జీవితమొక సుందరస్వప్నం
ఎయిడ్స్ ఓ దుశ్వప్నం
క్షణికంకోసం కానీయకు విషతుల్యం
క్షమించదు సమాజం
ఓ చిన్ని అ జాగ్రత్త
జీవితానికి మలుపు
మారణాయుదపు పిలుపు
తస్మాత్ జాగ్రత్త
ముందుజాగ్రత్త!
మురిపించే విజయానికి సగభాగం
మరి అజాగ్రతా!
ముంచుకొచ్చే చరమగీతం
క్షణికమైన ఆవేశంతో
అక్రమ సంబంధం
వేశ్యాసాంగత్య ద్వారబంధంలో
ఒక్కసారి అడుగేస్తే
జీవితాన్ని దహించే నిప్పురవ్వే
ఎదురుచూస్తోన్న మృత్యుకౌగిలే!
***
సూక్స్మంగా రక్తనాళాల్లో
ఇంకిపోయే ఎయిడ్స్
కరచాలనంలోకి
కనీసం ప్రవహించలేదీ ఎయిడ్స్
రోగుల్ని
శ్మశానంలో వదిలినంతమాత్రాన
రోగం వదలిపోదు
రోగ కారకాలను
ముసురుతున్న మౌఢ్యాలను
నిలదీసి విడదీసి చర్చించినప్పుడే
రోగాన్ని సమాజం పొలిమేరల్నుండి
తరిమేయగలం
మరణం దేనికి సంకేతం?
శరీరానికా! కుటుంబానికా! సమాజానికా!
మున్ముందు ఆహ్వానిస్తున్న లగ్నపత్రిక
ఎయిడ్స్ కాదా?
ఉద్యమిద్దాం
కలసి పనిచేద్దాం
రోగాన్ని ద్వేషించు
రోగిని ప్రేమించు
వివరంగా చర్చించు
రోగిని స్పర్శించు
మానవత్వాన్ని బ్రతికించు
ఎదురుగా ఉన్నది రాబోయే తరం
ఎయిడ్స్ లేని సమాజం నీవిచ్చే వరం
***
కాలగమనంలో
మరణం ముఖం మార్చుకుంటుంది
ఓ కలరా, ఒక మసూచి, మరో కేన్సర్
ఓడిపోయిన చిహ్నాలే
మరో చిహ్నాన్ని నిలబెడదాం
మరో చిహ్నాన్ని నిలబెడదాం
ఇప్పుడు ఎయిడ్స్ ఓడిపోకతప్పదు
కలసిపోరాడుదాం
2 comments:
దివ్య భవ్య సందేశం హైడ్ సాబ్ ! ..".రోగాన్ని ద్వేషించురోగిని ప్రేమించు వివరంగా చర్చించురోగిని స్పర్శించుమానవత్వాన్ని బ్రతికించు".
Kanakaambaram (Nutakki Raghavendra Rao.)
Thank you
Raghavendra raoji
Post a Comment