Monday, June 18, 2007

ద్యానమాలిక

ద్యానమాలిక – 1
జలము ఆకాశము చుంబించడానికి వంగినప్పుడు, లేలేతకిరణాలతో మెరుస్తున్న సముద్రం కొత్త వేణుగనాన్ని మోసుకొస్తున్నప్పుడు ఈ తీరం వద్దనే నిలబడి ఉదయభానుడి వెలుగురేఖల్ని పట్టుకోవలనే గాఢమైన కొర్కెతో హృదయం ఉప్పొంగి గాన కెరటాలై ధ్వనిస్తోంది. ఎగసిపడుతున్న ధ్వని రాగాల కోర్కెతో అలై ఎగసిపడుతుంది. ఎగసిపడే ప్రతీ అల విరిగిపడుతుందా? విరిగిన ప్రతి అల ఉగసిపడుతుందా?పక్షుల కువకువలు వినిపిస్తున్న ప్రభాత గీతిలో పాదాలను ముద్దాడుతున్న నురగలు నాయకునికి దారితొలగేందుకు ఆజ్ఞ కోసం ఎదురుచూస్తూంది. విస్వాస దేహాన్ని నీటీలలపై నడిపించేందుకు ఆహ్వానం పలుకుతుంది. అడుగు కదిపితే పాదంకింద నేలను కోస్తున్న కెరటాలు పాదాల్ని భయపెడుతూనే వుంటాయి. భయాల మద్య కొట్టుమిట్టాడుతున్న జీవితానికి మరో వుదయం, మరో వుదయం నిరంతరం సాగిపొతుంది. విరిగిపడే కెరటాలు ఇంకా భయాన్ని పెంచుతాయి. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు యింకిపోతే దోసెడు నీళ్ళు దాహాన్ని తీర్చడానికి దొరకవు. జలాల్ని చీల్చడానికి వాడిన మోషే కర్రో, ఎలీషా దిప్పటో ఎక్కడో దాచబడివుంటుంది. ఆలలపై నడచివస్తున్న నీతి సూర్యుడు ఎన్నటికీ దప్పిగొనని జీవజలతో ఎటే వస్తున్నాడు.మోస్తున్న పత్రలో నింపుకోవలసిందే! పనికిరాని పాత్రలను పగులగొట్టాల్సిందే! సముద్ర జలాల్ని చీల్చుకొనో, ఒక్కడుగైనా నీటిపైనో నడవాల్సిందే. నడావాలంటే తడవాల్సిందే!మరణం ఇరువైపులా దాడిచెయ్యాలని చూస్తున్నప్పుడు ఆరిన నేలను దర్శించడం నడచి సాగిపోవడం ఆశ్చర్యం. ఆశ్చర్యాలతో హృదయంనిండి పొంగిపారుతున్నప్పుడు స్తుతిగానాల గొంతు సవరించాల్సిందే! ఎదురయ్యే ప్రతి ఆనంద పరిమళం నాసికలకు తగులుతుంది.
సముద్రపు అలలుగా
సమస్యలు భయపెడుతున్నవేళ
సాగిపోవటానికి దారిలేదనుకున్నప్పుడు
ఎర్రసముద్రాన్ని రెండుగా చేల్చిన దుడ్డుకర్రవైపుచూస్తాను
నదిని పాయలుగాచేసిన దుప్పటికోసం వెతుకుతాను
నీటిపై మునిగే నా కోసం చాస్తున్న చేతిని అందుకుంటాను
ప్రవాహాలలో ఎదురీది సాగిపోతాను
అలలు అనుభవాలై నా గానంలో ఇమిడిపోతున్నాయి.

2 comments:

Naga said...

అధ్బుతం. చాలా బాగుంది.

జాన్‌హైడ్ కనుమూరి said...

నాగార్జున గారికి
మీకు నచ్చినందుకు
ధన్యవాదములు