కూనిరాగపు విశ్లేషకులు ఎవరైనా దొరుకుతారా?
చిత్రమైన సంగతి ఈరోజు గ్రహించాను। బ్లాగులో రాయాలన్న కుతూహలాన్ని ఆపుకోలేక రాస్తున్నా.
ఆఫీసుకు టైము అయిపోతుందని త్వరత్వరగా బాత్రూములో దూరాను. బయటికిరాగానే నా భార్య ఆశ్చర్యంగా నన్ను చూసింది. సంగతేమిటని అడిగాను. నేనూ అదే అడుగుతున్నా సంగతి ఏమిటి అని నన్ను ఎదురు ప్రశ్నించింది. చాలా సేపటి తర్వాత ఉత్కంట తర్వాత చెప్పింది. బాత్రూములో కూనిరాగం తీసానట. అందులో విశేషమేమిటో అర్థం కాలేదు. అఫీసుకు సమయ తొందరలో ఆ విషయాన్ని మర్చిపోయా. ఆటోలో గుర్తొచ్చింది. అంత విశేషమేమిటని నాకు అనిపించింది.
ప్రస్తుతము పరుగులెడుతున్న బిజీ జీవిత, జీవనశైలి, ట్రాఫిక్ జాములు, బాంబుదాడులు, పంజా విసిరిన పంజాగుట్టలో ఆ మద్యాహ్నం నేను నా భార్య వుండటం, పనుల వత్తిడులు, అప్పుడప్పుడూ పలకరించే అనారోగ్యాలమద్య బాత్రూములో కూనిరాగం తీసిన సమయమేదీ గుర్తుకురాలేదు.
ఈ కూనిరాగపు విశ్లేషకులు ఎవరైనా దొరుకుతారా? అని అనిపించింది ....... ఇక అప్పటినుంచీ బ్లాగురాయాలని ఒకటే తొందర.
ఇక ఎవరు దొరుకుతారోనని ఎదురుచూపు ఇక.
3 comments:
అవును, విశ్లేషణకి అతీతమైన అనుభూతుల్లో కూనిరాగం కూడా ఒకటి.
మ్‌మ్మ్‌మ్మ్‌మ్మ్‌మ్....
నిజమెనండి...ఒక్కోసారి మనకు తెలియకుండానే కూనిరాగం తీస్తుంటాము. నేను క్లాసులో ఉండగా చాలా సార్లు కూనిరాగం తీసేవాడిని ..నాకు తెలియకుండానే. పక్కవాడు చెప్పేవరకు నాకు తెలియదు. మనసులో(మెదడులో) ఆలోచనలు ఫ్లో అవుతున్నప్పుడు తెలియకుండానే కూనిరాగం తీస్తాము. ఇది ఎప్పుడూ కాదు. కేవలం మనం ఎంతో బిజీలో ఉండి కూడా విశ్రాంతి ఫీల్ అవుతున్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. నేను క్లాసుని పట్టించుకోకుండా.. ప్రశాంతంగా ఆలోచించగలిగితే... నాకు తెలియకుండానే నాకు కూనిరాగం వస్తుంది. ఏదో నాకు తెలిసినంతవరకు (తోచింది) చెప్పాను.
yAntrika jIvitamlO jEEvana saoumdaryaM oka vetukulaTEnEmO!
Post a Comment