Monday, October 29, 2007

ఒకానొక సమయము - నేను

ఆ మద్య అంటే అప్పుడప్పుడే సాహిత్యంతో అనుబంధం వున్నవారిని కలుసుకుంటున్న రోజులు.
ఓ రోజు ఎవరిదో పుస్తకావిష్కరణ జరుగుతోందిచిక్కడపల్లి గ్రంధాలయంలో మొదటి వరుసలో ముగ్గురు ఆసీనులైవున్నారు వారు శ్రీ ఉత్పల, శ్రీ కె.వి.రమణ, శ్రీ పరుచూరి గోపాలకృష్ణ.ఇంకా కార్యక్రమము మొదలవ్వటానికి ఎదో ఆలస్యం జరుగుతోంది. నిజానికి అప్పటికి ఉత్పల గారితో నాకు పరిచయంలేదు. శ్రీ పరుచూరి గోపాలకృష్ణను పరిచయం చేసుకుందామని వెళ్ళాను తీరా అక్కడకు వెళ్ళాక శ్రీ పరుచూరి గోపాలకృష్ణకు నా కవితల పొత్తు ఇచ్చి, పక్కనేవున్న వారివైపు ఒక్కసారి దృష్టి నిలిపాను అదేమిచిత్రమో గానీ వెంటనే ఉత్పలగారికి పాదాభివందనంచేసి నా కవితలపొత్తు వారికిచ్చి వెనుదిరిగాను. వారంలోపు లాకు ఓకార్డురాసారు, ఫోనుచేసారు, మళ్ళీ త్యాగరాజ గానసభ మినిహాలులో కర్యక్రమానికి రమ్మని ఆహ్వానించారు. సభానంతరం నడుచుకుంటూ సుధా హోటలు వరకూ వచ్చాము, నేను ఈవారంలో అమెరికా వెళుతున్నాను రాగానే ఫోనుచేస్తాను కొంచెంసేపు మాట్లాడుకుందాము అన్నారు. కానీ మళ్ళీ కలవలేకపొయాను.
అదేమి చిత్రమో ఇప్పటికీ అర్థం కాదు నేను మొదటిసారి, చివరిసారి పాదాభివందనం చేసిన వ్యక్తి
శ్రీ ఉత్పల సత్యనారాయణ.
ప్రొఫెసర్ ముదిగొండ, మరియు ఇతరుల నివాళులు చదవండి
ఆంధ్రజ్యోతి వివిధ నుండి

2 comments:

కొత్త పాళీ said...

అయ్యొయ్యో, ఎప్పుడు స్వర్గస్తులయ్యారు? తెలియనే లేదు. నివాళుల మాల లంకె ఇచ్చినందుకు ధన్యవాదాలు. వారి కవిత్వం సంగతి ఎలాగున్నా (అంటే నాకు తెలియదని అర్థం) మనిషిగా చాలా గొప్ప వ్యక్తి.

ఏకాంతపు దిలీప్ said...

అవునండి... కొంతమందితో మనకి పరిచయం లేకపోయినా వారి చేసిన పనులు మనల్ని పాదాభివందనం చేసేట్టు చేస్తాయి... నా మట్టుకు నేను కొంత మంది వ్యక్తులు కనపడితే పాదాభివందనం చేయాలనిపిస్తుంది...

ఇంక మీరు న బ్లాగ్లో చేసిన పోస్ట్ కి ఇక్కడ స్పందిస్తున్నాను... మీలాంటి వ్యక్తుల ప్రయత్నాలే తరానికి తరానికి వారధిలా నిలిచి మనవైనవి కాలప్రవాహంలో కొట్టుకుపోకుండ కాపాడతాయి... మీ ప్రయత్నాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను... అన్నట్టు మాది కూడా పశ్చిమ గోదావరేనండి....