Saturday, September 3, 2011

అమ్మ మనసున సంతసం


సంతసం అహఁ   హఁ  సంతసం
నా హృదయముప్పొంగుచున్నది
నీ వొసంగిన మేలులకై

ఆశీర్వాదపు జల్లులతో తడిపి
అనురాగపు పరిమళములతో నింపి
నీ బహుమానముల నొసగినందున
సంతసం అహఁ   హఁ  సంతసం

విజ్ఞానపు వినువీధులలో
మా జ్ఞానపు లోతులకతీతమై
నా గర్భమున ఫలము నొసంగినందున
సంతసం అహఁ   హఁ  సంతసం

ధాత్రిలో ప్రతి ప్రసవం వేదన చేసి
ధృతినిచ్చి రోదన బాధలు దీర్చి
ప్రతినిత్యం కృపలతో నింపుచున్నందున
సంతసం అహఁ   హఁ  సంతసం

నీవిచ్చిన స్వాస్థ్యములభిమానముతో
నీ దయలో పెద్దల దీవెనలతో పెంచే
బుద్ది కుశలతకై ప్రార్థించ గలిగినందున
సంతసం అహఁ   హఁ  సంతసం
 ----------------------------------------------------
ప్రతి తల్లి మనసులో పొంగే భావానికి చిన్న ప్రయత్నం

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న 
అగష్టస్ -  లీనాల కుమారుడు రాల్ప్ సుందర్ సింగ్ కనుమూరి
సత్యానంద్ - పద్మల కుమారుడు చైతన్య కనుమూరికి

గాబ్రియేలు - కృపారోజ్ ల కుమార్తె  షైనీ లిడియా

అభినందనలతో

4 comments:

కనకాంబరం said...

Nice expression .
చిన్నారులకు నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి జాన్ సాబ్ ....శ్రేయోభిలాషి ...నూతక్కి.(Kanaqkaambaram)

hemalatha putla said...

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న
అగష్టస్ - లీనాల కుమారుడు రాల్ప్ సుందర్ సింగ్ కనుమూరి
సత్యానంద్ - పద్మల కుమారుడు చైతన్య కనుమూరికి
-అభినందనలు !

కెక్యూబ్ వర్మ said...

జన్మదిన గీతం వారికి మీరిచ్చిన అపురూప కానుక, మా దీవెనలు కూడా పంచండి...

dhaathri said...

అమ్మ మనసున సంతసం ...నిజమే ఈరోజు ఎదిగిన అమ్మాయి ఎ మీ పర్వాలేదు నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అమ్మ అని చెప్పి తన జీవితాన్ని వెతుక్కుంటూ వెళుతుంటే అదే అనిపించింది అడ్డాల నాడు బిడ్డలే గానీ ఎదిగాక కాదని..ఒక కంట ఆనందం మరో కంట దుఖం జీవితమెప్పుడూ ఇంతేనేమో....జన్మదిన శుభాకాంక్షలు చిన్నారులకి ...అభినందనలు మా చిన్నారి పాట రచయిత జాన్ కి ....నన్ను వెతుక్కున్నందుకు ...ప్రేమతో ...జగతి