Saturday, August 18, 2007

మారిన దూరప్రయాణాలు

ప్రస్తుత దూర ప్రయాణాలు
రాత్రులకు అలవాటు పడ్డాయి
ప్రయాణిస్తూ నిదురోవచ్చునిదురోతూ ప్రయాణించొచ్చు
దూర ప్రయాణాన్ని పగటికి మార్చి
నిద్రపోలేని ప్రయాణం
కిటికీలను ఛేదించుకుంటూ వచ్చేఎండపొద నుండి
మెలమెల్లగా తప్పుకుంటూ
అప్పుడప్పుడూఎదురయ్యే వాహనాల రొద వింటూ
మేల్కొన్న ఊర్లతో కళ్ళతోనే
సంభాషిస్తూ
దాటుకుంటూ
గమన ఆగమనాల మధ్య
ఎక్కే దిగే ప్రయాణికుల్ని గమనిస్తూ
గమ్యం నగరం వైపు
నక్షత్రాల గుంపుల కోసం
జాబిల్లి తలుపు తెరచి చూసే వేళకు గూటికి చేరాలని
ప్రియసఖితోనో చిట్టితల్లులతోనో పంచుకోవాలని ప్రయాణం
తిరిగే చక్రం ప్రగతికి చిహ్నమన్నట్టు
పరుగెడుతున్న బస్సు చక్రానికి
ఆలోచనల్ని బిగించుకొని
ఒకటే చక్రభ్రమణం
నా చుట్టూ నేనే!నీ చుట్టూ నేనే!!
చింత తోపుల మధ్య పరుగెడుతున్న బస్సు
ఆలోచనల్ని జ్ఞాపకాల్నికాయలకో కొమ్మలకో తగిలించి
పరుగెడుతూనే వుంది
ప్రయాణభారమంత కట్టెలమోపు కళ్ళల్లోంచి
గుండెల్లోకి దింపుకుంటూ…
నేను హఠాత్తుగా ఏర్పడ్డ అల్పపీడన వర్షంలా
మనసంతా ఒకటే చిత్తడి చిత్తడి
ధారలు ధారల కనుల వర్షంఏదో తెలియని అలజడి
బహుశ
ఎన్నో ఏండ్లుగా
గుండె లోతుల్లో‘నిన్ను ప్రేమిస్తున్నాను’ ప్రియుడా!
వొంపులు దేరుతున్న దేహసౌర్యాన్నిపొగడుతున్న
అల్లిమిల్లి మాటలకుమోహించి పరవశించినీ ప్రేమను చీదరించానేమో!
హంసతూలికా తల్పాలను కలగంటూ కుక్కి మంచాలను కాలతన్నాను
నన్ను ఆరాధిస్తున్న కళ్ళ తడినిపసిగట్టలేని పొరలేవో కమ్మేస్తూనే వున్నాయి.
అది ఉదయమో సాయంత్రమో
గేదె తోకలై వేలాడి పోగుచేసిన పేడను పిడకలు చేసి
నాల్గునూకల గంజి కోసంమండటాన్ని చూస్తున్నాను
వెలిగీ వెలగని పిడకల్లోంచిరేగే పొగలో వర్షిస్తున్న కళ్ళను చూస్తున్నాను
తురతుర మంటూ కాల్తున్న
చితుకులుగానో కణకణమండే నిప్పుకణికల కట్టెగానో
కాలిపోయిన సజీవ కట్టెలు చూస్తున్నాను
యెష్షయి మొద్దు నుంచేనాఎండిన కట్టెల్లోంచి చిగురు పుట్టదా?
( కత్తి పద్మారావు రాసిన “కట్టెలమోపు” కవిత చదివిన తర్వాత రాసాను. )

Labels:

1 Comments:

At August 19, 2007 10:11 PM , Blogger radhika said...

caalaa baagumdamdi.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

Links to this post:

Create a Link

<< Home