నేను నా సహిత్యం
ఇంత సాహిత్యం నాకు ఎక్కడినుండి వస్తుందని నాకు నాకే సందేహం వస్తూంది। ఎనిమదవతరగతి (1972) జైఆంధ్రలో కొట్టుకపోయింది. అప్పటి సిలబస్ ప్రకారం లెక్కల్లో కాపోజిట్, జనరల్ అని వుండేవి. కాంపోజిట్ లెక్కలు తీసుకోవడంకోసం నాన్నను వొప్పిచడానికి పెద్దపనే అయ్యింది. తీరా వొప్పించిన తర్వాత ఏమీ చదవకుండనే సవత్సరం గడచిపోయింది. తొమ్మిదవతరగతి లెక్కలు, సైన్సు చదవటం కష్టమే అయ్యింది. అప్పుడు సైమన్ అని తెలుగు మాస్తారు వుండేవారు ఆయన ప్రభావంతో కొచం తెలుగంటే ఇష్టం కలిగింది, కాని మా నాన్న గారికి సమయం దొరికినప్పుడల్లా ఇంగ్లీషు అంటూవుండేవారు. పదవతరగతిలో తెలుగు మాష్టారు శండశాసనుడు అంటే ఆయనలానే వుంటాడనిపించేది. ఆయనభయతో తెలుగంటే కూడా భయం ఏర్పడింది. ఇక ఆండ్రూస్ ఇంగ్లీషు మాష్టారివల్ల ఇంగ్లీషుమీద కొత్తప్రేమ పుట్టుకొచ్చింది. ఎలాగైతేనేం పదవతరగతి పూర్తి అయ్యింది. పదవతరగతిలో తెలుగంటే భయంవల్ల ఇంటరులో హిందీలో చేరాను. నాకు హిందీ పెద్దగా వచ్చేదికాదు. ఎదో అప్పుడప్పుడూ హిందీ సినిమాలుచూసి సొల్లు రాసేవాడిని. అప్పుడే సినిమాలంటే పిచ్చి ఏర్పడింది. ఇంచుమించు ఆ సమయలో రిలీజ్ అయిన ప్రతీ సినిమా ఉదయం ఆటచూసే సరికి, అప్పుడప్పుడూ హిందీ సినిమాలకోసం ఏలూరునుంది విజయవాడకు, రాజమండ్రికి రైల్లో టిక్కెట్టులేకుండా వెళ్ళి వచ్చే వాళ్ళం దాంతో ఇంటరు కాస్తా కొండెక్కింది. కొద్దిగా నవలలు, డిటెక్టివ్ నవలలు చదివిన గుర్తు. జీవితం చాలా అనుభవాల తర్వాత, ఎక్కడెక్కడో తిరిగి చివరికి హైదరాబాదు చేరాను. అప్పుడే ఈనాడు పేపర్ కోసం కాలం కపోజిటర్ గా పనిచేసాను, కప్యూటర్లు రావటంతో చాలామందిని తీసివేసారు అందులో నేను ఒకణ్ణి. ఇతర ప్రెస్సుల్లో కంపోజిటర్ గా చేస్తున్న సమయంలో, ప్రింటింగు ప్రెస్సు పరిస్థితి అగమ్యంగా అనిపించి రంగం మారలనుకున్నాను. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బి.ఎ. పూర్తి చేసాను. ఎం.ఎ. చెయ్యాలనుకున్నా ఆర్థిక సమస్యలవల్ల చదవలేకపోయాను. ఎల్. ఎల్. బి. లో జాయిన్ అయ్యాను అదీ పూర్తి చెయ్యలేకపొయాను. నాయిష్టప్రకారం పెళ్ళిచేసుకోవడామే నా జీవితంలో విజయం, మిగతావన్నీ అపజయాలే. వీటన్నిటిమద్య తెలుగు కవిత్వం ఎలా వటబట్టిందో అర్థం కాదు.
ఈ మద్య విపరీతంగా చదివాను, కొన్నిసార్లు తెల్లార్లు చుదువుతూనే అలనే డ్యూటీకి వెళ్ళిన సందర్బాలు వున్నాయి। ఇదేదో అకడమిక్ మీద దృష్తి పెడితే డిగ్రీలైనా వస్తాయి కదా అంటుంది నా అర్ధాంగి.

నాకు బాల్య మిత్రులు ఎవ్వరూలేరు కాని సాహిత్యంలో చాలమంది మిత్రులయ్యారు తక్కువ కాలంలోనే.
3 comments:
వంద చెత్త అపజయాలైతేనేమి కలకాలం మీకు తోడుండే శ్రీమతిని వరించి జాక్‌పాట్ కొట్టేశారు..నిజానికి మీరు అదృష్టవంతులు.
మొన్నో భారతీయ రెస్టారెంటులో పది పాయింట్ల పట్టిక ఒకటి చదివాను.
మొట్టమొదటిది చక్కటి భాగస్వామిని ఎన్నుకోవడం . దాన్ని బట్టి భవిష్యత్తు 90శాతం ఆధారపడి ఉంటుందట!!
అదృష్టవంతులు గురువు గారూ...
ఒక్క విజయం తో అన్నింటిని జయించివేశారు.
Post a Comment