Thursday, July 12, 2007

ఒక పయనం రెండుతలపులు


(నా మొదటి కథ – ఎప్పుడురాశానో చిన్నిచిన్ని సవరణలతో ఇప్పుడు)

చాలా కాలం తర్వాత ఊరిలో బస్సు దిగిన నన్ను ఎవరైనా గుర్తుపడ్తారో లేదో అనుకుంటూ మెల్లగా నడుస్తున్నా. నగరంతో పోల్చుకుంటే ఊరేమీ పెద్దగా మారలేదు. ఆక్కడక్కడ డబాయిళ్ళు, కొన్ని కొత్త వీధులు. బహుశ ప్రభుత్వ పథకాల గుర్తులు. ఆక్కడక్కడ ఇంకా తాటాకులు వాడుతున్నారే అనుకుంటూండగా పాతమిత్రుని 'బాగున్నావా' అని పలకరింపు మొదలయ్యాయి. మాటలు మాలల్లా అల్లుకుంటుంటే రాత్రంతా ఒకేబస్సులో వచ్చామని ఒకరికొకరం తెలుసుకొని ఆశ్చర్య పోవడమే మిగిలింది. ఎఏంత వొంటరివాళ్ళమైపోయామో అనిపిచింది.
ఇద్దరం బంధువుల పెళ్ళికి వచ్చాం. పెళ్ళికొడుకు తరుపున నేను, పెల్లికూతురు బధువుగా వాడు. ఆక్కడంతా సందడిగావుంది. ఏక్కడెక్కడినుంచో ఎవరొకరు వస్తూనే వున్నారు. పలకరింపులు, పిల్లల్ని తీసుకురాలేదా, చూడలేదని కొందరు, చాలాకాలమయ్యిందని కొందరి ప్రశ్నల వుక్కిరిబిక్కిరి మద్య భోజనాలు ముగిసాయి.
రాత్రిఎప్పుడో ముహూర్తం వుడటంవల్ల వచ్చినవారు ఎవరికివారే గుంపులుగాచేరి కబుర్లతో, కష్టసుఖాలో మాట్లాడుకుంటున్నారు। నాకు నా మిత్రుడికి ఓ గదిలో పక్కలు ఏర్పాటుచేసారు. కిటికీలోచి చల్లటి గాలి పలకరిస్తోంది. మావూసులకు సంజీవిని తగిలించినట్లయ్యింది. అంతే కిటికీలోచి ఎటోవెళ్ళిపోయాం. పోతూ పోతూ గడియారానికి కళ్ళాలను తీసిపోయాం. స్నానమాడిన గోదావరి, వెన్నెల్లో ఆడుకున్న జ్ఞాపకాల దొంతరలు ఒక్కసారిగా పరచబడ్డాయి. రెపరెప ఎగిరే రంగుల సీతాకోకచిలుకలు, తూనిగలవెనుక పరుగులుతీసాం. జట్టుకట్టిన జతగాళ్ళమై ఊరంతా కలయతిరిగాం. సైన్సు టీచరునుంచి బయోట్క్నాలజీ వరకు, తూర్పు పశ్చిమాల తీరుతెన్నులవరకూ, సావిత్రి నుంచి త్రిష వరకూ కబుర్లన్నీ జేబుల్లో నింపుకున్నాం.
దినచర్య లేమయ్యాయో! సెల్ ఫోనులేమయ్యాయో! ఈ మెయిలు లేమయ్యాయో! బ్లాగులేమయ్యాయో!
ముహూర్త సమయానికి అక్షతలు వేసిన గుర్తు.
అంకుల్ మీ బస్సుకు టైమవుతుంది అనటంతో గడియారానికి కళ్ళెంగా ఎవరికివాళ్ళం
కట్టుకుని విడిపోయాం. నేనొక బస్సు వాడొక బస్సు. ఓకే నగరానికి రెండు బస్సుల్లో ప్రయాణం. బస్సులో వీడియో కోచ్, పుష్ బాక్ సీటు దేహమేదో తేలికైనట్టు అనిపిస్తూ ఏవో శబ్దాలుగా సంగీతం చెవిలోకి సోకుతుంటే, అనుభూతుల వూయలూగుతూ నిద్రలోకి జారిపోయా. మిత్రుడ్ని, వూరిని మరపుపొరల్లోకి తోసేస్తూ। కళ్ళు తెరిచేసరికి వేకువ కిరణాల్లోకి నా నగరం ఆహ్వానిస్తున్నట్టనిపించింది.

సెల్ ఫోను మోగింది. పెద్దస్వరంతో నా భార్య , నిన్నంతా ఏమైపోయారు? ఎన్నిసార్లు ప్రయత్నించానో తెలుసా? ఒక కాల్ చెయ్యొచ్చుగా? అసలు ఏలోకంలోవున్నారు? ప్రశ్నల పరంపర.
మళ్ళీ నగర జంఝాటంలోకి. మళ్ళీ వూరిని మిత్రుడ్ని ఎప్పుడు కలుస్తానో అనుకుంటూ.
* * * * * *

5 comments:

Anonymous said...

ఇది ఒక పిచ్చి రచన దయచేసి ఇలా అందరిని హింసించకండి

జాన్‌హైడ్ కనుమూరి said...

ఎప్పుడో రాసాను అని ముందే చెప్పాను
తేదీలు నోటు చెయ్యకపోవటంవల్ల ఇవ్వలేకపోయాను.
ఎ మైనా చదివినందుకు ధన్యవాదములు.
పేరు చెప్పలేకపోవడం బాగాలేదు.

Anonymous said...

ఇది అర్థంలేని రాత(రోత). దయచేసి ఇలా చంపకండి... ప్లీజ్

Anonymous said...

నాదీ ఇలాంటి బాధే గురువుగారు.
ఎప్పుడైనా వూరు కి వెళితే స్నేహితులకన్నా
ప్రదేశాలే నాతో ఎక్కువ కబుర్లాడుతాయి. మీ కధ నాకు నచ్చింది.

mohanraokotari said...

neti samajam nundi paaripovaalane thapan vundi indulo,nagara sankella jiivitham llonchi, sundaraadbutha prapancham lloki veeli vachina tripthi,aa tharwathi digulu kanpaddadi mee rachanalo, oka eligi neti samajam py idi, mee marinni rachnalu chadavaalani, untaanu.