నీవే వున్నావు..
నా మనసంతా నీవే వున్నావు
నా తలపుల్లో నా మలుపుల్లో
కనురెప్పల కలత నిదురలో
తళ్ళుక్కున మెరిసే మెరుపులా
రెప్పల్లో కనువిప్పుల్లో
నీవే వున్నావు..
ఉడికించే వడగాలుల్లో
సోలిపోని మల్లెల మాలగా
స్వేదంలో అనుస్వాదనలో
నీవే వున్నావు..
పయనించే జీవన దారుల్లో
తోడుండే ధైర్యపు నీడగా
అడుగుల్లో అడుగుజాడల్లో
నీవే వున్నావు..
నా మనసంతా నీవే వున్నావు
నా తలపుల్లో నా మలుపుల్లో
కనురెప్పల కలత నిదురలో
తళ్ళుక్కున మెరిసే మెరుపులా
రెప్పల్లో కనువిప్పుల్లో
నీవే వున్నావు..
ఉడికించే వడగాలుల్లో
సోలిపోని మల్లెల మాలగా
స్వేదంలో అనుస్వాదనలో
నీవే వున్నావు..
పయనించే జీవన దారుల్లో
తోడుండే ధైర్యపు నీడగా
అడుగుల్లో అడుగుజాడల్లో
నీవే వున్నావు..
8 comments:
అద్భుతం
"ఉడికించే వడగాలుల్లో
సోలిపోని మల్లెల మాలగా
స్వేదంలో అనుస్వాదనలో
నీవే వున్నావు.."
యీ భావనం...
.Nutakki Raghavendra Rao (Kanaqkambaram)
mmmmmmmmm chaalaa gana vahinilo prema ooyalooguthunnadi john sir gar i manasu paata chala bagundi...love j
బావుంది జాన్ గారు...ఒకసారి 'ఇష్టపడ్డా'క మరి అన్ని చోట్లా కన్పడ్డం సహజమే కాని నిజాన్ని మీ పాటలొ చదవడం కొత్తగా చూపించారు.....వాసుదేవ్
"అడుగుల్లో అడుగుజాడల్లో
నీవే వున్నావు.."
ఆద్యంతమూ, తియ్యని అనుభూతిని కలిగించింది పాట
రాఘవేంద్ర గారు
స్పందనకు ధన్యవాదములు
జగతి
నా పాట మిమ్మల్ని ఊయలూగించ గలిగినందుకు సంతోషం
స్పందనకు ధన్యవాదములు
వాసుదేవ్
మీ పరిశీలకు
స్పందనకు ధన్యవాదములు
జ్యోతిర్మయి గారు
మీ స్పందనకు ధన్యవాదములు
Post a Comment