Thursday, November 1, 2007

31.10.1984 నా జ్ఞాపకాల నుండి (ఇందిరా గాంధి హత్య)

మద్యప్రదేశ్ లోని సోని నదిపై కడుతున్న ప్రొజెక్ట్ లో స్టోరుకీపరుగా పనిచేస్తున్న రోజులు. సైటులో పనిచేయటానికి అవసరమైన సామానులు, డోజర్స్, డ్రిల్లుగుకొసంవాడే సామనులు వుండేవి నాస్టోరులో.
పదిగంటలలోపు అందరూ సైటులోకి వెళ్ళిపోతే మళ్ళీ మూడు . గంటలవరకూ ఎవ్వరు పలకరించేవారు కాదు. విశాలమైన ప్రదేశం, స్టీలు రాడ్స్ నిల్వవుండేవి.

ఒంటరిగా ఎదో రాసుకుంటూనో ఎదైనా చదువుకుంటూనో కాలాన్ని కష్టంగా గదుపుతుండే వాణ్ణి.
నా స్టోరు వెనుక గోడవతల ఇంకో కంపనీ ఆఫీసు వుండేది.

31.10.1984 సుమారు 11.30 గంటల్కు హటాత్తుగా వెనగోడవైపునుండి శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఏమిజరుగుతుందోనని బయటకు వచ్చా. అంతలలో అటువైపునుంది ఒక సూట్కేసు పడింది. ఎమైవుంటుందో అని ఆత్రుతతో వెళ్ళి సూట్కేసును నారూములోకి తెచ్చుకున్నా. చాలా సమయం గడచింది. ఎవ్వరూ సూట్కేసుకోసం రాలేదు సరికదా అవతలవైపు అల్లరితోపాటు మంటలు రావటం మొదలయ్యాయి. కొంచెం భయం మొదలయ్యింది. తాళవేసి కొంచెందూరంలోవున్న ఆఫీసుకు వెళదామంటే ఏమౌతుందో నని భయం. గోడకొంచం ఎత్తుగా వుండటంవల్ల అవతలపక్క ఏమి జరుగుతందోననని ఒకటే ఉత్కంట. చివరికి ధైర్యంచేసి మా ఆఫీసువద్దకు వెళ్ళాను. అప్పుడు తెలిసింది. ఇందిరాగాంధి చనిపోయిందని. గోడవతలవున్న ఆఫీసు మేనేజుమెంటు సిక్కులు. ఉదయమే కొత్తపని ప్రారంభానికి పూజచేసి మిటాయిలు పంచారట. మిఠాయిలు యాదృచ్చికంగా ఇందిరాగాంధీ చనిపోయిందని తెలిసే సమయం కావటంవల్ల, యాజమాన్యం సిక్కులు కావటంవల్ల అపోహపడి ఆఫీసుమీద విద్వంసానికి పల్పడ్డారు. అప్పటికి చాలా సమయం అవటంవల్ల నేను మెస్సుకు భోజనానికివెళ్ళి వెంటనే నా స్టోరుకు వెళ్ళిపోయా. ఈ హడవిడిలో సూట్కేసు సంగతి మరచిపోయా. పని ఎక్కువగా లేకపోయేసరికి కాంటీన్ కి త్వరగాచేరాం. అక్కడ మద్యాహ్నం జరిగిన ర్కరకాల అల్లర్లగురించి ప్రస్తావన వచ్చింది. అందులో చాలవరకు ఆఫీసు ద్వంసం చేసారు, కారు తగులబెట్టారు, అంతే కాకుండా వారంతర పనివాళ్ళకోసం డ్రాచేసి తెచ్చిన సుమారు యాభైవేల రూపాయలు కూడా పోయాని అనేప్రస్తావ వచ్చింది. అప్పుడు గుర్తుకు వచ్చింది. మద్యాహ్నం నేను జాగ్రత్తచేసిన సూట్ కేసు గుర్తుకొచ్చింది. వెంటనే తింటున్న అన్నం విడిచి నా బాస్ క్వార్టరుకు వెళ్ళి నేను ఒక సూట్కేసు నా రూంలో పెట్టిన సంగతి చెప్పాను. వెంటనే బాసు నాతో వచ్చారు, మరో ఇద్దరిని వెంటబెట్టుకొని వెళ్ళి సూట్ కేసును మా బాస్ ఆఫీసుకు తెచ్చి అక్కడనుంచి ఎవరికో ఫోనుచేసారు. కొద్దిసేపటికి ఒకాయన కారులో వచ్చారు. సూట్ కేసు తెరిచిచూసారు అందులో బద్రంగా వున్నది డ్రాచేసిన సొమ్మంతా. నన్ను కొద్దిసేపు పొగిడి కొత డ్బ్బుఇవ్వబోయారు కాని నేను తీసుకోలేదు. ఒక యాబై రూపాయలు తీసుకొని నా రూము మేట్స్ తో కలిసి మందుకొట్టామంతే.
ఇందిరా గాంధీ హత్యగావింపబడినసంగతి తెలసాక శోకదినాలను నేను పాటించాను. నాకు అప్పటిలో ఒక నల్లటి కోటువుండేది, ఆ రోజులన్నీ నల్లటి దుస్తులనే ధరించాను. మళ్ళీ తర్వాతి కాలంలో నల్లని దుస్తులు ధరించలేదు.
శోకదినాలను ఆచరిస్తూ ఏదైనా గుర్తుండెటట్టు చెయ్యాలనుకున్నను. ఏమిచెయ్యాలా అని ఆలోచించి, చించి చివరకు సిగరెట్టు మానేయాలనుకున్నాను. వెంటనే అందరికీ తెలయాలనే వుద్దేశంతో మా కంపెనీలో పనిచేస్తున్న లేక అనుబంధగా వున్న వారినైనా సిగరెట్టు కాల్చే ప్రతీ వారిదగ్గర ఓ సిగరెట్టు తీసుకున్నాను. మద్యలో మా యండి పర్యవేక్షనకు వస్తే ఆయన దగ్గర కూడా అడిగితీసుకున్నను. ఆయన అప్పట్లో 555 సిగరెట్టు కల్చేవాడు. అలా అందరిదగ్గరా తీసుకోని కాల్చిన సిగరెట్టు బూడిదను బద్రపరచి ఇందిరా గాంధీ దహన కార్యక్రమము పూర్తి అయిన సాయంకాలము నా సిగరెట్ల బూడిదను "సోనీ" నదిలో కలిపాను.

చాలా కాలం సిగరెట్లు కాల్చలేదు.

మళ్ళీ మద్యలో అప్పుడప్పుదూ కాల్చినా మానివేసి చాలాకాలం అయ్యింది.
ఈరోజెందుకో జ్ఞపకాలు వెంటాడి ఇలా రాయించాయి.


1990 లోనూ, 1991లోనూ డిల్లీ వెళ్ళినప్పుడు ఇందిరా గాంధి హత్యగావింపబడ్డ ప్రదేశాన్ని, సమాధిని దర్శించాను.

2 comments:

కొత్త పాళీ said...

Very interesting.
My grandfather shaved off his mustache when Mahatma Gandhi was assassinated and remained like that till his passing.
I too distinctly remember the day Indira was assassinated ...
thanks for sharing.

Anonymous said...

People should read this.