Tuesday, September 11, 2007

గుండె లయతప్పుతోంది

१०.९.२००७ సరిగ్గా మద్యాహానం २.05 గంటలకు పంజాగుట్ట బ్రిడ్జక్రింద నేను, నా భార్య స్లో అయిన బస్సులోంచి దిగాము.

మళ్ళీ సరిగ్గా ३.35 గంటలనుండి 3.५० గంటలవరకు ఆటోలో ట్రాఫిక్ జాం మద్య వున్నాము. అప్పుడే చినుకులు ప్రాంభమయ్యాయి.


త్వరత్వరగా అమీర్ పేట చేరి 218 బస్సు ఎక్కి రామచంద్రపురం (బి.హెచ్.ఇ.ఎల్.) చేరాము. 8 గంటల ప్రాంతంలో నా వూరినుండి తమ్ముడు ఫోనుచేసి అడిగాడు ఎక్కడున్నావని.

వేగంగా వార్తలు చేరవేసిన టెక్నాలజీకి సంతోషించాలో, ప్రమాదాల అంచుల్లోకి నెట్టబడుతున్న అవకతవకలకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి.

భయం గుప్పిటిలో జీవితాలు, వేగంగా పరుగులు,
మృత్యువు యదేచ్చగా సంచరిస్తున్న కాలం.
ఎటుచూసినా అభద్రత
ఒక్కక్షణం గుండెలనిండా గాలిపీల్చుదామంటే
కలుషితం నిండిన దారులే అన్నీ.

దుర్ఘటన మేము దాటుతున్నప్పుడు జరగలేదు మాకు సంతోషమే

కానీ మళ్ళీ మళ్ళీ భయం వెంటడుతూనే వుంది।

మృత్యువు యదేచ్చగా సంచరిస్తున్న కాలంలో ఎవ్వరిని ఎప్పుడు, ఏరూపంలో ముద్దాడుతుందో?


2 comments:

spandana said...

ప్రాణాన్ని పరిహారంతో లెక్కిస్తున్న ప్రభుత్వాలున్నంత కాలం మృత్యువు మనల్ని వెక్కిరిస్తూ వెంటపడుతూనే వుంటుంది.

--ప్రసాద్
http://blog.charasala.com

mohanraokotari said...

avineethi madam vikattata haasam chesthondi
idantha maamulenani lokam simple gaa thisukuntondi,
avineethini prajalantha adi niithani anukuntondi.