Friday, August 19, 2011

ఊయలలూగే మనసు


మనసా ఊగవే ఉయ్యాల
ఊగి ఊగి సాగవే ఈ వేళ

మది కురిసిన వెన్నెల్లో
సన్నని పిల్లగాలి తీవెల్లో
మురిపించే రేయి కౌగిట్లో
మురిసి మురిసి ఊగవే ఉయ్యాల

పట్టాల మెయిలులపై
చెట్టపట్టాల ఈ మెయిలుల్లో
ప్రియుడంపిన సందేశం
తలచి తలచి ఊగవే ఉయ్యాల

గాలి మరచిన ఈ గాలుల్లో
కులుకు జారిన ఈ వేళల్లో
జల్లులా తడిసిన చిన్ని అభినందనకు
తడిసి తడిసి ఊగవే ఉయ్యాల
ఎదురుచూపుల దూరాలు
ఎదను కలిపిన తీరాలుగా
చెవిలో సెల్పోను గుసగుసలను
మరి మరి తలచి ఊగవే ఉయ్యాల

8 comments:

జ్యోతిర్మయి ప్రభాకర్ said...

హాయిగా ఉయ్యాల ఊగుతున్నట్లే ఉంది చదువుతూంటే..చక్కటి బాణీ కూడా కట్టాను..పాడేసుకున్నాను కూడా..

జ్యోతిర్మయి ప్రభాకర్ said...

హాయిగా ఉయ్యాల ఊగుతున్నట్లే ఉంది చదువుతూంటే..చక్కటి బాణీ కూడా కట్టాను..పాడేసుకున్నాను కూడా..

జ్యోతిర్మయి ప్రభాకర్ said...

హాయిగా ఉయ్యాల ఊగుతున్నట్లే ఉంది చదువుతూంటే..చక్కటి బాణీ కూడా కట్టాను..పాడేసుకున్నాను కూడా..

జాన్‌హైడ్ కనుమూరి said...

Jyothirmayi
అదేదో మాక్కూడా వినిపించ వచ్చు కదా!
ఆ టెక్నాలజిని ఏమైనా పట్టారా???

కనకాంబరం said...

హాయిగా ఊయల లూగిన భావన
by Raghavendra Nuttaki on Thursday, August 18, 2011 at 11:33pm
హాయిగా ఊయల లూగిన భావన
చిన నాటి అట్లా తద్దె రోజులు గుర్తుకొస్తున్నాయి జాన్ సాబ్
వెచ్చటి చలి
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు
19-08-2011
11-40 వు
తెల్లవారు ఝామున
నిండు వెన్నెల వెలుగు లలో
పొంతలో కాగిన వేడి నీళ్ళ స్నానం
కొత్త బట్టలేసుకొని బయటికొస్తే
వెచ్చటి చలి

ఎత్తులో వున్న
బలమైన వేప కొమ్మకు
రెండు వరసల మోకు కట్టి
కోర్చోనేందుకు వీలుగా
గోనే పట్టా తొట్టి కట్టి
కూర్సొండి దోర
నేనూపుత
బయప డొద్దు
నేనున్నా కద
బరోసా !
(మా వెంకడు తాత ( పెద పాలేరు )
నిబద్ధత ఇంకా నా చెవిలో .....
వినిపించేలా చేశారు . )

వాసుదేవ్ said...

రేయి కౌగిట్లో ఊయలలూగుతున మనసు....భావుకత్వానికి మరో మంచి కోణం జాన్ గారు.. మీ వాసుదేవ్

జాన్‌హైడ్ కనుమూరి said...

రాఘవేంద్ర నూతక్కి గారు
మి బాల్య జ్ఞాపకాలను మాతొ పంచుకున్నందుకు సంతోషం
మీ స్పందనకు ధన్యవాదములు

జాన్‌హైడ్ కనుమూరి said...

వాసుదేవ్ గారు
మీ స్పందనకు ధన్యవాదములు