అభిప్రాయం చెప్పేందేకు ప్రయత్నించండి.


రాజేంద్ర కుమార్ దేవరపల్లి

http://visakhateeraana.blogspot.com/2007/11/blog-post_26.html

http://www.telugupeople.com/discussion/article.asp?id=67617

Anonymous said...

మీరు స్నేహం గురించి రాసిన టపాలన్నీ చదివాను. ఎన్నో అనుభవాలను "స్నేహం" గురించిన ఎన్నో ఆలోచనలను మా ముందుంచారు.
ధన్యవాదాలు.

బాల్యంలో అనుభవాలు కలల వంటివేమో. మనకు ఎన్నో అనుభూతులు కలిగిస్తాయి. లీలగా మిగిలిపోతాయి.

మంచి పరిణతి వచ్చిన / వచ్చే దారిలో (కాలేజీలో) ఉన్నప్పుడు ఏర్పడ్డ స్నేహాలు మనుషులు తరచూ కలిసినా కలవక పోయినా, బాగా నిలిచే స్నేహాలుగా నాకు అనుభవం అయ్యాయి.