పడవనెక్కిన బాల్యం
ఓడనెక్కినట్టు సంబరం
తెడ్డును పరీకించిన కనులు
జీవితాన్ని చిత్రించిన రీళ్ళు
***
వాలుకు తెరచాపైనా
ఎదురుకు గడసాయమైనా
పడవెనక పారిపోతున్న అలలు
జీవితాన్నిపయనించడం నేర్పిన పనిముట్లు
* * *
ఎలా మరువగలను
వెన్నెల జలకమాడించి
పరుగులు నేర్పిన ఆ ఇసుకతెన్నలను
పచ్చదనాల నా బాల్యాన్ని
ఓడనెక్కినట్టు సంబరం
తెడ్డును పరీకించిన కనులు
జీవితాన్ని చిత్రించిన రీళ్ళు
***
వాలుకు తెరచాపైనా
ఎదురుకు గడసాయమైనా
పడవెనక పారిపోతున్న అలలు
జీవితాన్నిపయనించడం నేర్పిన పనిముట్లు
* * *
ఎలా మరువగలను
వెన్నెల జలకమాడించి
పరుగులు నేర్పిన ఆ ఇసుకతెన్నలను
పచ్చదనాల నా బాల్యాన్ని
6 comments:
అద్భుతం .....సర్ మీ అనుభూతులు అదే కాదు మీ వ్యక్త పరిచే విధానం కూడా . .హైస్కూలుకు వెళ్ళిన మొదటి రోజు బల్లకట్టు ఎక్కుతూ విన్న పడవ లాగే సరంగుల పాటలు, తెరచాప దాఫాను, తెడ్లు ఒకటేమిటి, పెద కాలవ ఉరవడిలో కొట్టుకు పోతూ జ్ఞాపకాలు ....హైలెస్స అనుకుంటా కాలవ ఒడ్డున పడవ లాగే బోయలు ....జ్ఞాపకాల పొరల నుండి నుంది తొంగి చూస్తున్నాయి .మా సంగతేమిటని ప్రశ్నిస్తున్నాయి.
Nutakki Raghavendra Rao ...(Kanakaambaram)
ఎలా మరువగలను
వెన్నెల జలకమాడించి
పరుగులు నేర్పిన ఆ ఇసుకతెన్నలను
పచ్చదనాల నా బాల్యాన్ని...
బాల్య స్మృతులను మరువలేకుండా కలిగివుండటమ్ అంటే ఆ స్మ్రృతులు అంత పచ్చగా కలిగివుండటమే....చాలా బాగుంది సార్...
కెక్యూబ్ వర్మ
మరువలేని జ్ఞాపకాలు స్పందన కలిగినప్పుడు అలా బయటికి వస్తుంటాయి
మి స్పందనకు ధన్యవాదములు
నూతక్కి గారు
భలే గురుతు చేసారు
హైలెస్సా హైలెస్సా రాగాలు
ధన్యవాదములు
చాలా బాగుందండి
nice
?!
Post a Comment