Sunday, August 28, 2011

మదిలో మెదిలే అపురూప రూపం


నీ రూపం అది అపురూపం
లీలగా మందార మాలగా
మకరంద ధారగా
నాలో నిలచి, నాలో నింపి
నిన్నే వలపింప చేస్తుంది
నన్నే మరిపింప చేస్తుంది

ఒంటరివేళ తుంటరిగా దరిచేరి
మురిపించి మైమరపించి
ఎదగిల్లి మదినల్లి
కవ్వింతల కలవరింతలతో
కళ్ళలో మెదిలేను

కళ్ళుమూస్తే కళ్ళలోచేరి
కళ్ళు తెరిస్తే ఎదలోచేరి
చెక్కిలి చిదిమి కౌగిలి నదిమి
గిలిగింతల పలవరింతలతో
తలపుల్లో తడిమేను

కఠినశిలనైన నన్ను తడిమి, తురిమి
మది తెరచి నను మలచి
ముద్దగా మైనపు ముద్దగా
జీవమై నాదమై
నా జీవితపు వేదమై కదిలేను

6 comments:

కెక్యూబ్ వర్మ said...

కఠినశిలనైన నన్ను తడిమి, తురిమి
మది తెరచి నను మలచి
ముద్దగా మైనపు ముద్దగా
జీవమై నాదమై
నా జీవితపు వేదమై కదిలేను

చాలా హత్తుకుంది సార్ ఈ ఫీల్...అభినందనలతో...

Anonymous said...

మీ మదిని రేపిన "ఆమెను" అక్షరాలా గుండెల్లో దాచుకున్న మీరు అదృష్టవంతులు...ప్రేమతో జగతి

కనకాంబరం said...

నిజంగా అద్భుతం ప్రేమ మందారం ....Raghavendra Rao Nutakki (Kanakambaram)

జ్యోతిర్మయి ప్రభాకర్ said...

"కళ్ళుమూస్తే కళ్ళలోచేరి
కళ్ళు తెరిస్తే ఎదలోచేరి
చెక్కిలి చిదిమి కౌగిలి నదిమి.."
పదాల గీతలు గీసి , ప్రేమ రంగరించి హ్తృదయ రంగవల్లిని రచించారు జాన్ గారు !

జాన్‌హైడ్ కనుమూరి said...

Jyothirmayi
ఒక్కోసారి అరగదీసే గంధం పరిమళం ప్రక్కవీధికి వస్తుంది అంటారు అలాంటిదే మీ వ్యాక్య కూడాను
Thanks for your comment

జాన్‌హైడ్ కనుమూరి said...

కెక్యూబ్ వర్మ
జగతి
కనకాంబరం
Thank you all for your comments