శ్రీ కనుమూరి సుందర్రావు, 1.2.1923
ఫాదర్స్ డే సందర్భంగా
నాన్నకు నాల్గక్షరాల మాలలు
* * *
నేర్చినదేది నాది కాదు
నాన్న కలల వాకిట ముద్దబంతిపూవు
***
రాతలో అక్షరాలు గుండ్రం
నాన్న నేర్పినవేగా! ఎందుకుండవు!
* * *
చీకటి దారుల్లో భయం లేదు
నడక నేర్చింది నాన్న వేలుపట్టి కదా!
* * *
జీవన సంఘర్షణ ఓ యుద్దం
మెళకువలు తెల్సింది నాన్న దగ్గరేగా!
* * *
ఆంగ్లాక్షరాలు అవలోకగా
మొదటి నిఘంటువు నాన్నేగా!
* * *
నా కళ్ళకు వెలుగు రేక
వెలుతులున్న గుడిశెలో నానమ్మనుంచేగా!
* * *
నాన్న మోకరించిన నేల
మొలకెత్తిన మేరా పచ్చని ఆశీర్వాదం!
* * *
తొమ్మిది దశాబ్దాల నడక
నిత్యం నన్ను బలపరచే కాళ్ళసత్తువేగా!
* * *
2 comments:
chakkaga undandi,
mee lay out naa blog lane maarchaarandi, same pinch.
నాన్న మోకరించిన నేల
మొలకెత్తిన మేరా పచ్చని ఆశీర్వాదం!
చాలా గొప్ప వాక్యం సార్...నాన్నగారి మెడలో మీరు వేసిన ఈ అక్షరమాల పరిమళభరితం...
Post a Comment