నేను కవిత్వాని ఎందుకు పట్టాను?
ఇలా చెప్పడం ఎంతవరకూ సమంజసమో తెలియదు కానీ, ఇది సత్యం.
ఎప్పుడో కాలేజీ చదివేరోజుల్లో సరదాగా అలవాటైన మద్యపానం వ్యసనంగా మారిపోయింది। ఆంధ్రప్రదేష్ లో నిషిద్దం వున్నరోజుల్లో కూడా నా ఇంట్లో మద్యం నిల్వవుండేది. అలా అని నా ఆదాయం ఏమీ గొప్పగానూలేదు. చిత్రమేమంటే ఎక్కడా పడిపోయిన సందర్బాలు లేవు. జీవితాన్ని గుట్టుగా వుంచుకోవలనే తాపత్రయం.
ఒకరోజు ఓ మిత్రుడు తన కొడుకు మొట్టమొదటి పుట్టిన రోజు పార్టీలో, కొతమందికి మందు పార్టీ కూడా ఇచ్చాడు। ఆ పార్టీకి నేను కొంత ఆలస్యంగా చేరటంవల్ల కొంచెం కొంచెం అంటూ ఎక్కువే తాగించారు నాచేత. ఇంటికొచ్చాక ఆరాత్రి నేను పడ్డ బాధ, వాంతులు,పిల్లలు భయపడ్డారు. ఆ హంగోవర్ దాని నీర్సం నెలరోజులు భాధపెట్టింది.
అప్పటినుండి మద్యం మానేయాలని చాలా ప్రయత్నాలు చేసాను.
(మనాలనుకొన్నప్పుడు పడ్డ పాట్లు మరోసారి వివరిస్తా )
ఇంటర్ నెట్ మిత్రుల పరిచయాలు, సాహిత్యం మీద అభిరుచి వున్నవాళ్ళు దొరకటంతో కొత్త వుత్తేజానిచ్చాయి।
యహూ (జియోసిటీ) లో తాజ్ మహల్ ఫోటోలు పెట్టాలని మొదలుపెట్టా । www.geocities.com/johnhyde_k/
జీవితం మారిపోయింది। తాజ్ మహల్ సైటు అలా వదిలేసి కవిత్వం అలవాటయ్యింది. ఎక్కడో చిన్న ప్రకటనచూసి పోటీకి కవిత పంపాను. అంతే! రెండవస్థానము వచ్చింది.
ప్రముఖ సినీనటుడు మిక్కిలినేని,
ప్రముఖ కవి శివారెడ్డి --- (२४.४.२००४ )సన్మానించారు.
వెనుదిరిగి చూడలేదు రాస్తూనేవున్నా.
2004లో విశాఖ నుండి సంకలనం వచ్చింది, అందులో నా మొట్టమొదటి కవిత కూడా చేర్చారు.
2006లో వరంగల్ కవితా వార్షికలో ఒక కవిత చేరింది.
2005లో నాయన సంకలనంలో ఒక కవిత చేరింది.
నేను పాల్గొనే కవిసమ్మేళనాలలో చెపుతూ వుంటాను,
మందు(మద్యం) మానేయడానికే సాహిత్యాన్ని - కవిత్వాన్ని ఆలంబన చేసుకున్నా.
మందు(మద్యం) మానేయగలిగినా సుమారు తొమ్మిది, పది సంవత్సరాల ప్రయాణం
అంత సులభమేమీ కాదు, మద్యం మానడమైనా, కవిత్వం రాయడమైనా।
వీటన్నిటి మద్య బైబిలు పెద్ద దిక్చూచి నాకు.
1 comment:
కవిత్వాన్ని గొప్పగా నిర్వచించారు.
నా స్పందనను ఇక్కడ చదవండి.
http://sahitheeyanam.blogspot.com/2008/08/blog-post_29.html
బొల్లోజు బాబా
Post a Comment