Tuesday, August 28, 2007

వలస మనిషి

ఇక్కడ
శ్లోకాల పుట్ట రాగాల దిట్ట
మూగబోయిన రాగాల పెట్టె
ఒక్కొక్కటిగా పరచబడుతున్నాయి
రండి! కొత్త రాగాలాపన చేద్దాం!


ఇక్కడ
జ్ఞాపకాలు మాలలుగా కూర్చబడుతున్నాయి
రండి! అందుకుందాం!

జ్ఞాపకాలు పరిమళాలుగా వెదజల్లబడుతున్నాయి
రండి! ఆశ్వాదిద్దాం!

గోదారి తీరంనుండి మూసీతీరానికి
నడచిన వలస పాదాలముద్రలు
ప్రదర్శింపబడుతున్నాయి
రండి! కొంచెం తిలకిద్దాం!

నల్లనివాడు
ఆశల కన్నులవాడు
నడచివెళ్ళిన వలసను
నడచిన వెలుగు మార్గాన్ని
వెలిగించిన దీపాల్ని
రండి! తెలుసుకుందాం!

నీవైనా... నేనైనా...
చివరికి వెదకాల్సింది ఆ పథమే
దానియేలైనా, సమూయేలైనా
బలపర్చిన రాజు ఆ నీతి సూర్యుడు
కుడిపార్శానికే ఈ పయనం
రండి!
మనం కూడా కూర్చుకుందాం!
మనల్ని మనం వెలిగించుకుందాం!
మనల్ని మనం కలబోసుకుందాం!

మనిషొక్కడె విడిగా మనలేడు।


(రెవ. డానియేల్ రాచర్ల గారి జ్ఞాపకార్థము 5.10.2005)

No comments: