Thursday, May 31, 2012

జ్ఞాపకాలలో....బజ్జు... ఆవకాయ, మాగాయల ముచ్చట్లు... ...


జ్ఞాపకాలలో....బజ్జు... ఆవకాయ, మాగాయల ముచ్చట్లు...

మిత్రులందరి గుర్తు చేసుకుంటూ...    

*****
sujatha bedadakota - Buzz - సార్వజనీన
...
దీన్ని 7 వ్యక్తులు మెచ్చుకున్నారు - SUDHA sudha, Nymish S, Pavani Alavala, Srikanth Eadara, Vasu Mullapudi, మరియు 2 ఇతరులు
s sahitya - :-))))24-5
SHANKAR S - అయ్యబాబోయ్ సుజాత గారూ మీరు కేక. మొత్తం పోస్ట్ చదువుతూ ఎంత ఆనందించానో ఆ చివరి లైన్ మరీనూ (ఇప్పటికో పది సార్లు అదే లైన్ చూసుకుని ఉంటాను :) )

తరతరాలుగా మాగాయకి అన్యాయమే జరుగుతోందండీ. మీ మాట కాదు గానీ ఇన్ని బ్లాగులున్నాయి. తృష్ణ గారితో సహా ఎవరైనా "మాగాయ" గురించి ఒక్కటంటే ఒక్క పోస్ట్ పెట్టారా? (తృష్ణ గారూ ఇది మీరు చదివి ఆ పనిమీద ఉంటారని ఆశిస్తున్నాను). ప్రతి ఇంట్లో ముక్కలు, నూనె, ఇంగువ, చివరాఖరికి జాడీలు అన్నీ ఆవకాయకే దోచి పెడుతున్నారు. ఇంకానా ఇకపై చెల్లదు. "మా ముక్కలు మాగ్గావాలే, మా టెంకలు మాగ్గావాలే, మా మాగాయ జాడీలు మాగ్గావాలే " అని మనలాంటి మాగాయాభిమానులందరం ఉద్యమం లేవదీద్దాం. :)24-5
sujatha bedadakota - శంకర్ గారూ,

ఫణిబాబు గారి బ్లాగులో మీ ఆవేదన ఇందాకే చదివి, ఇప్పటికిప్పుడు మాగయ ఫొటోలు తీసి రాశాను ఇది.

"మా ముక్కలు మాగ్గావాలే, మా టెంకలు మాగ్గావాలే, మా మాగాయ జాడీలు మాగ్గావాలే " అని మనలాంటి మాగాయాభిమానులందరం ఉద్యమం లేవదీద్దాం. :)_________నేనూ వస్తా పదండి!24-5
s sahitya - నేను సైతం మాగయోద్యమంకు జాడినొక్కటి కొనుక్కువస్తా24-5
రహ్మానుద్దీన్ షేక్ - ఏమాటకామాటే చెప్పుకోవాలి
ఉప్మా లో మాగాయ కాంబినేషన్ సూపర్24-5
Nymish S - i am desperately waiting for a post on "మాగాయ"..Thanks Sujatha gaaru24-5
sowmya alamuru - ఈ బజ్జుకి dislike కొట్టే అవకాశమేమైనా ఉందా?....నాకు మాగాయ నచ్చదు..ఆ అదిగో అలా ఉరిమి ఉరిమి చూడకండి. ;)24-5
రహ్మానుద్దీన్ షేక్ - మరి మాగాయ రెసిపీ కూడా పెట్టండి సుజాత గారో24-5
రహ్మానుద్దీన్ షేక్ - అందుకే మిమ్మల్ని సౌమ్యాంటీ అనేది.
ఒక్కసారి ఉప్మా లో మాగాయ వేస్కొని తినండి ఆ రుచే వేరు24-5
sujatha bedadakota - పెరుగన్నంలో మాగాయ నూనెలో నానిన టెంక వేసుకుని మా చిన్నన్నయ్య గంటన్నరకు తక్కువకాకుండా ఎంజాయ్ చేసేవాడు. మా అమ్మ వచ్చి "చాల్లే లే ఇహ, జిడ్డు గాడిదా" అని తిట్టేదాకా లేచేవాడు కాదు24-5
sujatha bedadakota - సౌమ్యా, ముందు లైక్ చేశావనుకో, un like ఛాయిస్ వస్తుంది.24-5
రహ్మానుద్దీన్ షేక్ - సుజాత గారు :)24-5
SHANKAR S - ఏంటో ఈ రోజు ఎవరి బ్లాగులో కామెంట్ పెట్టాలన్నా కుదరటం లేదు. సుజాత గారూ ఇది నా మాట గా మీరే మీ బ్లాగులో పోస్ట్ చేసెయ్యండి.

నేనొచ్చేశా. సౌమ్య గారూ గుర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్

సుజాత గారూ "మాగాయ లాగా కొత్త మోజు తీరగానే పక్కన పెట్టేయలేం దీన్ని! " ఈ లైన్ లో మాగాయ బదులు ఆవకాయ ఉండాలి.24-5
sujatha bedadakota - శంకర్ గారూ, ఘోరమైన తప్పు! ఇప్పుడే సరిద్దాను. ఆ కామెంట్ తీసేసి మళ్ళీ రాశాను ! Thanks for the correction!24-5
sowmya alamuru - ఆ అదేం తప్పుకాదులెండి శంకర్ గారూ...సుజాత గారికి "మనసులో మాట" అలా వచ్చేసింది. :P
మాగాయ లాగా కొత్త మోజు తీరగానే పక్కన పెట్టేయలేం దీన్ని.....ఇది 100% ట్రూ ఊఉ ఉ :D24-5 (సవరించబడింది24-5)
SHANKAR S - సౌమ్య గారూ
అది సుజాత గారి తప్పు కాదు మీ ఆవకాయఅభిమానులు బలవంతం గా మాపై రుద్దుతున్న మీ భావజాల ప్రభావం. అందుకే చెబ్తున్నాం "మా ముక్కలు మాగ్గావాలే, మా టెంకలు మాగ్గావాలే, మా జాడీలు మాగ్గావాలే"24-5
sowmya alamuru - మీ ముక్కలు, టెకంకలు, జాడీలు మీ దగ్గరే ఉంచుకోండి..మీరిస్తామన్నా మాగొ(కొ)ద్దు :)24-5 (సవరించబడింది24-5)
SHANKAR S - అయ్యా బాబోయ్ ఉద్యమం అనగానే విపరీతమైన పేరడీ స్లోగన్లు పుట్టుకొచ్చేస్తున్నాయి. సౌమ్య గారూ కాస్కోండి.

ఆవకాయ వాలే భాగో...మాగాయ వాలే జాగో
ఔర్ ఏక్ ముక్కా, మాగాయ పక్కా
మాగాయ పెట్టుడో..మాడు మీద కొట్టుడో24-5
sowmya alamuru - మాగాయ పెట్టుడో..మాడు మీద కొట్టుడో................కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్24-5
sowmya alamuru - ఆవకాయ, మాగాయ ఒక్కపోలికనుండు
చూడ చూడ ముక్కల జాడ వేరు
ఊరగాయలందు ఆవకాయ ఘనమురా
సౌమ్య చెప్పిన మాట సౌమ్యపు మాట24-5 (సవరించబడింది24-5)
kranti ch - మాగాయ బానే ఉంటుంది కానీ నా వోటు మాత్రం ఆవకాయ కే... :)
BTW, బ్లాగ్‌లో కామెంట్ పోస్ట్ అవడం లేదు ఎంచేతో..24-5
sowmya alamuru - హమ్మయ్యా క్రాంతిగారు మా పక్షమే. ఇవాళ మళ్ళీ బ్లాగరులో సమస్య వచ్చిందనుకుంటానండీ. ఎవరి బ్లాగుల్లోనూ కామెంట్లు పోస్ట్ అవ్వట్లేదు.24-5
Venu Srikanth Darla - అది సరే గానీ ఇక్కడెవరన్నా ఆవకాయకి మాగాయ కి తేడా చెప్తారా... ఊరగాయల్లో మనం కొంచెం వీక్ లెండి..24-5
Sowmya V.B. - ఆవకాయ ఆవకాయే, మాగాయ మాగాయే! అదే తేడా :P24-5
kranti ch - @Sowmya: ఆవకాయ ఆవకాయే, మాగాయ మాగాయే కానీ ఆవకాయ ఓ మెట్టు ఎక్కువ :P24-5
Nagaraju Pappu - "కొత్త మోజు తీరగానే..."
మాగాయమీద మోజా? దానిమీదెప్పుడూ బూజే కదా?
ఆవకాయతో ప్రేమ, మాగాయతో పరిణయం, తప్పుతుందా మరి :)
సౌమ్య - నేను మీపార్టీనే.24-5
sowmya alamuru - మాగాయమీద మోజా? దానిమీదెప్పుడూ బూజే కదా? .........హహహహ నాగరాజు గారూ రండి రండి, మనం బలం పెరుగుతోంది. :)24-5
Venu Srikanth Darla - @ Sowmya V.B హ హ హ నాకు మామిడికాయతో పెట్టిన ఊరగాయలన్నీ ఒకలాగే అనిపిస్తాయిలెండి అందుకే అడిగా :) ఐనా ఇక్కడ బజ్ లో మాగాయే గొప్పది అని యుద్దాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయ్ నాకు మీరు దేనికదే అంటే ఎలా :)24-5 (సవరించబడింది24-5)
Venu Srikanth Darla - హ హ పప్పు నాగరాజు గారు :))))24-5
SHANKAR S - రమణ గారి మాటల్లో చెప్పాలంటే
ఆవకాయ, మాగాయ రెండూ సమానమే. కాకపోతే మాగాయ కాస్త ఎక్కువ సమానం :)24-5
sowmya alamuru - తెలుగువీర లేవరా
మామిడికాయ తరగరా...తెలుగునాట రుచులకోరి ఆవకాయ పెట్టరా.
అదరవద్దు బెదరవద్దు మాగాయవారు వచ్చిన జారవద్దు.....జాడీ నీకు హద్దురా.24-5
sowmya alamuru - వన్నె తరగని ఆవ, కాయకు బెట్ట
రుచులనూరుచు బుట్టెనావకాయ
అట్టి కాయను తెచ్చిమాగయ బెట్ట
బూజులుపట్టె గదరా సుమతీ24-5 (సవరించబడింది24-5)
SHANKAR S - ఈ జాడి మనదిరా, ఈ టెంక మనదిరా.
ఈ ముక్క మనదిరా, ఈ నూనె మనదిరా
జాడి మనది, టెంక మనది, ముక్క మనది, నూనె మనది
చల్
నడుమ ఆవకాయేందిరో
దాని గొప్పలేందిరో24-5
kranti ch - @శంకర్ గారు:: ఆ మాట ముందే చెప్పేశా నేను [I mean abt Avakaya] :)24-5 (సవరించబడింది24-5)
SHANKAR S - ఆహా ఏమి రుచి
తినరా మైమరచి
రోజూ తిన్నా మరి
మోజే తీరనిది
ఊరగాయల్లో రాజా ఎవరండీ
ఇంకా చెప్పాలా మాగాయేనండీ24-5
srinivas chowdary - కారమేసి ఉప్పుతోసి మాగాయ పెట్టాను మావా రావా
తరర తరరం ... డింగ్ చిక్ డింగ్ చిక్ ......
ఆవకాయ ముక్క కలిపి ముద్దా నోట్లో పెడతాను రావే రావే
తరర తరరం ... డింగ్ చిక్ డింగ్ చిక్ .....24-5
Venu Srikanth Darla - ROFL Shankar గారూఊఊఊఊఊఊఊఊ...
జాడి మనది, టెంక మనది, ముక్క మనది, నూనె మనది
చల్
హ హ హ హ హ హ హా హ హ హ హ్ :D :D :D :D24-5
sowmya alamuru - శ్రీను, వేణూ...ఇలా గోపీల్లా ఉంటే పనికి రాదు...మీరు ఆవకాయ పార్టీయో, మాగాయ పార్టీయో తేల్చి చెప్పాలి24-5
Venu Srikanth Darla - హ హ శ్రీనూ :-))))))24-5
Venu Srikanth Darla - ఈ గొడవలేమో కానీ పాటలు అదిరాయ్ కంటిన్యూ కంటిన్యూ :)))24-5
sowmya alamuru - కనులు మూసినా ఆవకాయే
నే కనులు తెరిచినా అవకాయే
.....
కనులు మూసినా అవకాయే

జిహ్వ తప్పిన నా నాలుకనెవరో ఊరించిన సడి విననాయే
తరచి చూస్తినా జాడిలోనా ఆవాకాయ కలిపిన శబ్దమాయె
ఎచట చూచినా ఆ ఆవకాయే24-5
SHANKAR S - వేణు గారూ, శ్రీను గారూ

ఆవకాయ సోనియా గాంధీలాంటిది
మాగాయ మహాత్మా గాంధీ లాంటిది

ఆవకాయ జనాలతో కిక్కిరిసిన సిటీ బస్సులాంటిది
మాగాయ మెర్సిడెస్ బెంజ్ లాంటిది

ఆవకాయ చంద్రబోస్ పాటలాంటిది
మాగాయ ఆత్రేయ పాటలాంటిది

ఆవకాయ ఏక్తా కపూర్ లాంటిది
మాగాయ రాజ్ కపూర్ లాంటిది

ఇవన్నీ చూసి మీరే తేల్చుకోండి మీరు ఎవరి పార్టీలో ఉంటారో :)24-5
sowmya alamuru - మాగాయ నాకొద్దురో డింగరీ ఢాబికాలు పోవద్దురో
మాగయ నాకితే బూజువాసనొచ్చురో రబ్బీ బంగారు సామీ24-5 (సవరించబడింది24-5)
sujatha bedadakota - ఏమిటి? నేను ఆవకాయతో నాలుగు ముద్దలు, మాగాయతో ఎనిమిది ముద్దలు కొట్టేసి వచ్చేలేపు ఇంత యుద్ధం జరిగిందా?

పోటా పోటీగా హోరా హోరీగా బాహా బాహీగా!24-5
srinivas chowdary - అవకాయో వైపు , మాగాయో వైపు
రెండిటినీ కలిపి ఊపనా ఊపు
ఇచ్చుకో ఇచ్చుకో రెండు ప్లేట్లు ఇచ్చుకో24-5
SHANKAR S - అహనా మాగాయంట
ఓహో నా మాగాయంట

అహనా మాగాయంట, ఓహో నా మాగాయంట
భోరు భోరు మంటూ ఆవకాయ జాడీ ఏడ్చేనంట

(*****ఇది మాయా శశిరేఖ పాట)24-5
sujatha bedadakota - ఈ దెబ్బతో శంకర్ గారు సౌమ్యల్లో ఉన్న పాటల రైటర్లు బయట పడ్డారు. :-))))24-5
Venu Srikanth Darla - బెంజందరూ బాగుందంటారు శంకర్ గారు కానీ ఎక్కువ సిటీ బస్సే ఎక్కుతారు :-P.. అదీకాక పర్యావరణ శ్రేయస్సు దృష్య్టా నేను బస్సుకే ఓటేస్తాను :))))))
కానీ మిగిలిన మూడు ఆప్షన్స్ లోనూ నా ఓటు మాగాయ వైపే :)24-5 (సవరించబడింది24-5)
sujatha bedadakota - శంకర్ గారూ.........................కెవ్24-5
sowmya alamuru - తలయెత్తి జీవించు తమ్ముడా
ఆవకాయ తిని పెరిగినాననీ కనుక తెలుగువాడనయ్యానని

రుచిచూసి జైకొట్టు తమ్ముడా
ఆవకాయని మించి మరి ఏది లేదని, కనుక మాగాయ వ్యర్థంబని24-5
srinivas chowdary - వేణు శ్రీకాంత్
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్24-5
sowmya alamuru - శంకర్ గారూ నేనెప్పటికీ అలా పాడను...మీరే ఉబుసుపొక పాడిన పాటలు అవి. GRRRRRRR24-5
Venu Srikanth Darla - Thanks శ్రీను :)))) త్రివిక్రం సౌజన్యంతో24-5
sujatha bedadakota - కనులు మూసినా ఆవకాయే...సౌమ్యా! పాట అదుర్స్24-5
sujatha bedadakota - అహ నా మాగాయంట....పాట ఇంకా అదుర్స్! And why are you rubbing your shoulders? అది మాయా శశిరేఖ పాటేగా?24-5
SHANKAR S - ఇదిగో ఈ మాట వేటూరి గారే అన్నారు. ఏం చెప్తారో చెప్పండి
"మాగాయే మహా పచ్చడి పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డ విస్తరి, మానిన్యాం మహా సుందరి"24-5
srinivas chowdary - జాడీలో ఉన్నది తినాలనున్నది ...
మొత్తం మింగేదేలా
మాగాయ ఉన్నది .. ఘుమ ఘుమ అంటది
ఒకపట్టు పట్టేదేలా

ఆవకాయ చూస్తే నాలిక తడిసి పోయే ... ఆత్రం ఆపేదెలా
ఆవకాయ , మాగాయ ఎదురుంటే .. మనమిక ఆగేదేలా24-5
sujatha bedadakota - ఒకళ్ళను మించి ఒకళ్ళు కేకలు పెట్టిస్తున్నారు :-))))))24-5
SHANKAR S - srinivas chowdary గారూ మీ రెండు కళ్ళ సిద్ధాంతం ఇక్కడ పనిచేయదు :)24-5
srinivas chowdary - రెండు కళ్ళ సిద్ధాంతం కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

చంద్రబాబుది నాది పుట్టిన రోజు ఒకటే ఏప్రిల్ 20 మళ్ళీ కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్24-5
sujatha bedadakota - శంకర్ గారూ, సమయానికి వేటూరిని ముందుకు తెచ్చారు, థాంక్స్!24-5
Nagaraju Pappu - శంకర్‌గారు: వేటూరి రాసిన అసలు పాట ఇదీ:
"మాగాయేం మహాపచ్చడి? పెరుగేస్తే ఓమోస్తరి, అదివేస్తే చెడ్డవిస్తరి...24-5
sowmya alamuru - "మాగాయేం మహాపచ్చడి? పెరుగేస్తే ఓమోస్తరి, అదివేస్తే చెడ్డవిస్తరి"....అద్భుతం నాగరాజు గారూ అద్భుతం..ఆవకాయ పార్టీకి జై24-5
sowmya alamuru - సమరానికి నేడే పారంభం
మాగాయకి మూడెను పారబ్ధం

తెలుగుదేశమున ఆవకాయకి తిరుగేలేదని చాటిస్తాం
ఆవకాయ జిందాబాద్ ఆవకాయ జిందాబాద్

మాగాయ బూజుపట్టిన వాసన వద్దు
నల్లగ తేలే నూనెలు ఇకపై వద్దు

అనవసర చాకిరి, రుచి పచి ఉండదు, తిన్నారంటే జాడిపై ఒట్టు, వెయ్యండర్రా అందరు ఒట్టు
ఒట్టు ఒట్టు ఒట్టు....24-5 (సవరించబడింది24-5)
SHANKAR S - ఒకటే ఒక్కటి ఊరగాయ
జనమే మెచ్చిన మాగాయ
రుచిలో తలోంచదు ఏనాడు
మరి లేదుర దీనికి సరిజోడు

(మాగాయ ఒక్క జాడీ పెడితే వంద జాడీలు పెట్టినట్టే...జు జు బీ)24-5
రహ్మానుద్దీన్ షేక్ - అంతే అంతే
మాగాయ ఒక్క జాడీ వందేళ్ళు తిన్నా ఇంకా మిగిలే ఉంటుంది
అదే ఆవకాయ , ఒక వారంలో నే హాం ఫట్!24-5
SHANKAR S - ఆవకాయ వంద జాడీలు పెట్టినా ఒక్క మాగాయ జాడీ రుచికి సరిరాదు

రహ్మానుద్దీన్ గారూ ఇందాకే మాగాయ, ఉప్మా అంటూ పొగిడి ఇప్పుడు ప్లేటు మారుస్తారా? మీరు ఆవకాయ కోవర్టు గా ఎప్పుడు మారారు? చెప్పండి ఎన్ని జాడీలు తీసుకున్నారు ప్రతిపక్షం వాళ్ళ దగ్గర???24-5
sowmya alamuru - లేచింది నిద్రలేచింది ఆవకాయ లోకం
దద్దరిల్లింది మాగాయ ప్రపంచం

ఎపుడో చెప్పెను శ్యామ సుందర్ గారు, అపుడే చెప్పెను రాఘవ గారూ
ఇపుడే చెబుతా ఇనుకో శంకరు గారూ ఊ ఊ ఊ, నాగరాజుగారు చెప్పిన వేదం కూడా

లేచింది నిద్ర లేచింది ఆవకాయ లోకం.24-5
sowmya alamuru - కాలిఫోర్నియాలోని సిలికాన్‌వేలీలో మార్చి 28న సిలికానాంధ్రా వారి శ్రీ విరోధీనామ సంవత్సర ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. దానిలో భాగంగా జరిగిన కవి సమ్మేళనము లో శ్యామ సుందర్ గారు చెప్పిన ఆవకాయ పద్యాలు:
కం//
శ్రేష్టంబిది పచ్చళ్ళన,
టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,
ఇష్టముగ ఆవకాయను
సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!

కం//
ఊరిన ముక్కను కొరకగ,
ఔరా! అది ఎంత రుచిని అందించునయా,
కూరిమితొ నాల్గు ముక్కలు
నోరారా తినని నోరు నోరవ్వదుపో!24-5
sujatha bedadakota - సౌమ్యా, మేము ఆవకాయ తింటాం! కానీ దాని మొహం పాత పడ్డాక ఇక చూడం! అదే మాగాయనుకో ఏడాదంతా ఫ్రెష్ గా ఉంటుంది! అదీ దాని అందం, ఆత్మ విశ్వాసం, గొప్పదనం !24-5
sowmya alamuru - కం//
బెల్లము వేసిన మధురము,
పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,
వెల్లుల్లి వేయ మధురము,
పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!

కం//
చెక్కందురు, డిప్పందురు,
ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్.
డొక్కందురు, మామిడి దిది
పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!24-5
SHANKAR S - సుజాత గారూ భలే చెప్పారు. ఆవకాయ బొంబాయి నుంచొచ్చిన కొత్త హీరోయిన్ లాంటిది. మాగాయ భానుమతి లాంటిది. :)24-5
sujatha bedadakota - శ్రేష్టంబిది పచ్చళ్ళన,
టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,
ఇష్టముగ మాగాయను
సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!

ఎప్పటిదో ఎందుకు, ఇదిగో ఇప్పుడే నేను రాసిన పద్యం చదువు24-5
రహ్మానుద్దీన్ షేక్ - శంకర్ గారు ఇది ఎలా అంటే నాన్నంటే ఇష్టం కానీ అమ్మంటే ఇంకా ఇష్టం కదా!24-5
Nymish S - నేను సుజాత గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను..నా వోటు ముమ్మాటికీ మాగాయ కే24-5
sowmya alamuru - సుజాత గారూ...అలా కాపీ కొడితే కాపీకేట్ అంటారు తప్ప మాగాయ అభిమానం అనరు24-5
sowmya alamuru - ఆవకాయ ఉపయోగాలు:

కం//
ఉదయమె బ్రెడ్డున జాముకు
బదులుగ ఇదివాడిచూడు, బ్రహ్మాండములే,
అదియేమి మహిమొ తెలియదు,
పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!

కం//
ఇందువల దందు బాగని
సందేహము వలదు; ఊట సర్వ రుచిహరం
బెందెందు కలపి చూసిన,
అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!24-5 (సవరించబడింది24-5)
రహ్మానుద్దీన్ షేక్ - నేనిక్కడ నాన్ అలైన్డ్ అనమాట!24-5
sujatha bedadakota - అబ్బ రెహమాను సూపరు!

శంకర్ గారూ, మీరు కూడా! బొంబాయి నుంచొచ్చిన హీరోవిను రెండు సినిమాలకు ఫట్టు! అదే భానుమతో, ఎన్నాళ్ళకూ మర్చిపోలేం! కావాలంటే సౌమ్యనడగండి, భానుమతి గురించి!24-5
sowmya alamuru - ఆవకాయ అవతరణ:

కం//
చప్పటి దుంపలు తినుచును,
తిప్పలు పడుచుంటిమయ్య, దేవా, దయతో
గొప్పగు మార్గం బొక్కటి
చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్

అంటూ,

కం//
ముక్కోటి దేవులందరు
మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా
చక్కనిది ఆవకాయన
ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!


కం//
చారెరుగనివాడును, గో
దారిన తా నొక్కమారు తడవని వాడున్,
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు, ఆంధ్రుడు కాడోయ్!24-5
sowmya alamuru - వీటికి దీటుగా పద్యాలు రాయండి చూద్దాం...కాపీ కొట్టకుండా రాయండి...హిహిహిహ్హహహ్హహహహహహ్హుహుహుహూఉహహ్హహహ24-5
sowmya alamuru - ఆవకాయ సుతిమెత్తని గులాబీరేకులాంటిది, మాగాయ దాని కిందనున్న ముల్లులాంటిది.24-5
..nagarjuna.. .. - ఏంటో మాగాయ, ఆవకాయ అని ఆంధ్రవారి వింత వింతపేర్లు(సరదాగా తీసుకోవలి మరి). మా ఇంట్లోనైతే శుబ్బరంగా మామిడికాయ పచ్చడి అనేస్తాం.
ఇంజనీరింగ్ వచ్చాక ఆంధ్ర స్నేహితుడి ఇంటికి వెళ్తే 'ఒరేయ్ మాగయ్ వేస్కుంటావా, ఆవకాయ వేస్కుంటావా?' అని అడిగాడు.
'ఏం మామిడికాయ పచ్చడి లేదా?' అన్నా అమోమయంగా చూస్తూ....
కాబట్టి ముందు మీరు ఆవకాయకు, మాగాయకు ఉన్న తేడా చెప్పండి,ఆ తరువాత ఏది శ్రేష్టమో తేల్చి మీకు ఓ పది కామెంట్లు సమర్పించుకోగలను :)

అంతవరకు 'ప్రియ' Mango Pickle తో పండగ చేస్కుంటా24-5
sowmya alamuru - ఆవకాయ సావిత్రి కన్నులాంటిది,
మాగాయ సూర్యకాంతం మాటలాంటిది24-5
SHANKAR S - చారెరుగనివాడును, గో
దారిన తా నొక్కమారు తడవని వాడున్,
కూరిమిన మాగాయను
మురిపెంతో తిననివాడు, మనిషే కాడోయ్!24-5
..nagarjuna.. .. - సుజాతగారి బ్లాగులో కామెంటు వేయలేకపోతున్నానహో
ఎన్నిసార్లు sign-in చేసినా, anonymous comments are not accepted అని వస్తొంది :(24-5
sujatha bedadakota - నాగార్జున, ఆవకాయ :ముక్కల్లో కారం,ఆవపిండి,ఉప్పు నూనె కలిపి జాడీలో పడేస్తే ఆవకాయ రెడీ~!

కానీ మాగాయో! ఎంసెట్ ప్రిపరేషన్ లాగ ఎంతో కష్టపడాలి. ముక్కులు పొడుగ్గా తరగాలి.ఉప్పు కలిపి ఊరవేసి మూడో రోజు ఎండలో పెట్టాలి. రెండు రోజులు ఎండాక జాడీలో మిగిలిన ఊటలో కారం,వేయించిన మెంతులపొడి, ఆవాల పొడి కలిపి ఆపైన ఇంగుల పొంగించి పప్పునూనెతో పోపు పెట్టాలి. ఇక చూస్కోండి.....చెప్తుంటేనే నోట్లో నీళ్ళూరడం లేదూ?24-5
sowmya alamuru - .....అలా మాగాయ పెట్టాక బూజు పట్టనివాలి.. ఆ తరువాత తింటే ఇహ చూస్కో నరకమే నరకం :P24-5 (సవరించబడింది24-5)
sujatha bedadakota - నీకు అదేం సరదా సౌమ్యా? బూజు మాగాయ తినడం? అసలు మాగాయ బూజు పట్టే ప్రసక్తే లేదు తెల్సా24-5
sowmya alamuru - అబ్బో మహా చెప్పారులెండి......పాతబడితె ఐంక దాని మొహం కూడా చూడలేం, నల్లగా...అయ్యయ్యా...అదెలా తింటారో బాబూ24-5
..nagarjuna.. .. - ఓహ్, ఐతే మా ఇంట్లో చేసేది ఆవకాయ అన్నమాట.
ఈ తేడాలగురించి జాన్ జబ్బా స్నేహితుడిని అడిగితే
'ఏం లేదురా సింపులు మామిడికాయ పచ్చడిలో ఆవపిండి వేసి చేస్తే అది ఆవకాయ వెయ్యకుండా చేస్తే మాగాయ' అన్నాడు (వీడి గురించే పైన చెప్పింది)24-5
sujatha bedadakota - మళ్ళీ మళ్ళీ చెప్తున్నా! మాగాయ పుట్టిన(పెట్టిన)రోజు నుంచీ చచ్చే (అయిపోయే) రోజు వరకూ ఒకటే టేస్టు! అద్భుతం! నల్ల బడటానికి ఇదేవన్నా ఉసిరికాయనుకున్నావా24-5
రహ్మానుద్దీన్ షేక్ - ..nagarjuna.. .. మాగాయ అనగా చాలా ఓర్పుతో చేయాలి పైగా దిగుబడి కూడా చాలా తక్కువ.
ఆవకాయ అనగానే ఎక్కువ ఔట్పుట్, తక్కువ ఎఫర్టు
టేస్టు కూడా, ఇట్టే అయిపోతుంది
మా ఇంట్లో ఆవకాయకు ఒక నాలుగు డజన్లు , మాగాయకు ఒకరడజను
అయినా మాగాయి మరో ఏడు వచ్చే వరకూ ఉంటుంది, బూజు పట్టలా, నల్ల బడలా.... టేస్టు కూడా కంసిస్టెంటు
ఆవకాయ టేస్టు వర్షాకాలం దాటేవరకే, తర్వాత మా ఇంట్లో పచ్చడి కావాలన్నా ఆవకాయ దొరకదు. జాడీలు ఖాళీ.24-5 (సవరించబడింది24-5)
sujatha bedadakota - చాకిరీ ఎక్కువ కాబట్టే అది నిలవుండే కాలం, టేస్టూ కూడా ఎక్కువ24-5
..nagarjuna.. .. - >>పైగా దిగుబడి కూడా చాలా తక్కువ

అర్ధం కాలేదు సోదరా, శ్రేష్టమైన కాయలు ఎంచుకోవలెననా నీ ఉద్దేశ్యము ?24-5
sowmya alamuru - ఇచ్చునదె నేర్పు, జాడీనఁ
జొచ్చునదే ఆవకాయ, సుకవీశ్వరులున్
మెచ్చునదె రుచి, వాదుకు
వచ్చునదే మాగయసుమ్ము! వసుధను సుమతీ.24-5
Nymish S - Law of conservation of energy ప్రకారం మాగాయ పచ్చడి రుచి ఎక్కువ compared to .ఆవకాయ..:)24-5
sowmya alamuru - అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ఆవకాయయున్
జొప్పడిన యూర నుండుము,
మాగాయయున్న యూరు సొరకుము సుమతీ.24-5
sujatha bedadakota - వామ్మో వామ్మో ఇవాళ సౌమ్య మూర్తీభవించిన ఆవకాయ లా కనపడుతోంది నాకు ఎర్రెర్రగా!24-5
రహ్మానుద్దీన్ షేక్ - Law of conservation of mass ప్రకారం
సేం క్వాంటిటీ ఆఫ్ మమిడి కాయలు గివ్స్ లెస్ మాగాయ్ అండ్ మోర్ ఆవకాయ్24-5
Nymish S - సౌమ్యగారు కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్వ్వ్వ్వ్వ్...మీ దగ్గర పద్యాల ఫాక్టరీ ఏమన్న ఉందా?24-5
sowmya alamuru - అడిగిన రుచినివ్వని
మాగాయ దిని మిడుకుట కంటెన్‍
రుచిగల ఆవకాయ నెట్టుకు
భోజనము కానివ్వవచ్చు మహిలో సుమతీ.24-5
sujatha bedadakota - బాబులూ, అమ్మలూ ఎవరైనా వచ్చి సౌమ్యను ఆపండర్రా! తమిళ డబ్బింగ్ అమ్మవారి సినిమాల్లో క్లైమాక్స్ లో త్రిశూలం పట్టుకుని ఊగిపోతున్న రమ్యకృష్ణ కనిపిస్తోంది నాకు24-5
sowmya alamuru - అక్కరకురాని నూనె,
పెట్టిన రుచి నీయని మాగాయ, చెక్కినమా
మామిడికాయ టెంకలు,
టక్కున పారవేయవలయు గదరా సుమతీ.24-5
..nagarjuna.. .. - వామ్మో ఈ గోలంతా నాకేందుకు ఆవకాయ తెలియదు, మాగాయ్ తెలియదు
మై మామిడికాయ పచ్చడి ఇజ్ బెస్టు.24-5
sujatha bedadakota - సౌమ్యా, సౌమ్యా, సౌమ్యా !ఇదిగో ముందు మంచి నీళ్ళు తాగు24-5
Venu Srikanth Darla - >>! తమిళ డబ్బింగ్ అమ్మవారి సినిమాల్లో క్లైమాక్స్ లో త్రిశూలం పట్టుకుని ఊగిపోతున్న రమ్యకృష్ణ కనిపిస్తోంది నాకు<<
ha ha ha sujatha gaaru :))))))))24-5
sowmya alamuru - Nymish గారూ...అబ్బే పద్యాల ఫ్యాక్టరీ కాదండీ, పేరడీల ఫ్యాక్టరీ ఉంది :P24-5
రహ్మానుద్దీన్ షేక్ - సుజాత గారు, ఇవాళ్టికి ఒప్పేస్కోండి ఆవకాయ గ్రేట్ అనీ
ఇక శాంతి నేను చెబుతాను24-5
sowmya alamuru - మంచినీళ్ళు లేదు, రమ్యకృష్ణ లేదు...ఆవకాయ కి జై కొట్టేవరకు నేనూరుకోనంతే...ఆహా నా పద్యాలను చూస్తుంటే నాకే ముచ్చటగా ఉంది, ఎంత బాగా వచ్చాయి ఆవకాయ మీద పద్యాలు!24-5 (సవరించబడింది24-5)
sujatha bedadakota - నీ ముచ్చట సంతకెళ్ళా! సరే అయితే చెప్పుకుంటూ కూచో సాయంత్రం దాకా! ఆవకాయకు జై కొట్టేది లేదంతే24-5
రాజ్ కుమార్. - మాగాయా???? యాక్.. ;( మొన్న ఇంటికెళ్ళినపుడూ మా అత్త, ఒక సీసాలో ఆవకాయా, ఇంకో సీసాలో మాగాయ ఇచ్చింది.. ఆ మాగాయ ఒకే ఒక్క స్పూన్ వాడామ్... గత నాలుగు నెలల లో... ;( ;(

సెగట్రీగోరు ఇరగదీస్తున్నారు గా.. ఖాళీ లేక గానీ లేకుంటే నేనూ ఒక చెయ్యివేసెవాడీని... నా ఫుల్ సపొర్ట్ ఆవకాయకీ, ఆలమూరు సౌమ్య గారికీ ను.24-5
sowmya alamuru - మీ అందరికీ బద్దెనగారి మీద ఏమాత్రమైనా గౌరవం ఉంటే ఆవకాయ కి జై కొట్టండి...లేదంటే మొత్తం సుమతి శతకాన్ని ఆవకాయ మీద తిరగరాస్తా ఆ24-5
sowmya alamuru - అద్దీ రాజ్ కుమార్...దూకేయ్...ఆహా మన బలగంతో మన పార్టీ కళకళలాడుతోంది....నువ్వు పద్యాలో, పాటలో మొదలెట్టు మన ఆవకాయ మీద.24-5
sujatha bedadakota - సౌమ్యా, సరే రాసెయ్! ఈ లోపు నేనో మంచి పబ్లిషర్ ని వెదుకుతా! వేసేద్దాం!

నేను ఆవకాయ పేరడీ పద్యాల పుస్తకంలో మాగాయ గురించి ముందు మాట రాస్తాను.

రాజ్ కుమార్, మాగాయ రుచి తెలియాలంటే కాస్త రస హృదయం ఉండాలండీ! తెల్సా!24-5
naga prasad - ఆవకాయ, మాగాయ అనగానేమి? మా వైపు ఊరగాయ తప్ప మరొక పేరు వినలేదు.24-5
sujatha bedadakota - నాగప్రసాద్, కాస్త పైకెళ్ళి కామెంట్స్ చదువుకోండి :-))24-5
..nagarjuna.. .. - సేం పించ్ నాగా, నువ్వు నేను ఒక పార్టి.ఇలా వచ్చి గోడ మీద కూర్చొ ఈ గొడవను ఎంజాయ్ చేద్దాం :)24-5
sowmya alamuru - మామిడికాయల దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన రుచులు
నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ.24-5
రహ్మానుద్దీన్ షేక్ - అయినా రాయలసీమ వారికి మాగాయపెట్టేంత ఓపికలు నిల్లు
అందరూ, ఆవపెట్టకుండానే ఆవకాయంటారక్కడ24-5
Varudhini Katragadda - సౌమ్యా రాక్స్!

నాకూ రెండూ ఇష్టం. ఆవకాయ ఆవకాయే..మాగాయ మాగాయే..దేని రుచి దానిదే.

సౌమ్యా ఒక్కసారి పెరుగన్నంలో మాగాయ నంజుకు తినండి..ఇక వదలరు. పై పద్యాలన్నీ తిరిగి మాగాయ మీద వ్రాసేస్తారు.24-5
naga prasad - రెహ్మానూ, మా వైపు ఆవకాయ, మాగాయ ఇత్యాది పేర్లు వినలేదు నేను. విన్నదల్లా ఒక్కటే అది ఊరగాయ. కానీ, నాకెందుకో మా వైపు బండ్లమీద ఊరూరా తిరిగి అమ్మే వాళ్ళ దగ్గర ఊరగాయ బాగా నచ్చింది. హైద్ లో ఉన్నప్పుడు కోస్తా మిత్రులు ఆవకాయ, మాగాయ అని ఏవో తెచ్చారు కానీ నాకస్సలు నచ్చలేదు.24-5
sowmya alamuru - మాగాయ గఱచి చూచిన
మసలక తన యొగరు గాక మధురంబగునా?
పసగలుగు ఆవకాయుండగ
మాగయా తినువాడు వేస్టుర సుమతీ!24-5
రహ్మానుద్దీన్ షేక్ - తెలుగునాట ఆవకాయ పెట్టడమనేది ఒక పెద్ద యజ్ఞం తో సమానం
ఇంటిల్లిపాదీ ఆవపొడి కొట్టడం నుండి
మేలురకం మిరపకాయలు, మంచి ముక్కవచ్చే మామిడికాయలు వెతికి వెతికి ముక్కలు కొట్టి, పోటీ పడి వెల్లుల్లి వలిచి
కొత్తావకాయ కలిపిన వెంటనే, జాడీలో పెట్టి కలిపిన చేత్తో కలిపిన పాత్రలోనే వేడన్నం కలిపి మా అమ్మ తినిపిస్తుంది
ఆహా ఆ రుచే వేరు
మాగాయ చేస్తే అలా కాదు కదా!24-5 (సవరించబడింది24-5)
s sahitya - ఆవకాయ చాలా ఈజీ అండిపెట్టడం మాగాయ కష్టం.దేనిరుచిదానిదే వేణుగారన్నట్లు24-5
s sahitya - పైగా ఆవకాయ చాలా వేడి,ఆవపిండివల్ల.మాగాయా అట్లాకాదు24-5
sowmya alamuru - రహ్మానూ....సూపరుగా చెప్పావు..ఆ జాడీ ఊడ్చిన చేత్తోనే వేడన్నంలో ఆవకాయ కలిపి అమ్మ పెట్టే ముద్దలు...ఆహ...అద్భుతం...మధ్యలో నాన్నగారొచ్చి ఓ వెన్నపూస వేసారనుకో..అమృతం కదూ!24-5 (సవరించబడింది24-5)
s sahitya - ఆవకాయను ఆవకాయలాగే తినాలి,మాగాయ పెరుగులో కలిపి తినొచ్చు ,బెల్ల మాగాయా, అల్లం మాగాయ అని పదిరుచులు24-5
Varudhini Katragadda - సాహిత్య గారూ..ఆవకాయ లో కూడా చాలా రకాలు పెడతారు. " అల్లం మాగాయ"...మాగాయలో ఇది వినలేదే.24-5
naga prasad - మాగాయ పచ్చడుంది ఆవకాయ జాడి ఉంది సోదరా ఏది బెస్టురా....
మాగాయ పచ్చడంటే జిడ్డు జిడ్డు ఆవకాయ టేస్ట్ చూస్తే చేదు చేదు,... జగడ జగడం జగడ జగడం జాం జాం.24-5
s sahitya - నాకు మాత్రం తెలుసా వేణుగారు అల్లా చెప్పేయడమే :-P24-5
John Hyde - ఇదేదో చూస్తుండగా నొరూరెన్ గదా
యని నే ఒక్కపరి వంటగదిని జొరబడగా
ఆ డాక్టరు చెప్పిన దేదీ గుర్తులేదా
హతవిధీ పచ్చళ్ళనుండి కావగరావె యనివేడె నా సతి !
..nagarjuna.. .. - సూపర్ నాగా
కెవ్వు కేక24-5
s sahitya - ఆవకాయలో రకాలా ? చెప్పండి నాలుగు24-5
రహ్మానుద్దీన్ షేక్ - naga prasad మీకు బొత్తిగా టేస్టు లేదు ఆవకాయ చేదా? మీ నాలుకను డాకటరుకు చూపండి24-5
naga prasad - అసలు ఇదంతా కాదుకానీ, మావైపు దొరికే ఊరగాయ అనేది ఆవకాయ లేదా మాగాయ రెండిట్లో దేనికి చెందుతుంది చెప్పండి ముందు.24-5
రహ్మానుద్దీన్ షేక్ - నాగా, అది ఆవకాయే24-5
s sahitya - రహ్మాన్ గారు పాళ్ళు సరిపోనట్లయినా ఆవపిండి చేదొస్తుంది24-5
..nagarjuna.. .. - ఐతే ఆవకాయ పెరుగులో వేసుకోరా !!!!?

మా ఇంట్లోనైతే ఒక్క పెరుగులొనేమిటి, పప్పులో, కూరల్లో, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని లాగించేస్తామ్

మీ ఆవకాయ్, మాగాయ్ జాన్తా నయ్
జైబోలో మాడికాయ్ పచ్చడి24-5
Venu Srikanth Darla - లేదు నాగా అది మాగాయే :))24-5 (సవరించబడింది24-5)
s sahitya - నాగప్రసాద్ గారు ఊరగాయంటేనే నిల్వపచ్చ్చళ్ళు.ఏదని ఎల్లా చెబుతాం24-5
రహ్మానుద్దీన్ షేక్ - నాగా, మీరు చెప్పే ఊరగాయలో మామిడి ముక్కలుగా ఉందా? అయితే అది ఆవకాయే24-5
రహ్మానుద్దీన్ షేక్ - చారి గారూ,
పెరుగులొనేమిటి, పప్పులో, కూరల్లో, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని లాగించేస్తామ్
అది ఆవకాయే24-5
s sahitya - నాగార్జున గారు అన్నీ మామిడికాయ పచ్చళ్ళే ,మామిడి తొక్కు పచ్చడి కోరు పచ్చడి ఆవకాయ మాగాయ రకాలు ఇవ్వన్నీ24-5
రహ్మానుద్దీన్ షేక్ - సాహిత్య గారూ, అవమానం తెలుగింట ఆవకాయలో ఆవపాళ్ళు సరిపోకపోతే ఘోరావమానం24-5
naga prasad - నేను చెప్పే మామిడి కాయ పచ్చడిలో మామిడి కాయ ముక్కలు ఉంటాయి. ముక్కలతో పాటు మామిడికాయ జీడి చెక్కలు కూడా ఉంటాయి. :-)24-5
రహ్మానుద్దీన్ షేక్ - అదే నాగ, అది ఆవకాయే
జీడి చెక్క అనగా టెంక24-5 (సవరించబడింది24-5)
..nagarjuna.. .. - మరి మాగయ‌ను పెరుగులో కలుపుకొవచ్చు అంటారేమిటి, అక్కడికి ఆవకాయతో తినరి అన్నట్టు....
కాబట్టి ఆవకాయ్ మాగాయ్ జాన్తా నయ్ :P24-5
s sahitya - మాగాయలో పెరుగుకలపగా వచ్చిన రుచి ఆవకాయకు రాదు.కొత్తావకాయ కున్న రుచి పాతబడిన ఆవకాయకు రాదు24-5
s sahitya - నాగప్రసాద్ గారు తమిళింట ఉన్నారుకావున పాళ్ళు అల్లాగే వస్తాయిలెండి షేక్గారు24-5
..nagarjuna.. .. - ఓఓఓఓఓఓఓఓఓ
ఐతే ఇన్ని రహస్యాలు చెప్పి నోరూరింనందుకు రెహ్మాను, సుజాతగారు, సాహిత్యగారు, వేణుగారు మీరందరు తలా కొంత మాగయ పార్శిల్ చేయండి నాకు24-5
naga prasad - ఇదంతా కాదుగానీ, అప్పటికప్పుడు ఫ్రెష్‌గా మామిడిముక్కలను కోసి మామిడి కాయ కారం చేస్తారు మా వైపు. అన్నిటికన్నా అది ఇంకా సూపర్. :-)24-5
..nagarjuna.. .. - సౌమ్యగారు మీరు ఆవకాయ
నాగా, నువ్వు ఉరగాయ్ పార్శిల్ చేయ్
సమ్మర్ సమ్మగా ఎంజాయ్ చేస్తానిక24-5
s sahitya - నేను సుజాతగారి తరుపున వాధించాను నా వాటా ఆమెనే ఇస్తారు .ఫోనె చేసి అడగండి.(ఎల్లాగు రాంగ్ నెంబర్ అంటారు)24-5
రహ్మానుద్దీన్ షేక్ - ఇదంతా కాదుగానీ, అప్పటికప్పుడు ఫ్రెష్‌గా మామిడిముక్కలను కోసి మామిడి కాయ కారం చేస్తారు మా వైపు. అన్నిటికన్నా అది ఇంకా సూపర్. :-)
అదీ అలా ఉండాలి చారిగారో24-5
రహ్మానుద్దీన్ షేక్ - సాహిత్య గారూ, చేసి పెట్టమంటే రాంగ్ నంబర్ కానీ పచ్చడి ఇవ్వమంటే
ఇస్తారులేండి24-5
..nagarjuna.. .. - రెహ్మాను ఊరికే మెచ్చుకోడమేనా ఆ మాగాయ్ పంపించేది ఏమైనావుందా.... :P24-5 (సవరించబడింది24-5)
s sahitya - prasaad gaaru మేమూ ఫ్రెష్ మామిడికాయలతోనే చేస్తామండి.కుళ్ళిపోయిన వాటితో చేయము :-D24-5
Varudhini Katragadda - సాహిత్య గారూ ఆవకాయలో రకాలు...
వెల్లుల్లి ఆవకాయ
నూపప్పు ఆవకాయ
పెసర ఆవకాయ
అల్లం ఆవకాయ
బెల్లం ఆవకాయ
పులిహోర ఆవకాయ
పచ్చావకాయ
శనగల ఆవకాయ24-5
s sahitya - షేక్ గారు :-D24-5
Varudhini Katragadda - తృష్ణ గారి బ్లాగుకెళితే మీకింకా చాలా రకాలు దొరుకుతాయి24-5 (సవరించబడింది24-5)
s sahitya - వేణుగారు వెళ్ళుల్లి మాగయాలోనూ వేస్తారు బెల్లం మాగాయలోనూ వేస్తారు ఇల్లా ఏదికనపడితే వాటినివేసేసి గొప్ప అంటే ఎట్లా :-D24-5
Venu Srikanth Darla - సాహిత్య గారు.. పైన ఆవకాయలో రకాలు రాసింది వరూధిని గారండీ.. నేను కాదు.. మీరు V చూసి కన్ఫ్యూజ్ అవుతున్నట్లున్నారు :)24-5 (సవరించబడింది24-5)
s sahitya - బాగుంది సేకరణ ,తృష్ణ గారి బ్లాగ్లోనా? చూస్తానుండండి24-5
రహ్మానుద్దీన్ షేక్ - ..nagarjuna.. .. ఓ తప్పకుండా, పార్సిల్లో పంపొచ్చా?
కాలేజీలోనే ఉన్నారా ఇంకా? లేదా హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి వద్దురు24-5 (సవరించబడింది24-5)
s sahitya - అవునండి కన్ఫ్యూజ్ అయ్యాను .నాగార్జునగారు నాగప్రసాద్ గారిని కూడా అట్లానే తారుమారు చేస్తున్నా24-5 (సవరించబడింది24-5)
Venu Srikanth Darla - :-) హ హ నేను ఇందాకటినుండి నాకెవరివైన కామెంట్స్ కనపడటంలేదా అని ఆలోచిస్తున్నా :) చివరికి పాయింట్ అర్ధమైంది :-)24-5
s sahitya - వరూధిని గారు క్షమించాలి
వేణుగారు :-D24-5
..nagarjuna.. .. - @రెహ్మానుః పార్శిల్ లో పంపమంటే ఏ వంద గ్రాములో రెండొందల గ్రాములో పంపడంకాదు జాడిలు జాడిలు పంపాలి మరి.
ఇదంతా ఎందుకులే, ఈసారి ఇంటికొచ్చినప్పుడు ఓ రోజు ఫుల్ మీ ఇంట్లోనే సిటింగ్ వేస్తా
@సాహిత్యగారుః అంటే ఇందాక నాగాను బుక్ చేద్దామని వేసిన కామెంట్లు నామీద వేసారా ఏంటి కొంపదీసి
వాఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ24-5 (సవరించబడింది24-5)
s sahitya - ఇప్పుడు కాదు ,చాల కామెంట్స్ అల్లా పొరపాటున రాసాను.మీరెవరు గమనించలేదు.ఏడిట్ చేసేదాన్ని గమనించ నపుడు :-D24-5 (సవరించబడింది24-5)
..nagarjuna.. .. - ః)24-5
naga prasad - నేను రాసిన కామెంట్లన్నీ నాగార్జున రాసినట్లుగా భ్రమపడ్డారు. రెహ్మాన్ కూడా కన్‌ఫ్యూజ్ అయినట్టున్నాడు.24-5
s sahitya - మీ పేర్లు తెలుగులో ఎందుకు పెట్టలేదు24-5
..nagarjuna.. .. - వొయ్ నాగా తికమక పడితే పడ్డారుగాని పార్శిల్లు మాత్రం నీకు ఇచ్చేదిలేదు ముందుగానే సెప్తాండ ! :P
సాహిత్యగారు, దాని వల్ల ఏమి ఉపయోగం, తెలుగులో రాసినా ఇంగ్లీష్‌లో రాసినా కన్‌ఫ్యూజన్ కామన్ కదా [ అదేదో సినిమాలో బ్రహ్మీతో డైలాగు 'తమ్ముడు మనోడైనా కంపు కామన్ కదన్నా' ]24-5 (సవరించబడింది24-5)
రహ్మానుద్దీన్ షేక్ - naga prasad మీకు అలా ఎందుకనిపించిందీ?
ఇక్కడ మీ ఇద్దరికీ ఆవకాయ్+మాగాయ్ తేడా తెలీదు
చారి గారేమో మామిడి కాయపచ్చడని, మీరేమో ఊరగాయనీ....24-5
koutilya choudary - హ్మ్...సుజాత గారూ! కొత్తావకాయ,కొత్తపెళ్ళామూ, పాత మాగాయా, పాత చింతకాయ పచ్చడీ, పాత స్నేహితుడూ బహురుచి అని నాన్న చెప్తుంటారు.....
మాగాయ అభిమానుల్లో నన్ను కూడా వేసుకోవచ్చు మరి...ః)24-5
Venu Ch - రెహమాన్ లాగా తటస్థంగా రెండు వరసల్లోనూ కూర్చుంటే ఆవకాయా, మాగాయా రెండూ మన విస్తట్లోకి వచ్చేస్తాయ్!
BTW...
@ kranti ch, Nagarjuna : బ్లాగ్ టపా లో కామెంట్ చేయటానికి Mozilla లో కుదరలేదు కానీ, Internet Explorer లో సాధ్యమయింది!24-5
Bulusu Subrahmanyam - పసముత్యమొకటి చాలును
కస వూడ్చిన చింపిరాలు గంపెండేలా
మాగాయొక్క జాడినే చాలు
అవకాయలు పదిజాడిలేలా సౌమ్యా జీ ఆ ఆ ఆ ఆ24-5
Bulusu Subrahmanyam - నేను ఇందాకా ఫైర్ ఫాక్స్ లోనే బ్లాగు లో కామెంటు పెట్టాను. సుజాత గారూ చేరిందా24-5
John Hyde - నా పద్యానికి ఎవరూ పలకటంలేదేంటండీ!సవరించు24-5
Bulusu Subrahmanyam - గుడి కూలున్ నుయి పూడున్.
వడి నీళ్ళన్ జెరువు తెగును వనమును ఖిలమౌ
రుచి చెడనిది మాగాయొక్కటే ............... గువ్వల చెన్నా24-5
Bulusu Subrahmanyam - @ John Hyde గారూ ఆవకాయలు మాగాయలు తినే వారు వైద్య సలహాలు పాటించరండి.24-5
Venu Srikanth Darla - వాహ్వా వాహ్వా బులుసు గారు.. :-)24-5 (సవరించబడింది24-5)
sowmya alamuru - ఈ బులుసుగారొకరు అన్నిటికీ తయారయిపోతారు...మాగాయేంటండీ మాగాయీ...తొక్కలో మగాయి...పైన నా పద్యాలు చూడండి ఆవకాయకి జై కొట్టండి. :P24-5 (సవరించబడింది24-5)
naga prasad - ఆవకాయ, మాగాయ రెండూ వేస్ట్. రెండింటికన్నా మామిడికాయ కారం బెస్ట్.24-5
sowmya alamuru - John Hyde గారూ..... మీరు మొత్తం ఊరగాయలనంటే మేమొప్పుకోం...మీరు ఆవకాయ మీద మంచి పద్యం రాయండి చాలు...వాహ్ వా వాహ్ వా అంటాం24-5 (సవరించబడింది24-5)
sowmya alamuru - మళ్ళీ మొదలెట్టారూ...ఇలా కాదూ ...ఉండండి నా సుమతీ శతకం బయటకి తీస్తా24-5
sowmya alamuru - కవిగాని వాని వ్రాతయు
నవరస భావములేని నాతుల వలపుం
దవిలి చను పంది నేయని
ఆవన తడవని కాయయు వృధరా సుమతీ!24-5
sowmya alamuru - కాదుసుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్,
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ మాగాయకు రుచి లేశము సుమతీ!24-5
sowmya alamuru - స్త్రీల ఎడ వాదులాడక
బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఆవకాయను నిందసేయ కెన్నడు సుమతీ!24-5
Nagaraju Pappu - ఎవిటీ - మాగాయ పెట్టడం కష్టమా? కొయ్యండి కొయ్యండి కోతలు. నేనూ పెట్టా రెండూను. మొదట్లో ఊరగాయ పెట్టడం నేర్చుకొనేటప్పుడు మాగయతో మొదలెట్టి, చెయ్యి తిరిగాకగాని, ఆవకాయదగ్గరకి వెళ్లనిచ్చేవారు కాదు. మాగాయలో ఉప్పో మరేదో ఒకవేళ ఎక్కువో తక్కువో అయినా, పచ్చడి చేసేటప్పుడు పెరుగో, కొత్తిమీరో, వేయించిన వేపగింజలో కలిపేసి మాయచేసేయవచ్చు. అందుకే అదో మాయ పచ్చడి :)

కాయలన్నిటిలోన మంచికాయలన్ని
ఏరికోరి వెస్తురు ఆవకాయలోన
మాగిన కాయలు, కుళ్ళిన కాయలు
మెత్తబడ్ద కాయలు ఊరబెట్టుదురు మాగాయన పేర
బూతద్దమందు చూచిన కఱ్ఱపేడు మానగునే!
విశ్వధాభిరామ వినురవేమా

మాగాయని ఆస్వాదించటానికి రసహృదయంకావాలా - ఇంకా నయం - బేంకుబాలన్సు, హెల్తు ఇన్సూరెన్సూ అక్కరలేదూ?24-5 (
sowmya alamuru - ఆ అద్దీ నేను పద్యాలు మొదలెట్టానంటే జనాలు బెదిరిపోవాలి...హిహిహిహుహుహుహహహహ24-5
John Hyde - సు జాతరబెట్టిన ఆవకాయ
రుచెట్లున్నదోగాని నోరూరించి చించి
సౌమ్యమైన వేళ్ళకును పనిబెట్టి టైపుచేయగా
అక్షర లక్షలై చెవులూరగాన్ ఇపుడే
(ఇది ఏ పద్యము అని అడకండే)
Nagaraju Pappu - (సౌమ్య - అసలు వీళ్ళదంతా పడమటి ఆవకాయలా ఉంది. పుల్లటి పగిడీ కాయలు బొటనువేలు గోరంత ముక్కలు కొట్టి, ఆవగుండ కలిపేస్తారు. మనవైపు కోలంగోవా కాయలు అచ్చంగా ఎనిమిది ముక్కలు కొట్టి పెట్టే పచ్చావకాయ గురించి తెలియదేమో!)24-5
sowmya alamuru - అదే కదా నాగరాజు గారూ...కోలంగోవా లేదా కలక్టరు కాయలను 8 ముక్కలు కొట్టి పెడితే ఎలా ఉంటుంది ఆవకాయ అసలు...రుచివర్ణింప సాధ్యమా24-5
sowmya alamuru - మరి మన పెట్టుకునే బెల్లం ఆవకాయో...దాని దరిదాపుల్లోకి రాగలదూ ఈ మాగాయ?24-5
Bulusu Subrahmanyam - రుచి తెలియని వారి నాలుకయూ
షడ్రుచులలోన మర్మ మెరుగని భామల్
తినినంతనే మాగాయ పచ్చడిన్ మెచ్చేదరు
సుమీ ఏకగ్రీవంబుగాన్ మహిలో సుమతి24-5
sowmya alamuru - John Hyde గారూ...థాంకులు థాంకులు :)...ఇంతకీ మీరు ఆవకాయ పార్టీయా? మాగాయ పార్టీయా?24-5
Bulusu Subrahmanyam - హతవీధి బెల్లం ఆవకాయ కి మాగాయకి పోలికా నక్కకి నాగలోకానికి సామ్యమా24-5
sowmya alamuru - నాగరాజు గారూ..."మెత్తబడ్ద కాయలు ఊరబెట్టుదురు మాగాయన పేర"....ఆహా అదరగొట్టారండీ :)24-5
sujatha bedadakota - జాన్ గారూ, ఇప్పుడే వచ్చాను. పద్యం అదిరింది మీ సతి గారన్నమాటే కరెక్టేగామరి!కాబట్టి బుద్ధిగా మేడమ్ గారి మాట వినండి!

హమ్మ్య్య, వరూధినిగారు, బులుసు గారు, కౌటిల్యా...సంప్రదాయ వంటలు తెలిసిన వారంతా నా పక్కన చేరారు. నాకు ధైర్యం వచ్చింది.24-5
sowmya alamuru - అవును బులుసు గారూ నేనూ అదే చెబుతున్నా...ఎక్కడ నాకలోకం(బెల్లం ఆవకాయ), ఎక్కడ నక్క(మాగాయ)!24-5
sujatha bedadakota - నాగరాజు గారూ, మాగాయ పెట్టారా మీరూ? అందుకేనా దాని మీద బూజే తప్ప మోజెక్కడ అని మీ మాగాయ జాడీలో జరిగిన విషయాన్ని జనరలైజ్ చేశారు?

మాగాయ మీద ఎంతెంత అభాండాలు వేస్తున్నారూ?24-5
Bulusu Subrahmanyam - హాహా తిప్పి తిరగేసి వ్రాస్తే వారు వీరవరు సౌమ్య గారూ24-5
sujatha bedadakota - ముందెవరన్నా ఈ సౌమ్య దగ్గర సుమతీ శతకం లాగేసుకుని అటకమీద పడేయండి24-5
sowmya alamuru - బులుసుగారూ చ చ వీరు (బెల్లం ఆవకాయ) వారు (మాగాయ) ఎప్పటికీ అవ్వరు...నో పోలికల్స్24-5
sowmya alamuru - సుజాత గారూ...నోటికి వచ్చినవి ఎలా లాగేసుకోగలరుట? :P24-5
Nagaraju Pappu - సౌమ్య: కలెక్టరు కాయ ఎండావకాయకే, పచ్చావకాయకి పనికిరాదనుకొంటా (తొందరగా ముక్క మెత్తబడిపోతుందికదా)24-5
sujatha bedadakota - సు "జాతర"బెట్టిన ఆవకాయ
"సౌమ్య"మైన వేళ్ళకును పనిబెట్టి ____________జాన్ గారూ, కేక కేక!24-5
sowmya alamuru - నాగరాజు గారూ..అదేలెండి రెంటికీ కలిపి చెప్పాను. మనకు ఆవకాయ అంటే పచ్చావకాయ, బెల్లం ఆవకాయ రెండూ కదా :)24-5
sujatha bedadakota - నాగరాజు గారూ సౌమ్యా మాగాయ గొప్ప తనాన్ని అంగీకరించలేక కుట్ర తో నెమ్మదిగా ఆవకాయకు ఏ మామిడి కాయ పనికొస్తుందనే విషయం మీదికి మళ్ళించారు టాపిక్ ని !మీదీ మీదీ ఒకూరని...తొండి!24-5
sowmya alamuru - తొండి చేసే ఖర్మ మాకేమిటి...కావాలంటే పద్యాలు పాటలు రాస్తాం :P24-5
Bulusu Subrahmanyam - లేక ఆవిడకు ఆవకాయ కాయకి కి మాగాయ కాయకు గల తేడా సరిగ్గా తెలియదని అనుకోవాలా అధ్యక్షా24-5
sowmya alamuru - కులములోన నొకఁడు గుణవంతుడుండిన
కులము వెలయు వాని గుణముచేత
ఊరగాయలలోన ఆవకాయునట్లు
విశ్వదాభిరామ వినురవేమ.24-5
Bulusu Subrahmanyam - ఆవకాయ బదులు మాగాయ అని చదువుకొ న వలె యువతీ24-5
sowmya alamuru - మాగాయెపుడు ఉండు ఆడంబరముగాను
ఆవకాయ ఉండు రుచిగాను
ఆవకాయ ఉన్నట్లు మాగాయ ఉండునా
సౌమ్య చెప్పిన మాట సౌమ్యపుమాట24-5
రాజ్ కుమార్. - bulusu gaaroo... kekaaaaaaa.. :D24-5
sowmya alamuru - ఓయ్ రాజ్..మనది ఆవకాయ పార్టీ...వాళ్ళు మాగాయి, నువ్వు వాళ్ళని చూసి కేకలెట్టకూడదు24-5
రాజ్ కుమార్. - ante.. bulusu gari dialogue bavundi kadaa ani :D24-5
రాజ్ కుమార్. - సౌమ్య చెప్పిన మాట సౌమ్యపుమాట...
correct.. correct... :024-5
Bulusu Subrahmanyam - రాజ్ కుమార్ గారూ పైన ఎక్కడో మీరు ఆవకాయ పార్టీ అన్నట్టున్నారు మాగాయ గొప్పదనాన్ని తెలుసుకొని ఇటువైపుకు వచ్చినందుకు స్వాగతం24-5
sujatha bedadakota - లేక ఆవిడకు ఆవకాయ కాయకి కి మాగాయ కాయకు గల తేడా సరిగ్గా తెలియదని అనుకోవాలా _________బులుసు గారూ, కొంపదీసి అదేనేమో! ఇంతసేపూ సౌమ్య ఆవకాయను చూసి మాగాయనుకుంటుందేమో !పిచ్చి తల్లి24-5
రాజ్ కుమార్. - అని చదువుకొ న వలె యువతీ

నేను ఈ లైన్ కి మాత్రమే.. కేక వేసాను గురూజీ.. నేను పక్కా ఆవకాయ పార్టీ..24-5
Bulusu Subrahmanyam - రుచులెరుగువారు నమ్మేదరు మాగాయినే
ఆవకాయ లో నేమున్నది ఆవతప్ప24-5
SHANKAR S - కులములోన నొకఁడు గుణహీనుఁడుండిన
కులము చెడును కాని గుణము వలన
వంట ఇంటి లోని ఆవకాయీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ!24-5
రాజ్ కుమార్. - ఈ పద్యాలు గట్రా నా వల్ల కాదు గానీ..... అసలీ మాగాయ్ ఎలా తింటారో... అర్దం కావట్లేదు... ;(24-5
Bulusu Subrahmanyam - అమ్మయ్యా వచ్చారా శంకరు గారూ విజృంభించండి24-5
sowmya alamuru - అంతరంగమందు ఆవకాయను మెచ్చి
మాగయని మెచ్చు బయటకొచ్చి
ఇతరు లెరుగకున్న నీశ్వరుడెరుగడా మీ వేషాలు
విశ్వదాభిరామ వినురవేమ.24-5
SHANKAR S - వేరుపురుగుచేరి వృక్షంబుజెఱచుఁను
చీడ పురుగు జేరి చెట్టుఁజెఱచుఁ
ఆవకాయ జేరి వంటిల్లు జెరచురా
విశ్వదాభిరామ! వినుర వేమ!24-5
SHANKAR S - విద్యలేనివాడు విద్వాంసు చేరువ
నుండగానె పండితుండు గాడు
మాగాయ జాడి పక్కనావకాయున్నట్టు
విశ్వదాభిరామ! వినుర వేమ!24-5
sowmya alamuru - ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
ఆవకాయ్లేని అన్నమేలరా
విశ్వదాభిరామ! వినుర వేమ!24-5
Bulusu Subrahmanyam - ఇందాకటి నుంచి కొడుతున్నాను గూగుల్ గాడిని ధూర్జటి గారి కాళహస్తీశ్వర శతకం దొరకటలేదు
హెల్ప్ pl24-5
రాజ్ కుమార్. - hahahahhaa :D24-5
sowmya alamuru - అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్,
పెట్టిన జాడీడు మాగాయ
దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ.24-5
SHANKAR S - నీళ్ళలోని చేప నెరి మాంస మాశకు
గాల మందు చిక్కి గూలినట్లు
ఆవకాయతోటి మనుజు డారీతి చెడిపోవు
విశ్వదాభిరామ! వినురవేమ!24-5
sowmya alamuru - అక్కరకురాని నూనె,
పెట్టిన రుచి నీయని మాగాయ, చెక్కినమా
మామిడికాయ టెంకలు,
టక్కున పారవేయవలయు గదరా సుమతీ.24-5
sowmya alamuru - అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ఆవకాయయున్
జొప్పడిన యూర నుండుము,
మాగాయయున్న యూరు సొరకుము సుమతీ.24-5
Bulusu Subrahmanyam - థాంక్యూ మాడమ్ సౌమ్య వి. బి. గారూ
ప్రస్తుతం ఈ పేజీలో పాఠ్యమేమీ లేదు. వేరే పేజీలలో ఈ పేజీ శీర్షిక కోసం వెతకవచ్చు, సంబంధిత చిట్టాలు చూడవచ్చు, లేదా ఈ పేజీని మార్చవచ్చు.
అని వస్తోంది ఇక్కడ కూడా24-5 (సవరించబడింది24-5)
sujatha bedadakota - హమ్మయ్య, శంకర్ గారొచ్చేశారు!

ఆవకాయ Vs మాగాయ
బద్దెనVs వేమన24-5
SHANKAR S - కల్ల నిజమెల్ల గరకంఠు డెరుగును,
నీరు పల్లమెరుగు నిజముగాను
ఉర్వి జనులెరుగు మాగాయ రుచిని
విశ్వదాభిరామ! వినుర వేమ!24-5
sujatha bedadakota - సౌమ్యా, కొత్త పద్యాలు చెప్పవోయ్! ఈ రెండూ ఇందాక చెప్పేశావ్24-5
sowmya alamuru - ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్‌
మొదవుకడ నున్న వృషభము
మాగాయ తిన్న మనుషునికడకు జనకుర సుమతీ!24-5
sowmya alamuru - ఓ ఇందాకల చెప్పేసానా...చూసుకోలేదు...అన్ని వరుసగా రాసుకుంటున్నాగా..తెలియలేదు24-5
sowmya alamuru - అల్లుని మంచితనంబును,
గొల్లని సాహిత్యవిద్య, మాగయకి రుచి
బొల్లున దంచిన బియ్యముఁ,
దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ.24-5
SHANKAR S - చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
బజ్జున సౌమ్య పోరు నింతింత గాదయా
విశ్వదాభిరామ! వినురవేమ!24-5
Bulusu Subrahmanyam - కలవర మాయే మదిలో కలవర మాయే మదిలో
మాగాయ తినినంతనే కలవరమాయే మదిలో
థాంక్యూ రహ్మానుద్దీన్ గారూ24-5
sowmya alamuru - అడియాస కొలువుఁ గొలువకు
గుడిమణియము సేయఁబోకు మాగాయన్
పొరబడి మెచ్చకు
మడవినిఁదో డరయఁకొంటి నరుగకు సుమతీ!24-5
SHANKAR S - ఏ వేదంబుఁ బఠించె లూత, భుజంగమే శాస్త్రముల్చూచెఁ, దా
నే విద్యాభ్యసనం బొనర్చెఁ గరి, చెంచే ఆవకాయ రుచ్చ్చూసే , బో
ధా విర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు ! మీ పాద సం
సేవాసక్తియె కాక జంతు తతికిన్ శ్రీ కాళ హస్తీశ్వరా !24-5
sowmya alamuru - హహహహ శంకర్ గారూ నన్ను గెలవలేక నాది పోరు అంటున్నారా...పోరు అయినా రణమైనా ఆవకాయదే విజయం.24-5
Bulusu Subrahmanyam - అదరగొట్టేశారు శంకరు గారూ.24-5
SHANKAR S - మాగాయ రుచిని చూడని నాలుక
ఉండనేమి? అది ఊడనేమి?
బజ్జులోన పోస్ట్లు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ! వినురవేమ!24-5
Bulusu Subrahmanyam - శలవు ప్రభావతీ దేవి వెయిటింగ్ at ద డోర్.
థాంక్స్ అందరికీ24-5
sujatha bedadakota - కాళ హస్తీశ్వరుడు కూడా వచ్చేశాడా? శభాష్ శంకర్ (ఈ పేరుతో సినిమా ఉందా?)24-5
sujatha bedadakota - మాగాయ రుచిని చూడని నాలుక
ఉండనేమి? అది ఊడనేమి?
బజ్జులోన పోస్ట్లు పుట్టవా గిట్టవా _________హమ్మో, నా వల్ల కాదు, చస్తున్నా నవ్వలేక24-5
Nymish S - కళ కళ లాడుతున్నావ్ మాగాయ లా
ఫెళ ఫెళ రాలబోకు ఆవకాయలా
నా కోసమై నువ్వలా మాగాయ లా మారగా
నాకెందుకో ఉన్నదీ హాయిగా...
ట ట్టర ట డ ట టాం టాం..ట ట్టర ట డ ట టాం టాం..24-5
sowmya alamuru - తినునది ఆవకాయట
కలిపిపెట్టినది అమ్మట
నే తినిపెట్టిన భవహరమగునట
తినెద ఆవకాయగాక మాగాయా?24-5
SHANKAR S - ఆశచేత ఆవకాయ ప్రియులు పాపం
తిరుగుచుంద్రు భ్రమను ద్రిప్పలేక
మురికి భాండమందు ముసుగు నీగల భంగి
విశ్వదాభిరామ! వినురవేమ!24-5
SHANKAR S - మంచి కాయజూసి పెట్టిన మాగాయ
కొంచమైన నదియు గొదవుగాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ! వినురవేమ!24-5
sowmya alamuru - ఆహా పద్మగారూ వచ్చేయండి మన ఆవకాయ పార్టీలోకి.24-5
SHANKAR S - గంగిగోవుపాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
మంచి రుచి గల మాగాయే చాలుగా
చెబితే వినవేవమ్మ ఓ తిక్క సౌమ్యా!24-5
sowmya alamuru - వామ్మో నేను శంకరు గారికి రాసిన పద్యం ఎగిరిపోయింది :(24-5
sowmya alamuru - తినిపించిరి నాకు తల్లిదండ్రులు
తిన్నది ఆవకాయ వెన్నపూస తోడ నే
తిన్నవి పెక్కు ముక్కలు
ఊరగాయలలో ఆవకాయ గొప్ప శంకరుగారూ!24-5
sowmya alamuru - పద్మగారూ ఇక్కడ యుద్ధం ఆవకాయకి, మాగాయకేనండీ...మిగతా పచ్చళ్ళు లెక్కలోకి తీసుకోవట్లేదు మేము :P24-5
sowmya alamuru - మ్రింగెడి వాడు శంకరుండని
మ్రింగెడిదియు మాగాయయు మేలని ప్రజకున్
మ్రింగుమనె సుజాత
మాగయని నెంత మది నమ్మినదో !!24-5
sujatha bedadakota - సౌమ్యా, నీ దుంపతెగ! చస్తున్నా నవ్వలేక!24-5
sujatha bedadakota - తృష్ణ, కౌటిల్య.....వీళ్ళిద్దరూ ఆంధ్రా వంటలకు బ్లాగుల్లో ఆద్యులు! వీళ్ళిద్దరూ మాగాయ పార్టీలో చేరాక అసలు ఆవకాయ ప్రియుల వాదనలకు విలువ ఉంటుందా అని...!24-5
రహ్మానుద్దీన్ షేక్ - సరే సుజాత గారూ, అదే కౌటిల్య ఇంకా తృష్ణ ఆవకాయ తినకుండా ఉండాలి ఈ ఏడాదంతా! సాధ్యమా?24-5
sowmya alamuru - తృష్ణ గారూ...thank u Thank u :)24-5
sowmya alamuru - అద్దీ దెయ్యం బలే ప్రశ్న అడిగావు :P24-5
naga prasad - మందులోకి మాగాయ బెటరు
ఉప్మాలోకి అవకాయ బెస్టూఊఊ
అందరూ మెచ్చినది మందు మాత్రమే
మాగాయ ఆవకాయో తేల్చుము భాస్కరా ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఅ24-5
sowmya alamuru - మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు బోవునే మదనములకు !
నిర్మల మందాకినీ వీచికల దూగు
రాయంచ సనునె తరంగిణులకు !
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల సేరునే కుటజములకు !
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక
మ్మరుగునే సాంద్ర నీహారములకు !
ఆవచేర్చి నూనె పోసిన
ఆవకాయ మే రీతి మాగాయ చేర నేర్చు
వినుత గుణ శీల మాగయ ముక్కలు వేయి ఏల !!24-5
sowmya alamuru - అదేంటి పద్మగారూ అలా అనేసారు...అందరికన్నా నేనే ఎక్కువ పద్యాలు రాసాను..బజ్జు మొత్తం చదవండి ఒకసారి...నా పద్యాల ధాటికి తట్టుకోలేక మాగాయవీరులు పరుగో పరుగు :D24-5
John Hyde - సౌమ్యకు పోటీగా పద్యాలు రాద్దామని మొదలు పెట్టగానే విద్యుత్తు తీగ ఎక్కడో తెగిపోతుంది.సవరించు24-5
Nymish S - చివరకి పోతన భాగవత పద్యాలు కూడా వదల్లేదా? అయ్యో...24-5
sowmya alamuru - ఆ కైలాసానికే...ఇది చూసారా?

మ్రింగెడి వాడు శంకరుండని
మ్రింగెడిదియు మాగాయయు మేలని ప్రజకున్
మ్రింగుమనె సుజాత
మాగయని నెంత మది నమ్మినదో !! :D :P24-5
sowmya alamuru - Nymish గారూ....మరి వారు ధూర్జటి ని తీసుకొచ్చారు. అందుకని దీటుగా నేను పోతనని తీసుకొచ్చా :D24-5
sowmya alamuru - పద్మ గారూ...హిహిహిహి thank u thnak u...మరేం పర్లేదు అన్నీ తీరికగా చదవండి. మనంత కాకపోయినా శంకర్ గారూ కూడా పద్యాలు బానే రాసారు అవీ చదవండి..చూసారా ఆవకాయ తింటే ఇతరులని మెచ్చుకునే గుణం కూడా పెరుగుతుంది...అది మాగాయ వారికి నిల్లు. :P24-5 (సవరించబడింది24-5)
రాజ్ కుమార్. - ఈరొజు సెగట్రీ ఫుల్ల్ ఫాం... ;)24-5
sowmya alamuru - పద్మ గారూ :)))24-5
Nymish S - సౌమ్య గారు మీరు ధూర్జటి కి పోటీగా నంది తిమ్మననో , మాదయ్యగారి మల్లన్న నో తెస్తే బాగుండేది..పోతనామాత్యులు ఏమి పాపం చేశారండీ..:))24-5
sowmya alamuru - John Hyde ..........మరదే మా పార్టీలో చేరక నాకు వ్యతిరేకంగా రాయాలనుకుంటే ఇలాగే పవర్ కట్ అయిపోతుంది. :)24-5
sowmya alamuru - రాజ్ కుమార్. ....hihiihih :)))))))24-5
John Hyde - అసలు ఏమిజరుగుతోంది ఇక్కడ నాకు వెంటనే తెలియాలి

మాగాయ రుచిని చూడని నాలుక
ఉండనేమి? అది ఊడనేమి?
బజ్జులోన పోస్ట్లు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ! వినురవేమ!

ఇంతటి ఘోరమా
అయ్యహో! అయ్యహో! ఇది ఏమి చిత్రమో కదా !

మాగాయయైన ఆవకాయయైన నేమి
రుచి చూడలేని నాలుకను చిక్కము కట్టిరి వైద్య్లు
ఇప్పుడు నా నాలుకను ఉంచుదునా ఊడబెరుకుదునా
విశ్వదాభిరామ! వినురవేమ!
(షరా: ఇదే పద్యం అని అడగకండే)సవరించు24-5
sowmya alamuru - Nymish గారూ...అదేమిటండీ మరి వేమనేం చేసారు, బద్దెనేంచేసారు...అన్ని సరదాకే కాబట్టి పోతనని దించా24-5
sowmya alamuru - John Hyde గారు మీరేమీ ఊడబెరుకుకోనక్కర్లేదు...ఉన్న నాలుకతో చక్కగా ఆవకాయ తినండి. :)24-5
John Hyde - నేను పద్యాలకు ఆవకాయ పార్టీనే బలపరచాని వున్నా, నా చిరకాల రుచి మాగాయే!
చాలా సార్లు ముక్కలు కోసిన అనుభవం కూడా వుందిసవరించు24-5
sowmya alamuru - John Hyde గారూ...ఈ గోపీ వేషాలు కుదరవండోయ్ :P24-5
sujatha bedadakota - జాన్ గారు, అసలు మాగాయ పథ్యానికి చాలా మంచిదండీ! ఆవకాయ లాగా పచ్చి ముక్కలు పడవు. పచ్చి ఆవపిండి పడదు. నూనె కూడా కాచి పోస్తాం! కాబట్టి అభ్యంతరం లేకుండా తినొచ్చు మీరు! శాంపిల్ ఒక సీసా పంపమంటారా?24-5
John Hyde - @ sujatha ప్రస్తుతానికి నోటికి కట్టిన చిక్కాన్ని విప్పదలుచుకోలేదు24-5
John Hyde - ఇప్పటికి 250పైచిలికు బజ్జు, పద్యములతో మార్మోగించిన సౌమ్యగారిని అభినందించాల్సిందే
ఎప్పుడూ పద్యాన్ని ప్రయత్నించని నాచేత కూడా పద్యాలు రాసేటట్టు చేసారుసవరించు24-5
sowmya alamuru - Thank u Thank u! :D
సరే ఇంక నే పోతున్నా...ఇవాల్టికి ఈ యుద్ధం చాలు :)24-5
Nagaraju Pappu - "మీ మాగాయ జాడీలో జరిగిన విషయాన్ని జనరలైజ్ చేశారు?"
సుజాత - అమ్మో, ఆవలిస్తే మీరు పేగులు లెక్కెట్టే రకంలా ఉన్నారు!
సౌమ్య మీ మింగెడువాడు పద్యం అదిరింది, శంకురులవారి బజ్జులోన పోస్ట్లు పుట్టవా గిట్టవా పద్యం కూడా.

కమ్మటి ఆవకాయను మెచ్చిన సౌమ్య అలరారు నంటి
నల్లటి మాగాయ మ్రింగిన సుజాత బెడదలు కోటి
సుబ్బరమగు ఆవకాయను వదిలి
బులుసు సుబ్బరమణ్యులేలా
పుల్లటి మాగాయబులుసు మెచ్చిరి సుమతీ!

ఇక నేకూడా వెళ్ళొస్తా.
enjoyed this post thoroughly24-5 (సవరించబడింది24-5)
Vasu Mullapudi - నాకు మాగాయి పెద్దగా నచ్చదు. కానీ తొక్కు పచ్చడి అని చేస్తారు, చిన్న ముక్కలతో ఇంచు మించు మాగాయ లో వేసేవే, కాకపోతే బెల్లం కూడా వేస్తారు. భలే ఉంటుంది. హైదరాబాద్ మావిడి కాయలు మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడో గానీ మంచి కాయలు దొరకవ్. మా ఊరిలో (ఐనాపురం) మాగాయ కాయలు బాబోయ్ ఎంత పులుపంటే అంత పులుపు. బహుశా అందుకే నాకు ఇంట్రెస్ట్ పోయిందేమో మగాయిలో.24-5
muralidhar namala - హారి భగవంతుడా మన కౌటిల్యని ఆఖరుకి సాంప్రదాయ వంటవాడ్ని చేసారే? హన్నా.. koutilya choudary24-5
koutilya choudary - హన్నా! భలే పద్యాలుగా...ఉండండి నేను కూడా ఓ చెయ్యేస్తా..మీరు ఎవరెవర్నో తెస్తున్నారుగా...నేను మన తెనాలి రామలింగయ్యని తెస్తానుండండి...

ఈ ఆవకాయ మాగాయల కిహిహీ! ఆంధ్రులు చిక్కెరంచు మనలన్
రాకకు బోకకు తమిళులు,కన్నడిగులు ఈసుతోడ జూచుచుబోవ
తిని నాలుకలు తిప్పుటకు బుద్ధి తలంక బుగ్గకు నెట్టిన కమ్మని
పుల్ల పుల్ల కారపు ముక్కలందమృతస్థితి గాంచి మించుటన్

(ఛందస్సు పట్టించుకోలేదు..;))24-5
muralidhar namala - మా ఇజీనరం సత్తా చాటిన సౌమ్యగారికి పేరడీ పద్య విభాగంలో సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వాలని డిమాండు చేస్తున్నా.24-5
koutilya choudary - మురళీ!...ః)24-5
radhika rimmalapudi - కామెంట్లని లైక్ చేయగలిగే సౌకర్యం లేదా?నాకు ఆవకాయ,మాగాయ కూడా ఇష్టమే.సుజాత గారి పోస్టు చదివి అవును అవును మాగాయే బెస్టు అనిపించింది.కానీ సౌమ్యగారి కామెంట్లు చదివి బహుసా ఆవకాయే బెస్టనిపిస్తుంది.ఏమోనమ్మా నాకయితే పచ్చడన్నది ఏదన్నా బెస్టే :)24-5 (సవరించబడింది24-5)
..nagarjuna.. .. - రాధికగారు అలాగైతే మీరు మా పక్షం అవకాయ, మాగాయ్ కాదు మామిడికాయ పచ్చడి జిందాబాద్ అనేసేయండి ముందు :)24-5 (సవరించబడింది24-5)
kiran . - naku noru uuripothondi..!!!24-5
రాజ్ కుమార్. - నాకు ఒళ్ళు మండిపోతుందీ..25-5
రాజ్ కుమార్. - (ప్రాస బావుంది కదా.. అని వాడాను.. ;) )25-5
sowmya alamuru - వహ్ వా వాహ్ వా...నాగరాజు గారి పద్యం అదిరింది.25-5
sowmya alamuru - ఈ ఆవకయ-మాగాయ యుద్ధం, పద్యాలు కాదుగానీ రాత్రి నా కల నిండా ఈ పద్యాలే...ఇంకా బోల్డు రాసేస్తున్నానట ఆవకాయ మీద పద్యాలు :D25-5
SHANKAR S - సౌమ్య గారూ భలేవారే నేను నిన్న కలలో "ఆవకాసుర గర్వభంగం" అని ఓ మహా కావ్యం రాసేసాను. :)25-5
sowmya alamuru - హహహ్హహ శంకర్ గారూ మీరు కూడానా....నేను కలలో "ఆవకాయ శతకం" రాసేస్తే మీరు మహాకావ్యం రాసేసారా! :D
అన్నట్టు నేను ఎక్కువ పద్యాలు మీమీదే ఎక్కుపెట్టాను సుమండీ! :P25-5
SHANKAR S - సుజాత గారూ ఈ రెంటినీ మీరే పబ్లిష్ చేయించాలి.25-5
sowmya alamuru - అవును తప్పదు...సుజాత గారు మన మీద అభిమానంతో పబ్లిష్ చెయ్యక తప్పదు. :)25-5
SHANKAR S - మహాకవి బులుసు గారు త్వరలో "మాగాయారాధ్య చరిత్ర" గ్రంధ రచనకు శ్రీకారం చుట్టనున్నారని ఇప్పుడే వేగుల ద్వారా అందిన వార్త.25-5
sowmya alamuru - అలా అయితే మా కవిసార్వభౌములు నాగరాజు పప్పుగారు "శ్రీమదాంధ్ర మహా ఆవకాయ" అను పురాణం లిఖించబోతున్నారుట తెలుసా!25-5
SHANKAR S - ఇప్పుడే అందిన వార్త పాక ప్రవీణ కౌటిల్య గారు రాసిన "మాగాయ ప్రస్థానం" లో "మరొక్క కంచం మరొక్క కంచం మరొక్క కంచం పిలిచింది. పదండి తోసుకు, మాగాయ తీసుకు, జాడీలన్నీ ఊడ్చేద్దాం" అన్న కవితకు నోబెల్ బహుమతి ప్రకటించారు :)25-5 (సవరించబడింది25-5)
SHANKAR S - విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కవయిత్రి తృష్ణ గారు "మాగాయణం" రచన ఆరంభించారు. బులుసు గారు, కౌటిల్య గారు, నేను, తృష్ణ గారు అంతా మా రచనలను సుజాత గారికి అంకితం ఇచ్చేస్తున్నాం.25-5
sowmya alamuru - మీ రచనలన్నీ జుజూపి మేము రాసిన్ "ఆవకాయ కల్పవృక్షం", "విశ్వావకాయ" అన్న రెండు రచనలకు సాహిత్య అకాడమీ అవార్డులొచ్చాయిట. ఇప్పుడే తెలిసింది.25-5 (సవరించబడింది25-5)
రాజ్ కుమార్. - అలాడమీ??? అనగానేమీ?25-5
SHANKAR S - అలాడమీ కాదు అలా డమ్మీ అవార్డులని సౌమ్య గారి ఉద్దేశ్యం25-5
sowmya alamuru - రాజ్...సరిగ్గా చూడు...అది అకాడమీ :P25-5
John Hyde - ఇవ్వాళ్ళ అవార్డుల పర్వమమా?????సవరించు25-5
Bulusu Subrahmanyam - SHANKAR S - మహాకవి బులుసు గారు త్వరలో "మాగాయారాధ్య చరిత్ర" గ్రంధ రచనకు శ్రీకారం చుట్టనున్నారని....
అవునవును ఇప్పుడే సిగరెట్టీను25-5
koutilya choudary - అబ్బబ్బ! శంకర్ గారూ! నాకు ఏకంగా నోబుల్ బహుమతిచ్చేశారుగా....."మాగాయప్రస్థానం" సుజాతగారికిచ్చినా,నిన్నటి నా పద్యం మాత్రం మీకే అంకితం...ః)25-5 (సవరించబడింది25-5)
Pavani Alavala - Unbelievable talent, Sowmya, Sujatha,Shankar S....Wow!9-6

నిన్న సుజాత గారి బజ్జులో భీకర ఆవకాయ-మాగాయ యుద్ధం జరిగింది. నేను ఆవకాయ పార్టీ, శంకర్ గారూ మాగాయ పార్టీ...ఇద్దరం హోరాహోరీగా పద్యాలతో యుద్ధం చేసుకున్నాం. సుజాతగారు, బులుసూ గారూ వీర సపొర్ట్ ఇచ్చారు శంకర్ గారికి. నాగరాజు పప్పుగారూ నా పక్క భీముడిలా నిలిచారు. ఈ మొత్తం పద్యాలలో నాకు మహా బాగా నచ్చిన కొన్ని పద్యాలు కిందన ఇస్తున్నాను. (మొత్తం అన్ని పద్యాల కోసం సుజాత గారి నిన్నటి బజ్జు చూడండి.)

నా పద్యాలు:
ఆవకాయ, మాగాయ ఒక్కపోలికనుండు
చూడ చూడ ముక్కల జాడ వేరు
ఊరగాయలందు ఆవకాయ ఘనమురా
సౌమ్య చెప్పిన మాట సౌమ్యపు మాట

వన్నె తరగని ఆవ, కాయకు బెట్ట
రుచులనూరుచు బుట్టెనావకాయ
అట్టి కాయను తెచ్చిమాగయ బెట్ట
బూజులుపట్టె గదరా సుమతీ

అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్,
పెట్టిన జాడీడు మాగాయ
దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ.

అక్కరకురాని నూనె,
పెట్టిన రుచి నీయని మాగాయ, చెక్కినమా
మామిడికాయ టెంకలు,
టక్కున పారవేయవలయు గదరా సుమతీ.

మ్రింగెడి వాడు శంకరుండని
మ్రింగెడిదియు మాగాయయు మేలని ప్రజకున్
మ్రింగుమనె సుజాత
మాగయని నెంత మది నమ్మినదో !

SHANKAR S గారి పద్యాలు:

నీళ్ళలోని చేప నెరి మాంస మాశకు
గాల మందు చిక్కి గూలినట్లు
ఆవకాయతోటి మనుజు డారీతి చెడిపోవు
విశ్వదాభిరామ! వినురవేమ!

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
బజ్జున సౌమ్య పోరు నింతింత గాదయా
విశ్వదాభిరామ! వినురవేమ!

మాగాయ రుచిని చూడని నాలుక
ఉండనేమి? అది ఊడనేమి?
బజ్జులోన పోస్ట్లు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ! వినురవేమ!


Nagaraju Pappu గారి పద్యాలు

కాయలన్నిటిలోన మంచికాయలన్ని
ఏరికోరి వెస్తురు ఆవకాయలోన
మాగిన కాయలు, కుళ్ళిన కాయలు
మెత్తబడ్ద కాయలు ఊరబెట్టుదురు మాగాయన పేర
బూతద్దమందు చూచిన కఱ్ఱపేడు మానగునే!
విశ్వధాభిరామ వినురవేమా

కమ్మటి ఆవకాయను మెచ్చిన సౌమ్య అలరారు ముద్దుగా
నల్లటి మాగాయ మ్రింగిన సుజాత బెడదలు కోటి
సుబ్బరమగు ఆవకాయను వదిలి
బులుసు సుబ్బరమణ్యులేలా
పుల్లటి మాగాయబులుసు మెచ్చిరి సుమతీ!

John Hyde గారి పద్యాలు

సు జాతరబెట్టిన ఆవకాయ
రుచెట్లున్నదోగాని నోరూరించి చించి
సౌమ్యమైన వేళ్ళకును పనిబెట్టి టైపుచేయగా
అక్షర లక్షలై చెవులూరగాన్ ఇపుడే

వంటలాయన కౌటిల్య రెంటి మీద కలిపి రాసాడు

ఈ ఆవకాయ మాగాయల కిహిహీ! ఆంధ్రులు చిక్కెరంచు మనలన్
రాకకు బోకకు తమిళులు,కన్నడిగులు ఈసుతోడ జూచుచుబోవ
తిని నాలుకలు తిప్పుటకు బుద్ధి తలంక బుగ్గకు నెట్టిన కమ్మని
పుల్ల పుల్ల కారపు ముక్కలందమృతస్థితి గాంచి మించుటన్
****
749

12 comments:

శ్యామలీయం said...

ఆవకాయా మాగాయా ఇంకా మెంతికాయా తొక్కుడుపచ్చడి అన్నీకూడా ఒకే అధ్బుతపదార్ధపు వివిధస్వరూపాలన్నమాట. అందుచేత బేధ మెంచకండి.
ఆవకాయ వేరు మాగాయ వేరూ అనుకోవటం విష్ణు శివులకు బేధం పాటించటం వంటిదే! తప్పు తప్పు.

Anonymous said...

your nostalgia has provoked my taste buds. And I wont be able to get either Avakaya or Magaya till one more month. Now what should I do, Doctor Jekyll and Mister Hyde.. er.. John Hyde!

యామజాల సుధాకర్ said...

శ్యామలీయం గారు, ఎంత అధ్భుతంగా చెప్పారండి అద్వైత సిధ్ధాంతాన్ని

యామజాల సుధాకర్ said...

శ్యామలీయం గారు, ఎంత అధ్భుతంగా చెప్పారండి అద్వైత సిధ్ధాంతాన్ని

శశి కళ said...

nice post....chaduvutunte navvu aapukoleka poyaanu.

సుజాత వేల్పూరి said...

జాన్ గారూ, ఆ రోజు నా బజ్ లో ప్రత్యక్షంగా జరిగిన పోరు అంతులేకుండా సాగింది! ఇవాళ మళ్ళీ మొత్తం చదివితే పొట్ట చెక్కవలుతోంది.

శ్యామలీయం గారూ, జీవిత సత్యాన్ని ఆవిష్కరించేశారుగా! అద్భుతం గా చెప్పారు.:-)

ఈ బజ్ లో సరదా గొడవకు మూల కారణమైన నా మాగాయ పోస్టు ఇదిగో

http://manishi-manasulomaata.blogspot.com/2011/05/blog-post.html

జాన్‌హైడ్ కనుమూరి said...

శ్యామలీయం గారు
సత్యాని వచించారు.... మీ మాటలు శిరోధార్యమే

జాన్‌హైడ్ కనుమూరి said...

puranapandaphani
Yamahaala Sudhaakar
Shashi kala gaarlaku thanks for your comments

జాన్‌హైడ్ కనుమూరి said...

సుజాత గారు
పాత ఫైల్సు వెతుకుతుంటే ఇవి కనిపించాయి.
తెదీలు చూస్తే సరిగ్గా సంవత్సరం పైన ఓ ఐదు రోజులు
ఇందులో మూడు విషయాలు గమనించాను అందుకే మళ్ళి పోస్టుచేయాల్ని పూనుకున్నా

1. ఆవకాయ, మాగాయల నెపంతో సరదాగా సాగిన సాహిత్య గుభాలింపు...తాలింపు
2. నేను అప్పటికి పోస్టు ఆపరేటివ్ కేర్ లో వున్నా, కాలక్సహేపం కోసం ఓ అరగంట అనుమతిచ్చేవారు మా ఇంటిలో. అంత కారంలోనూ మమకారం చూపించిన తెలుగు దనం
3. నేను ఏమిటి ఆపరిస్తితుల్లో పద్యం రాయటమేమిటి?
ఆన్ లైను సరిగ్గా సహకరించలేదుగానీ
మరో పుంజీడు రాసి పాడేవాణ్ణేమో .... అనిపించడం.

ఒక్కసారి జ్ఞాపకాలు తాజా తనాన్ని తెస్తాయి అనడం ఈ మాటల్కే సరిపోతుంది
,ఇత్రులందరికీ మరోసారి ధన్యవాదలు

SHANKAR.S said...

అప్పటి ఆవకాయాసుర సంగ్రామాన్ని మరోసారి గుర్తుచేసినందుకు ధన్యవాదాలు జాన్ గారూ. బజ్జుకాలంనాటి అపురూప జ్ఞాపకాలలో ఇది కూడా ఒకటి.

బులుసు సుబ్రహ్మణ్యం said...

బజ్జులో నేను విపరీతం గా అభిమానించే టపాల్లో ఇది ఒకటి. ఎక్కువ మంది పాల్గొన్న బజ్జు పోస్ట్ కూడా ఇదే ననుకుంటాను. రెండు బజ్జు పోస్ట్ లు అనుకుంటాను. శంకర్, సౌమ్య ల పద్యాల యుద్ధం మరువలేనిది.

మళ్ళి ఒక మాటు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

శ్రీనివాస్ పప్పు said...

హేవిటీ ఈ తిండిగోలంతా నేలేకుండానే నేనొప్పా నేనొల్లా నేనూర్కోన్