Monday, November 14, 2011

ఫేసుబుక్కు ఆరు నెలల ప్రయాణం – సింహావలోకనం


ఏప్రిల్, మే, జూన్ నెలలలో మెడికల్ శెలవులో వున్నప్పుడు  మే నెలలో ఇంటిలో నెట్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. అంతర్జాలము నాకేమి కొత్త కాదు. నేను బ్లాగు మొదలు పెట్టిన తొలినాళ్ళలో సుమారు 200 బ్లాగర్లు మాత్రమే వుండేవారు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ బ్లాగులు రాసిన రోజులవి. అప్పట్లో మదర్స్ డే సందర్భంగా  రాసిన పోస్టులతో అమ్మ అనే ఈ సంకలనం చేయడం జరిగింది. తెలుగులో వచ్చిన మొదటి ఈ సంకలనము. రెండవ ఈ పుస్తకము,
అంతర్జాల పోస్టులతో నాన్న  సంకలనం చేయాలని ఎప్పటిదో కొందరిమిత్రుల కోరిక.  ఫాదర్స్ డే రోజునుంచి కొంతమంది స్పందించారు. వారిలింకులనుండి పోస్టులను సేకరించాను. పేజి సెట్టింగులు చేసి కొంత పనిచేసాను కంప్యూటరులో వైరస్ రావడం, బ్యాకప్ తీసుకొనే అవకాశం చిక్కకుండా ఫార్మేట్ అవ్వడంతో ఆ కోరిక సగంలోనే అసంపూర్ణంగా మిగిలిపోయింది. శరీరం అనుకూలిస్తే అది పూర్తి చెయ్యాలి. ఇంతకుముందు స్పందించిన మిత్రులు ఇది చదువుతున్నట్లయితే మీ లింకులు పంపండి ప్రయత్నాన్ని కొనసాగిస్తాను.   
సేకరించిన డాటా కోల్పోవడం చాలా బాదాకరం అనిపించింది.
అప్పుడే శ్రీమతి శైలజామిత్ర ఫేస్ బుక్కును పరిచయంచేసారు. ప్రతీరోజు గాయాలకు డ్రెస్సింగు అయ్యాక భోజన సమయంలోపు గ్రూపులోనివి  చదవడం అలవాటయ్యింది.. వివిధ మిత్రులద్వారా కొన్ని గ్రూపులు పరిచయమయ్యాయి. నిద్ర పట్టని రాత్రులను ఫేసుబుక్కు కవిత్వంలో గడిపాను.

సాహిత్య మిత్రులు, సాహిత్యనిధి, స్వేచ్చ, తెలుగు సాహితీ వలయం, మొజాయిక్, ప్రేమ ప్రేమకై.. ప్రేమించు, నానోలు ...ఇలా గ్రూపులు పరిచయమయ్యాయి. 
శైలజా మిత్ర సాహితినిధి, సాహితిమిత్రులు గ్రూపును పరిచయం చేసారు
జ్యోతిర్మయి తెలుగు సాహితీవలయం గ్రూపును పరిచయంచేసారు
ఈగ హనుమాన్ నానోలు గ్రూపును పరిచయంచేసారు
మురళీధర్ నామాల స్వేచ్చ గ్రూపును పరిచయం చేసారు
జగతి జద్దాత్రి మొజాయిక్ గ్రూపును పరిచయంచేసారు
శ్రీనివాస్ వాసుదేవ్ ప్రేమ ...ఒరేమకై ప్రేమించు... గ్రూపును పరిచయం చేసారు
 

ఇంతకుమునుపే సాహిత్యంలో పరిచయమున్నవారు ఫేసుబుక్కులో కొద్దిమంది మాత్రమే వున్నా నేను వున్న శారీరక పరిస్థితిని బట్టి ఆన్ని చదివినా నచ్చినవాటిని మాత్రమే అభిప్రాయాలు రాయటం మొదలుపెట్టాను.
వాదులాటలు, కీచులాటలు అభిప్రాయభేదాలు ఏ గ్రూపుల్లో కూడా తలెత్తినప్పుడు వాటినుండి దూరంగానే వున్నాను. 
కొందరికి నేను చేసిన సూచనలు నచ్చాయి, నచ్చినవారు అమలుచేయడం కనిపించింది. కొందరు వారిదోరణిలో(మొనాటనీ) వారు వెళుతున్నట్టే కన్పించారు. అటువంటివారి పోస్టులు పెద్దగా పట్టించుకోవడం మానేసాను.
ఆసుపత్రి అనుభవాలను అక్షరీకరిద్దామనే బలీయమైన కోరిక వుండేది, మొదలుపెట్టి కొన్ని పోస్టులు రాసాను. అవి చూసి వీడేంటి ఇలా రాస్తున్నాడు అనుకున్నవారు వుండేవుంటారు. రెండు మూడు నెలల తర్వాత ఆ పోస్తులను అన్నీ ఒకచోట పెడదాము అనుకుని ప్రయత్నం చేసా కానీ ఫేసు బుక్కులో రాసిన పోస్టులు శాశ్వతంగా (బాక్ అప్) ఉండవని అప్పుడే తెలిసింది.    వాటిని కోల్పోయాను. మళ్ళీ అలాగే రాయలేను.
 ఒకొక్కరిగా పరిచయాలవుతున్న నేపద్యంలో కొందరి మాటలు స్వాంతనను, కొత్త స్పూర్తిని నింపితే కొందరి మాటలు, పనితీరులు కొంత నొప్పించాయి. అప్పుడే గ్రూపులో ఏమి జరుగుతుంది అని చూడటం కంటే నాకు ఏది అవసరం అనే విషయంపైనే శ్రద్ద పెట్టాలి అని నిర్ణయించుకున్నాను.
పరిచయాలలో :
మురళీధర్ నామాల
బ్లాగులలో పరిచయం. తూర్పు పడమరల సమయ తేడాలవల్ల నిత్యం ఆన్‌లైనులో తోచినదేదో మాట్లాడినవాడు.
స్వేచ్చగ్రూపుకు మార్గం చూపాడు. ఇంచుమించు నా అన్ని రాతలను చదివిన వాడు.  
ఈగ హనుమాన్ ఫేసుబుక్కులో కంటే ముందుగానే తెలిసిన సాహితీమిత్రుడు. చాలా సందర్భాలలో కలిసిన, తరచూ ఫోనులో మాట్లాడుకొనే సాన్నిహిత్యం.  నానోలలోని   రసాస్వాదనను  నాకు ఎక్కించాడు. 

ఫేసుబుక్కులో కంటే ముందుగానే తెలిసిన సాహితీమిత్రుడు. తరచూ ఫోనులో మాట్లాడుకొనే సాన్నిహిత్యం.  

జగతి జగద్దాత్రి - ఫేసు బుక్కుకంటే ముందుగానే తెలిసినా, ఫేసు బుక్కు సాహితీ సాన్నిహిత్యాన్ని పెంచింది. చాట్ చేస్తూ చేస్తూ మాట్లాడిన పదాలలోంచి పాటలుగా అల్లడం జరిగింది. ఆ ధోరణి(ఫీవర్) కొన్నిరోజులు సాగి సుమారు 12 పాటలు రాయడం జరిగింది. నా బ్లాగులో చూడవచ్చు. విశాఖకు వస్తే మొజాయిక్ ఆహ్వానం అనడంతో అక్టోబరు నెలలో (10.10.2011)  మండే మొజాయిక్‌ లో పాల్గొనడం జరిగింది. దాని వివరాలు బ్లాగులో చదవొచ్చు. 
నూతక్కి రాఘవేంద్ర రావు :
ఈయన మూడుచక్రాల బండి అనే కిరీటంతో రాసినవి నన్ను ఆకట్టుకోవడమే కాకుండా, మరింత సన్నిహితం చేసాయి. పెద్దవయసులోకూడా ఆయన  కవిత్వాన్ని  గురించి చూపించే ఆసక్తి  నన్ను అబ్బుర పరుస్తూనేవుంది. నన్ను ఉత్తేజపరుస్తూనేవుంది.
బహుముఖ ప్రజ్ఞలు ఈమె కలిగి వుండటం ఆశ్చర్యపరచిన సందర్భంలో నన్ను గజల్ రాయమని సూచించడం జరిగింది. నేను మొజాయిక్‌లో పాల్గొన్నప్పుడు నేను రాసిన పాటను పాడివినిపించి మరింత ఆశ్చర్యానికి లోను చేసారు. కొన్ని గజల్స్ ప్రయత్నించడం  జరిగింది.

జగన్నాద్ వడిమెల్ల
కవికిరీటి మీకు నేను ఏకలవ్య శిష్యుడను అంటూ ఉక్కిరిబిక్కిరిచేసే సోదరుడయ్యారు.

తను రాసిన వీరి వీరి గుమ్మడిపండులో నన్నూ చేర్చడంద్వారా చేరువయ్యి నేను విశాఖ వెళ్ళినప్పుడు నా కవిత్వం గురించి సభలో పరిచయంచేసారు.

రసవత్తరంగా రాసే కవిత్వంతో పాటు అంతే రసవత్తరంగా ఆయన అభిప్రాయలు వెలిబుచ్చడం నన్ను సన్మోహనపరచాయి. గ్రూపులో బైబిలు వాక్యాలను పోస్టు చేయమని   ఉదయమే చదవడం చాలా బాగుంటుదని అని  బాధ్యతనిచ్చారు.
శ్యామిలి నయబిల్లి
పోస్టు చేయగానే లైకు పెట్టదానికి ముందువుంటుంది. ఎప్పుడు ఆన్‌లైనులోనే కనిపిస్తుంది. ఎప్పుడు నిద్రపోతుందా అనేది నా అనుమానం
తమదైన గొంతులతో కవిత్వాన్ని వ్యక్తీకరిస్తూ నాకెందుకో వీరి కవిత్వాన్ని చదవాలనే ఆసక్తిని కలిగించారు
కల్లూరి శైలబాల
తక్కువ పరిచయం ఎక్కువ ఇంపాక్ట్ /అనుభవం
ఓరోజు మీ కవితా నేపద్యం రాయండి అని ఒక పోస్టువేసారామె. దానికి స్పందిస్తూ నేను కొన్ని పోస్టులు రాసాను. రెండుమూడు పోస్టుల మినహా మిగతావి అమె చూసినట్టు నాకు అనిపించలేదు. ఎవరికి వారు అక్షరాల వెనుక, అక్షరాల మధ్య చదువుకునేది  కవిత్వం. నేపద్యం పాఠకుడికి చెప్పడంవల్ల అక్షరాల ముందు వెనుక, మధ్య అనే పరిధికి  పరిమితులు గీసినట్టు అవుతుంది. అదే విషయం మిత్రులు చెప్పారు, ఇది కోరినది శైలబాల  అయినా నన్ను నేను పునః పరిశీలించుకోవడానికి దోహదపడుతుందని రాసాను.
అవి ఒక డాక్యుమెంటుగా పొందు పరచాను. మరోసారి పోస్టుచేస్తాను.
కొన్నిరోజులతర్వాత మళ్ళి గ్రూపులో కనబడి ఎదో అడిగారు ఆమె. ఇలా అడుగుతారు మళ్ళీ కనబడరు అనేసరికి కోపమొచ్చినట్టువుంది. ఆ పోస్టును డిలీట్ చేసారు మళ్ళీ నాకు గ్రూపుల్లో తారస పడలేదు.
* * *

మూడునెలల శెలవుల తర్వాత ఉద్యోగానికి వెళ్ళడం ప్రారంభించాను. ఆఫీసు అవసరాల దృష్ట్యా ఎప్పుడూ ఆన్‌లైను ఉండటం వల్ల ఫేసుబుక్కులోకి తొంగిచూసే అవకాశం చిక్కింది. 
మెల్ల మెల్లగా పనిభారం  పెరుగుతూ  వచ్చింది. అలా రావటంవల్ల చదివిన వాటికి అభిప్రాయాలు రాసే సమయం తగ్గిపోయింది.
సెప్టెంబరు 5న చాలారోజుల తర్వాత వురకలేసిన నా కలం - అనే కవిత రాసాను. అది చాలారోజుల తర్వాత రాసిన కవిత అది. దాని తర్వాత రాయటం తరుముకొచ్చింది.
------------------
ఈ మద్యలోనే చేసిన ఇతర పనులు
ఎప్పుడో రాసిన ప్రేమాంతరంగం - కావ్యాన్ని బ్లాగులో పోస్టుచేసాను.
తెలుగు ఇంగ్లీసులలో వచనం వంబడి వచనంగా  బైబిలులోని అధ్యాయాలు తెలుగు బైబిలు  బ్లాగులో పోస్టుచేసాను.
--------------
ఎక్కువసమయం ఆ ఫేసుబుక్కులోనే గడుపుతున్నావు అని నా ప్రక్కటెముక హెచ్చరిస్తుంది
అందుకే కొన్నిరోజులు అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తాను.

నా అభిప్రాయాలు రాస్తే బాగుంటుందని ఎదురుచూసి ఎవరైనా నిరుత్సాహం చెందితే మన్నించండి.


సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు  పీతవి

10 comments:

జ్యోతిర్మయి ప్రభాకర్ said...

మీ ఫేస్ బుక్ ఆర్నెల్ల ప్రయాణం బాగుందండి..మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేవారూ, అప్పుడప్పుడూ మాటలతో నొప్పించేవారూ ఎదురయ్యే అవకాశం మెండుగా ఉండే ప్రయాణం ఇది.. అన్నీ చవిచూసి నెమరువేసుకోవడం బాగుంది..నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానాన్ని బహుముఖ ప్రజ్ఞలుగా మీరు భావించడం నా అదృష్టం..నా ప్రస్తావన ఈ సింహావలోకనం లో రావడం నాకు సంతోషాన్ని కలిగించింది..ధన్యవాదాలు

కెక్యూబ్ వర్మ said...

మీ ఫేస్ బుక్ ఆర్నెల్ల సింహావలోకనం బాగుంది సార్...త్వరగా కోలుకొని మాకు దిశా నిర్దేశం చేస్తారని ఆశిస్తూ...

MURALI said...

ఇండియా వచ్చాక పెద్దగా మనం మాట్లాడుకోవటం, నేను బ్లాగులు చూడటం కుదరలేదు. మీరు నాన్న సంకలనం, ఆసుపత్రి అనుభవాలు పూర్తిచెయ్యాలని ఆశిస్తున్నాను.

ప్రవీణ said...

మీ అనుభవాలు మాతో పంచుకోవటం ఏంటో బాగుంది. నాకు మీరు ఇచ్చిన సలహాలు ఎంతో స్పూర్తిని ఇచ్చాయి..
Iam glad to be in ur list..

జాన్‌హైడ్ కనుమూరి said...

జ్యోతిర్మయి గారు
ఫేసుబుక్కు అంత అవసరమా అనే ప్రశ్న నుండి ఈ పోస్టు రాయడం జరిగింది.
పోజటివ్‌లు ఎక్కువగా కనిపించాయి. ఎక్కువ పాజిటివ్‌లు నెగిటివ్‌లను మింగేసాయి.

ధన్యవాదాలు

జాన్‌హైడ్ కనుమూరి said...

ధన్యవాదాలు కెక్యూబ్ వర్మ గారూ .....

జాన్‌హైడ్ కనుమూరి said...

మురళి ఈ పోస్టును మేనుంచి - అక్టోబరు కాలంల్లో పరిచయాలు, చాట్లు వాటి ప్రభావాల దృష్టిలో పెట్టుకొని వ్రాసింది
మీరు ఇండియా వచ్చినట్టు ఇప్పుడే అర్థమయ్యింది.
ధన్యవాదాలు

జాన్‌హైడ్ కనుమూరి said...

ప్రవీణ
ధన్యవాదాలు

Nutakki Raghavendra Rao said...

ఫేసుబుక్కు ఆరు నెలల ప్రయాణం – సింహావలోకనం

జాన్ సాబ్ !మీ యీ ప్రయాణంలో లిప్త పాటు తారసపడిన ఓ ప్రయాణి కుడను ,నాకూ ఓ ఉచిత స్థానమిచ్చి గౌరవిన్చినందుకు ధన్యుడను .నా "అణువులు"
...మూడు సెక్రాల బండి కి .... మీరందించిన ప్రోత్సాహమే ఇంధనమై నిరవధికంగా ఇరవయ్ అయిదు రొజులు కొనసాగించ గలిగాను. శ్రీమతి జ్యోతిర్మయి మళ్ళా

గారి ప్రో త్సాహంతో నానోలు గ్రూపులో చేరినా... అక్కడ మీరందించిన సలహాలు ప్రోత్సాహం నేను అతి కొద్ది కాలం లొ ఓ మూడొందలు పై చిలుకు నానోలు

వ్రాయగల శ క్తిని అందించాయి.

మీ ప్రోత్సాహం మరి కొందరు యువ కవుల ఉత్సాహం నన్ను వురకలేత్తించాయి. అక్కడ మీరు నాకు ఓ గొప్ప ఆలంబన. అదే లేకుంటే అరవై అయిదేళ్ళ

వయసులో రాత్రింబవళ్ళు కృషి చేసి ఓ యజ్ఞం లాటి ఆ కార్యం నేరవేర్చగలిగే వాడిని కాదు. "నమ్మిన స్నేహానికి నమ్మ దగ్గ స్నేహం నా మితృడు జాన్ హైడ్

కనుమూరి".... అని

ఘంటా పధంగా చెప్ప గలను. యీ సుదీర్ఘ ప్రయాణం లొ అందు కోవడమే కాని ఇవ్వని సందర్భాలు ఏవైనా నా వల్ల ఏర్పడి వుంటే క్షంతవ్యుడను.

యీ స్నేహం నిరంతరం కొన సాగాలని ఆకాంక్షిస్తూ......శ్రేయోభిలాషి ...నూతక్కి రాఘవేంద్ర రావు.

జాన్‌హైడ్ కనుమూరి said...

నూతక్కి రాఘవేంద్ర రావు గారూ ,

మీరు చూపే అభిమానానికి ధన్యవాదాలు